NASA Artemis-1 : ఆర్టెమిస్ మళ్లీ మిస్, ఇంధన లీకేజీతో రెండోసారి వాయిదా
NASA Artemis-1 : చంద్రుడిపైకి నాసా చేపట్టిన ఆర్టెమిస్ -1 రాకెట్ ప్రయోగం రెండోసారి వాయిదా పడింది. ఇంధన లీకేజీ సమస్యతో ప్రయోగాన్ని నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది.
NASA Artemis-1 : చంద్రుడి పైకి నాసా తలపెట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం మరోసారి వాయిదా పడింది. రాకెట్ లో ఫ్యూయల్ లీకేజీ సమస్య తలెత్తడంతో రెండోసారి ప్రయోగాన్ని నిలిపేస్తున్నట్లు నాసా ప్రకటించింది. ఇప్పటికే ఒకసారి ప్రయోగాన్ని వాయిదా వేశారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఆర్టెమిస్-1 ప్రయోగం ముహూర్తం ఖరారు చేశారు. రాకెట్ లో ఇంధన లీకేజీ సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్లు నాసా తెలిపింది. ఇంధన నింపుతున్న సమయంలో లీకేజీ సమస్య తలెత్తిందని, దానిని సరిచేస్తున్నామని వెల్లడించింది. చంద్రుడిపైకి ఆర్టెమిస్- 1 మిషన్ ను నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది.
ఇంధన లీకేజీతో రెండుసార్లు వాయిదా
ఫ్లోరిడాలోని కెనెడీ స్పెస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్ -1 రాకెట్ ఆగస్టు 29న దూసుకెళ్లాల్సి ఉంది. కానీ ఇంధన లీకేజీ సమస్యలో ప్రయోగాన్ని వాయిదా వేశారు. చివరి గంటలో ప్రయోగాన్ని నిలిపివేశారు. సెప్టెంబర్ 3న మరోసారి ప్రయోగిస్తామని ప్రకటించింది నాసా. తాజాగా మరోసారి లీకేజీ సమస్యతోనే ప్రయోగం వాయిదా పడింది. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించిన సమాచారం త్వరలో వెల్లడిస్తామని నాసా ట్విట్టర్లో తెలిపింది. చంద్రుడి పైకి మనిషిని పంపే ప్రాజెక్టులో భాగంగా నాసా ఆర్టెమిస్-1ను చేపడుతుంది. ఈ ప్రయోగంలో రాకెట్‌తో సహా వ్యోమనౌకలను నింగిలోకి పంపేందుకు నాసా ప్రణాళికలు సిద్ధం చేసింది. చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ముందుగా ఓరియన్ క్యాప్సూల్ మానవరహితంగానే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి తిరిగి రానుంది. 2024లో ఆర్టెమిస్-2, 2025లో ఆర్టెమిస్-3 ప్రయోగాలను చేపట్టనున్నారు.
ఆర్టెమిస్-1 ప్రయోగం
2025 నాటి కల్లా చంద్రుడి మీద ఉన్న సౌత్ పోల్ మీదకు మనిషిని చేర్చటమే ఆర్టిమెస్ మిషన్ లక్ష్యం. అందుకే దాదాపు యాభై ఏళ్ల తర్వాత మళ్లీ నాసా ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ ను చేపట్టింది. చంద్రుడి మీద స్థావరాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే, అక్కడి నుంచి మార్స్ సహా అనేక అంతరిక్ష పరిశోధనలు చేసేందుకు వీలవుతుంది. అదే నాసా ప్లాన్.
ఆర్టెమిస్ అంటే
ముందుగా ఆర్టెమిస్ అంటే ఓ గ్రీకు దేవత. ఇంతకు ముందు నాసా చంద్రుడి మీదకు ప్రయోగాలు చేసిన ప్రాజెక్ట్ పేరు అపోలో. ఆ అపోలోకు ఈ ఆర్టెమిస్ గ్రీకు పురాణాల ప్రకారం సోదరి వరుస. సో అందుకే అపోలో తర్వాతి ప్రాజెక్ట్ కు ఆర్టెమిస్ పేరు పెట్టారు. గ్రీకు పురాణాల ప్రకారం చంద్రుడి అధిదేవత కూడా ఆర్టెమిస్. ఆర్టెమిస్ ప్రాజెక్టులో నాసా ది కీలక భాగమైన్పపటికీ మిగతా స్పేస్ ఏజెన్సీలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. నాసానే ఈ అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు ఆర్టెమిస్ లో కీలకంగా వ్యవహరించనున్న ఓరియన్ క్యాప్యూల్స్ నిర్వహణలో కీలకపాత్ర పోషించేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అంతే కాదు ఆర్టెమిస్ అకార్డ్స్ పేరుతో మిగిలిన దేశాలు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావచ్చని ఎప్పుడూ లేని విధంగా నాసా ఓ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చింది.
ఆర్టెమిస్ లక్ష్యాలు
ఆర్టెమిస్ మెయిన్ టార్గెట్ మనం అనుకున్నట్లు 2025 నాటికి చంద్రుడి మీద ఇప్పటివరకూ వెళ్లని దక్షిణ భాగం మీద మనిషి కాలు మోపించాలని. అంతే కాదు తొలిసారిగా ఓ మహిళను, ఓ నల్లజాతీయుడిని కూడా చంద్రుడి మీదకు పంపించాలనేది ఆర్టెమిస్ లో లక్ష్యాల్లో ఒకటి. మొత్తం మూడు స్టేజ్ ల్లో ఆర్టెమిస్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని నాసా భావిస్తోంది.
The #Artemis I mission to the Moon has been postponed. Teams attempted to fix an issue related to a leak in the hardware transferring fuel into the rocket, but were unsuccessful. Join NASA leaders later today for a news conference. Check for updates: https://t.co/6LVDrA1toy pic.twitter.com/LgXnjCy40u
— NASA (@NASA) September 3, 2022