Neuralink: ఆలోచనలతో వీడియో గేమ్ ఆడిన పక్షవాత రోగి- మెదడులో చిప్ అమరికలో మరో ముందడుగు
మెదడు, శరీరంలో చిప్‌లు అమర్చడానికి సంబంధించి ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించిన న్యూరాలింక్.. తాజాగా ఓ వ్యక్తి మెదడులో సక్సెస్‌ఫుల్‌గా చిప్‌ను అమర్చింది. ఆ చిప్ అమర్చిన వ్యక్తి... ప్రస్తుతం చెస్ ఆడాడు.
Neuralink: మెదడు(Brain)లో, శరీరంలో చిప్(Chip)లు అమర్చడానికి సంబంధించి ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించిన న్యూరాలింక్(Neuralink).. తాజాగా ఓ వ్యక్తి మెదడులో సక్సెస్‌ఫుల్‌గా చిప్‌ను అమర్చింది. ఆ చిప్ అమర్చిన వ్యక్తి.. చెస్ ఆడాడు. ప్రస్తుతం సదరు రోగి కోలుకుంటున్నాడని.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని న్యూరాలింక్ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్(Elan musk) తాజాగా ప్రకటించారు. దీంతో మనుషుల మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చేందుకు చేస్తున్న ప్రయోగాల్లో మరో కీలక ముందుడుగు పడినట్లు అయింది. తొలిసారి ఓ వ్యక్తి మెదడుకు విజయవంతంగా వైర్‌లెస్ చిప్‌ను అమర్చామని న్యూరాలింక్ ఫౌండర్ ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఆ వ్యక్తికి సోమవారం ఆపరేషన్ నిర్వహించి.. సక్సెస్‌ఫుల్‌గా చిప్‌ను అమర్చామని.. ప్రస్తుతం ఆ వ్యక్తి వేగంగా కోలుకుంటున్నాడని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ క్రమంలో తొలి ఫలితాల్లో స్పష్టమైన న్యూరాన్ స్పైక్ డిటెక్షన్‌ను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే అనేక ప్రయోగాలు!
కంప్యూటర్ సాయంతో మనిషి మెదడు నేరుగా సమన్వయం చేసుకునే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ ప్రయోగాలకు.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ-(FDA) గత ఏడాది మే నెలలో ఆమోదం తెలిపింది. అయితే వీటిపై ముందుగానే పరిశోధనలు జరిపిన ఎలాన్ మస్క్(Elan Musk)కు చెందిన న్యూరాలింక్ సంస్థ.. ఇప్పటికే పందులు, కోతుల మెదడులలో కొన్ని ఎలక్ట్రానిక్ చిప్‌లను విజయవంతంగా అమర్చి పరీక్షలు జరిపింది. ఈ ఎలక్ట్రానిక్ చిప్ అత్యంత సురక్షితమైందని.. విశ్వసనీయమైందని వెల్లడైనట్లు న్యూరాలింక్ సంస్థ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఎలక్ట్రానిక్ చిప్ సాయంతో ఒక కోతి `పాంగ్` అనే వీడియో గేమ్‌ను కూడా ఆడిందని తెలిపారు.
The first human Neuralink patient, who is paralysed, controlling a computer and playing chess just by thinking. pic.twitter.com/eMt159JoIg
— Historic Vids (@historyinmemes) March 21, 2024
పక్షవాతానికి గురైన రోగి విషయంలో..
పక్షవాతానికి గురైన ఒక రోగికి కూడా న్యూరాలింక్ ద్వారా బ్రెయిన్-చిప్ పరికరాన్ని అమర్చారు. దీంతో అతను కొలుకుని చెస్ ఆడగలిగాడు. కర్సర్‌పై తన ఆలోచనలతో నియంత్రణను ప్రదర్శించాడు. ప్రపంచంలోని మొట్టమొదటి న్యూరాలింక్ రోగి నోలాండ్ అర్బాగ్(29). కంప్యూటర్‌ను నియంత్రించడం గమనార్హం. ఎలోన్ మస్క్ తీసుకువచ్చిన `బ్రెయిన్-చిప్ స్టార్టప్` న్యూరాలింక్ గురువారం తన మొదటి రోగి న్యూరాలింక్ పరికరాన్ని ఉపయోగించి తన ఆలోచనల ద్వారా ఆన్‌లైన్ చెస్, వీడియో గేమ్‌లను ఆడగలదని చూపించింది. ఇంటర్నెట్‌లో ప్రస్తుతం ఈ వీడియో విస్తృతంగా వైరల్ అవుతుండడం గమనార్హం.
