Russian Plane Missing: రష్యాలో విమానం అదృశ్యం, 50 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయిన తర్వాత మిస్సింగ్
Russian Plane Crash: రష్యాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. విమానం టేకాఫ్ అయ్యాక గాలిలో అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధం తెగిపోయింది.

Russian Plane Crash: రష్యాకు చెందిన ఒక విమానం టేకాఫ్ అయిన తర్వాత గాలిలోనే అదృశ్యమైంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ విమానం 50 మంది ప్రయాణికులతో చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న అమూర్ ప్రాంతంలోని టిండా నగరం వైపు వెళుతోంది, టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి.
ఫిబ్రవరి ప్రారంభంలో, పైలట్ సహా 10 మందితో బెరింగ్ ఎయిర్ నడిపే సెస్నా విమానం అలాస్కాలో తప్పిపోయింది. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, ఆ విమానం ఉనలక్లీట్ నుంచి నోమ్‌కు వెళ్తోంది. తర్వాత నోమ్‌కు ఆగ్నేయంగా 34 మైళ్ల దూరంలో శకలాలను గుర్తించారు. ఈ దుర్ఘటనోల పది మంది మరణించారు.
మార్చి 2014లో 239 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం MH370, బోయింగ్ 777, గాల్లోనే అదృశ్యమైంది. నేటికి కూడా ఆ విమానం గుర్తించలేకపోయారు. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల అన్వేషణ నిలిపేస్తున్నట్టు తెలిపారు.





















