Japan Tsunami Warning: రష్యాలో 8.7 తీవ్రతతో భారీ భూకంపం, జపాన్‌లో సునామీ హెచ్చరిక - వీడియో చూశారా
Russia Earthquake | రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించడంతో పలు దేశాలు అప్రమత్తం అయ్యాయి. రష్యా, జపాన్ లకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

Tsunami Warning In Japan, Russia and US | మాస్కో: రష్యాలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం సమీపంలో 8.7 తీవ్రతతో భారీ భూకంపం (Russia Earthquake) సంభవించింది. కొన్నిచోట్ల రిక్టర్ స్కేలుపై 8.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. కమ్చట్కా ద్వీపకల్పం సమీపంలో సంభవించిన భారీ భూకంపంతో జపాన్ తన పసిఫిక్ తీరానికి సునామీ హెచ్చరికను జారీ చేసింది. పసిఫిక్ తీరంతో పాటు అమెరికా, రష్యాలోనూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
జపాన్ పసిఫిక్ తీరం వెంబడి 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసి పడతాయని, సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. హెచ్చరిక చేసిన అరగంటలోపు ఉత్తర జపాన్ తీరాలపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. జపాన్ తరచూ భూకంపాలకు లోనవుతుంది.
Breaking: A powerful 8.6 magnitude earthquake has struck Russia. Authorities are assessing the damage and potential tsunami risks. Stay tuned for updates.#Earthquake #RussiaEarthquake #BreakingNews #NaturalDisaster #EmergencyAlert pic.twitter.com/odNxNl6705
— NatureVibeHub (@naturevibes0279) July 30, 2025
పలు దేశాలకు సునామీ వార్నింగ్..
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం కారణంగా భవనాలు దెబ్బతిన్నాయి. భూమి కంపించిన సమయంలో భయాందోళనతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారని.. దెబ్బ తిన్న ఇళ్లను ప్రజలు ఖాళీ చేయించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. బుధవారం సంభవించిన భారీ భూకంపం పలు దేశాలపై ప్రభావం చూపింది. ఆ భూకంపం కారణంగా అమెరికా, జపాన్, రష్యా.. సమీప దేశాలలోని ఇతర ప్రాంతాలకు పసిఫిక్ మహాసముద్ర సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు.
అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంపం 19.3 కిలోమీటర్ల (12 మైళ్లు) లోతులో సంభవించింది. అవాచా బేలో దాదాపు 165,000 జనాభా కలిగిన తీరప్రాంత నగరం పెట్రోపావ్లోవ్స్క్, కమ్చట్కా ద్వీపకల్పానికి తూర్పు-ఆగ్నేయంగా దాదాపు 125 కిలోమీటర్ల (80 మైళ్ల) దూరంలో భూకంపం సంభవించింది. మొదట 8.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ప్రకటించిన ఏజెన్సీ తరువాత రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.7గా నమోదైనట్లు స్పష్టం చేసింది.
The U.S. West Coast is under a #tsunami watch after an 8.7 #earthquake hit Kamchatka, Russia.#Russiaearthquake #Tsunamiwarning pic.twitter.com/fTRI97OdFp
— Khanzy (@Khhanzy) July 30, 2025
ఉత్తర, దక్షిణ కొరియా దేశాలపై ప్రభావం..
చుక్, కోస్రే, మార్షల్ దీవులు, పలావ్, ఫిలిప్పీన్స్‌లలో అలలు 0.3 మీటర్ నుండి 1 మీటర్ వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సునామీ అలలు ఫిలిప్పీన్స్ ప్రాంతాలను తాకే అవకాశం ఉందని అంచనా వేశారు. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, తైవాన్ తీరాల్లోనూ రష్యాలోని ద్వీపకల్పంలో సంభవించిన భూకంపం ప్రభావం చూపుతోంది.






















