Seedless Mango : సీడ్ లెస్ మ్యాంగో వచ్చేసింది ! ఇదిగో రుచి చూస్తారా ?
సీడ్ లెస్ మామిడి కాయలు వచ్చేశాయి. ధాయ్‌లాండ్‌లో ఇవి కోతకు వచ్చాయి. మన దేశంలో ఇంకాపరిశోధనలు జరుగుతున్నాయి.
మామిడి పండ్లను ( Mango ) ఇష్టపడని వారు ఉండరు. కానీ టెంకనే చాలామందికి పెద్ద సమస్య. సగం బరువు టెంకలోనే ఉంటుదని బాధపడేవారు కూడా ఉంటారు. ఎన్నో సీడ్ లెస్ కాయలు వచ్చాయి కానీ మామిడికి టెంక లేని కాయలు ( Seed less Mango ) రాలేదా అని మామిడి కాయలు తినేటప్పుడు చాలా మందికి వచ్చే ఆలోచన. ఇది నిజం అవుతోంది. సీడ్ లెస్ మ్యాంగోస్ వచ్చేశాయి. అయితే ఇంకా ఇండియా దాకా వచ్చాయో రాలేదో కానీ ధాయ్‌లాండ్‌లో ( Thailand ) మాత్రం వచ్చేశాయి. టెంకలేని మామిడిపండ్లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Almost seedless mango. Mahachanok from Thailand. pic.twitter.com/Uxb5yU7F5M
— lonely2 (@Aloneir) March 29, 2022
నిజానికి సీడ్ లెస్ మ్యాంగో కోసం దేశంలో ( india ) ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. రత్న, అల్ఫోన్సో (కలెక్టరు) రకాల నుంచి హైబ్రిడ్ పద్ధతిలో టెంకలేని మామిడి పండ్లను రూపొందించారు. ఈ రకానికి సింధు ( Sindhu ) అని పేరు పెట్టారు. దీనిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో నాటి ఫలితాలు ఒకేలా వస్తున్నాయో లేదో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. సింధు రకాన్ని భారీగా తోటల్లో వేయడంతో పాటు, ఇళ్లలో వేసినా ఒకేలాంటి ఫలితాలు వచ్చేలా పరిశోధనలు చేస్తున్నారు.
These mangoes are “Mahachanok Mango” almost seedless, with mostly for exporting. For those who claim that your hometown mango is the best, I have no idea about it. But Thai mango is so various type and favors. “THIS KIND OF MANGO IS HARD TO BUY IN THAILAND” but yeah it’s Thai. https://t.co/h44ncmGX5X
— 小雨ʕ”̮ॽु (@xxiaoyu5208) March 30, 2022
రైతులకు సింధు రకం మామిడి మొక్కలు అందుబాటులోకి రానున్నాయని బీహార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఉద్యాన శాఖ చైర్మన్ కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో గల కొంకణ్ కృషి విద్యాపీఠ్ లో సింధు రకం పళ్లను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పంటల ఫలం ఏమైందో ఇంకా స్పష్టత లేదు.
అయితే ఇలాంటి మామిడిపళ్లు ఆరోగ్యానికి మంచిది కాదని.. పోషకాలు కూడా ఉండవన్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అందుకే ఇప్పుడు వీటి గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చాలా మంది నెగెటివ్ కామెంట్సే పెడుతున్నారు.