వీడియోలో.. రోగి నోలాండ్ అర్బాగ్ అని పరిచయం చేసుకున్నాడు. అతను డైవింగ్ ప్రమాదంలో భుజం క్రింద భాగమంతా పక్షవాతానికి గురయ్యాడు. న్యూరాలింక్ చిప్‌ను అమర్చిన తర్వాత.. తన ల్యాప్‌టాప్‌లో చెస్ ఆడుతూ, న్యూరాలింక్ పరికరాన్ని ఉపయోగించి కర్సర్‌ను కదిలించడాన్ని చూడవచ్చు. "కర్సర్ స్క్రీన్ చుట్టూ కదులుతున్నట్లు మీరందరూ చూడగలిగితే, నేను సక్సెస్ అయినట్టే" అని లైవ్ స్ట్రీమ్ సమయంలో అతను డిజిటల్ చెస్ గుర్తులను కదిలిస్తూ చెప్పాడు. "ఇది చాలా బాగుంది" అతను వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు.. మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించే ప్రక్రియను అర్బాగ్ వివరిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. "నేను నా కుడి చేయి, ఎడమ, కుడి, ముందుకు, వెనుకకు కదలడానికి ప్రయత్నిస్తాను. అక్కడ నుంచి కర్సర్ కదులుతున్నట్లు ఊహించడం నాకు సహజమైందని భావిస్తున్నాను" అని అతను చెప్పాడు. న్యూరాలింక్ అధ్యయనంలో భాగం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అర్బాగ్ కూడా చెప్పాడు. "దీన్ని చేయగలగడం ఎంతో బాగుంది" అని అతను చెప్పాడు.
న్యూరాలింక్ అంటే ఏమిటి?
2016లో మస్క్ స్థాపించిన న్యూరాలింక్ అనేది బ్రెయిన్-చిప్ స్టార్టప్. ఇది ఒక పరికరం, నాణెం పరిమాణం, ఇది శస్త్రచికిత్స ద్వారా పుర్రెలో అమర్చబడుతుంది. దీని అల్ట్రా-సన్నని వైర్లు మెదడులోకి వెళ్లి మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్(BCI)ని అభివృద్ధి చేస్తాయి. డిస్క్ మెదడు కార్యకలాపాలను నమోదు చేస్తుంది, సాధారణ బ్లూటూత్ కనెక్షన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ వంటి పరికరానికి పంపుతుంది. స్టార్టప్ వ్యవస్థాపకుడు మస్క్ మాట్లాడుతూ, న్యూరాలింక్ నుండి మెదడు చిప్‌తో అమర్చబడిన మొదటి రోగి పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తోందని, తన ఆలోచనలను ఉపయోగించి కంప్యూటర్ మౌస్‌ను నియంత్రించగలిగారని పేర్కొన్నారు. "పురోగతి బాగుంది. రోగి పూర్తిగా కోలుకున్నట్లు అనిపిస్తుంది, ఎటువంటి దుష్ప్రభావాలు లేవు" అని మస్క్ చెప్పారు. "రోగి కేవలం ఆలోచించడం ద్వారా స్క్రీన్ చుట్టూ మౌస్‌ని కదపగలడు," అని మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలోని స్పేసెస్ ఈవెంట్‌లో చెప్పారు. మస్క్ ఇప్పుడు న్యూరాలింక్ రోగి నుండి వీలైనన్ని ఎక్కువ మౌస్ బటన్ క్లిక్‌లను పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.