అన్వేషించండి
Pakistan No Trust Vote: చివరి బంతికి ఇమ్రాన్ ఖాన్ సిక్సర్- జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సై
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చివరి బంతికి సిక్సర్ కొట్టారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోకుండా ముందస్తు ఎన్నికలకు సై అన్నారు.
![Pakistan No Trust Vote: చివరి బంతికి ఇమ్రాన్ ఖాన్ సిక్సర్- జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సై Pakistan No Trust Vote Deputy Speaker Dismisses No-Trust Motion Against Imran Khan in Pakistan National Assembly Pakistan No Trust Vote: చివరి బంతికి ఇమ్రాన్ ఖాన్ సిక్సర్- జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సై](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/03/629a870ea14672bce8af37a5a7dc6c6c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
చివరి బంతికి ఇమ్రాన్ ఖాన్ సిక్సర్- ప్రభుత్వం రద్దు చేసి ముందస్తుకు సై
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రిజెక్ట్ చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.
ఇది జరిగిన కొద్ది నిమిషాలకేే ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
" జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షుడికి లేఖ రాశాను. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి. ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రజలను కోరుతున్నాను. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ప్రతి పాకిస్థానీకు శుభాకాంక్షలు చెబుతున్నాను. నాపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓ విదేశీ ఎత్తుగడ. పాకిస్థాన్‌ను ఎవరు పాలించాలనేది మీరే నిర్ణయించుకోవాలి. "
- ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని
చివరి బంతి వరకు
సంకీర్ణ ప్రభుత్వ సారథిగా 2018 ఆగస్టులో పాక్ పాలనాపగ్గాలు చేపట్టారు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. పాక్ చరిత్రలో ఇప్పటివరకూ ఏ ప్రధాని కూడా అయిదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అదే రూటులో వెళ్లారు. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రతిపక్షాలకు ఇన్‌స్వింగ్ యార్కర్ బంతి వేస్తానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అనుకున్నట్లుగానే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు రాకుండా చేసి ప్రజాకోర్టులోనే తేల్చుకుంటానన్నారు.
నయా పాకిస్థాన్
'నయా పాకిస్థాన్' నినాదంతో నాలుగేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన 'పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్' పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు తన భవిష్యత్తును ప్రజల చేతిలోనే పెట్టారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు తన వద్ద ఒకటి కంటే ఎక్కువ ప్రణాళికలే ఉన్నాయంటూ ఇమ్రాన్ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు.
పాక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన 'విదేశీ కుట్ర'కు నిరసనగా శాంతియుత ప్రదర్శనలు చేయాలని దేశ యువతకు పిలుపునిచ్చారు. ప్రదర్శనల్లో ఆర్మీని ఎక్కడా విమర్శించవద్దని ప్రత్యేకంగా కోరారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion