News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

తవ్వకాల్లో బయట పడ్డ ఏలియన్ డెడ్‌బాడీస్‌! వెయ్యేళ్ల క్రితం మనుషులతో కలిసి జీవించాయట?

Alien Dead Bodies: మెక్సికన్ కాంగ్రెస్‌లో ఓ UFO ఎక్స్‌పర్ట్ ఏలియన్ డెడ్‌బాడీలను ప్రజెంట్ చేయడం సంచలనమైంది.

FOLLOW US: 
Share:

Alien Dead Bodies: 


మెక్సికోలో ఏలియన్ మిస్టరీ..

ఇప్పటి వరకూ అంతు తేలని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ఏలియన్స్ కాన్సెప్ట్. గ్రహాంతర వాసులు అనే వాళ్లే లేరని కొందరు వాదిస్తే...కచ్చితంగా ఉన్నారని మరికొందరు వాదిస్తారు. ఎవరి వాదన ఎలా ఉన్నా అప్పుడప్పుడు ఏలియన్స్‌ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి. మెక్సికోలో అదే జరిగింది. మెక్సికన్ కాంగ్రెస్ (Mexican Congress)లో UFO ఎక్స్‌పర్ట్ జెయిమ్ మౌసన్ (Jaime Maussan) వెయ్యేళ్ల క్రితం నాటి రెండు నాన్ హ్యూమన్ బాడీస్‌ని అందరి ముందుకి తీసుకొచ్చారు. అవి అచ్చం గ్రహాంతర వాసుల ఆకారానే పోలి ఉండటం సంచలనమైంది. ఏలియన్స్ గురించి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న జెయిమ్...వింత ఆకారంలో ఉన్న మృతదేహాలపైనా అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే మెక్సికన్ కాంగ్రెస్‌లో ఈ ఏలియన్స్‌ని పోలి ఉన్న డెడ్‌ బాడీలను అందరి ముందు ఉంచారు. పెరూలోని Cuscoలో తవ్వకాల్లో ఇవి బయటపడినట్టు చెప్పారు జెయిమ్. సాధారణ మనుషులతో పోల్చి చూస్తే ఈ డెడ్‌ బాడీస్‌లోని జెనెటిక్ కంపోజిషన్‌ 30% విభిన్నంగా ఉందని తేల్చి చెప్పారు. National Autonomous University of Mexico కార్బన్ డేటింగ్ ద్వారా ఈ విషయాలు వెల్లడించింది. వీటికి కాళ్లకు, చేతులకు మూడు వేళ్లు మాత్రమే ఉన్నాయి. ఇవి వెయ్యి సంవత్సరాల క్రిత నాటివి అని కార్బన్ డేటింగ్‌లో తేలింది. 

మెడ సన్నగా..పుర్రె పెద్దగా

చూడడానికి మనుషుల్లోగానే కనిపించినా...ఆకారం పూర్తి విభిన్నంగా ఉంది. మెడ చాలా సన్నగా, పుర్రె భాగం చాలా పెద్దగా ఉంది. పక్షుల బాడీ స్ట్రక్చర్‌కి దగ్గరగా ఉందని జెయిమ్‌ మౌసన్ వెల్లడించారు. పళ్లు లేవు. ఎముకలు పెద్దగా బరువుగా లేవు. ఈ రెండు డెడ్‌ బాడీల్లో ఒక దాంట్లో అండాలు కూడా కనిపించాయి. కడుపులో బిడ్డను మోస్తున్నట్టు కనిపించింది. 

"మానవ పరిణామ క్రమంలో ఎక్కడా మనిషి ఇలా లేడు. UFO అధ్యయనంలో ఈ రెండూ బయటపడ్డాయి. ఓ మైన్‌లో తవ్వకాలు జరుపుతుండగా వెలుగులోకి వచ్చాయి. ఇవి గ్రహాంతర వాసులా కాదా అన్నది ప్రస్తుతానికి తెలియదు. కానీ...అవి చాలా ఇంటిలిజెంట్ అని మాత్రం అర్థమవుతోంది. మనుషులతో పాటు చాలా రోజులు కలిసి జీవించాయి. బహుశా అప్పట్లో చరిత్రను తిరిగి రాసుంటారు."

- జెయిమ్ మౌసన్, UFO ఎక్స్‌పర్ట్ 

మెక్సికన్ కాంగ్రెస్‌లో ఈ ప్రజెంటేషన్ ఇవ్వడం అందరినీ షాక్‌కి గురి చేసింది. నిజానికి...జెయిమ్ మౌసన్ గతంలోనూ ఇలాంటి సంచలనాలు వెలుగులోకి తీసుకొచ్చారు. 2015లో ఓ మమ్మీ బాడీని కనుగొన్నారు. ఇది కూడా పెరూలోనే దొరికినట్టు వెల్లడించారు. అది చూడడానికి చాలా ఎత్తుగా ఉన్నట్టు తెలిపారు. ఇప్పుడు మరోసారి రెండు ఏలియన్ బాడీస్‌ని పరిచయం చేశారు. 


అమెరికా వద్ద ఆధారాలు..?

అమెరికా ఎయిర్‌ ఫోర్స్ ఇంటిలిజెన్స్ మాజీ ఆఫీసర్ డేవిడ్ గ్రష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా వద్ద ఓ ఏలియన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉందని ప్రకటించారు. అంతే కాదు. గ్రహాంతర వాసుల బాడీస్ కూడా అమెరికా ఉన్నాయని తేల్చి చెప్పారు. ఇందుకోసం అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా మల్టీ డికేడ్ ప్రోగ్రామ్ (Multi Decade Programme)ని చేపట్టినట్టు వెల్లడించారు. క్రాష్ అయిన UFO (Unidentified Flying Objects)ని రివర్స్ ఇంజనీరింగ్‌ చేసినట్టూ చెప్పారు. అమెరికా ప్రభుత్వం UFOలను Unexplained Anomalous Phenomena (UAP)గా పిలుస్తోంది. వీటిపై డిఫెన్స్ డిపార్ట్‌మెంట్‌లో అనాలసిస్‌ కొనసాగుతోందని  వివరించారు. ఇదే సమయంలో ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేశారు డేవిడ్ గ్రష్. ప్రభుత్వం UFOలకు సంబంధించి కొన్ని సీక్రెట్ ఆపరేషన్‌లు చేస్తోందని చెప్పారు. అయితే...ఈ ఆపరేషన్‌లలో తాను జోక్యం చేసుకోకుండా అనుమతి నిరాకరించిందని ఆరోపించారు. ఇక్కడితో ఆగలేదు డేవిడ్. ఈ సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించిన వారిని ప్రభుత్వం ఎలా వేధించిందో కూడా తనకు తెలుసని అన్నారు. 

Also Read: జాహ్నవి మృతిపై భారత్ సీరియస్, ఆ పోలీస్‌ ఆఫీసర్లపై కఠిన చర్యలకు డిమాండ్

Published at : 14 Sep 2023 11:39 AM (IST) Tags: Mexico Alien Dead Bodies Alien Bodies Mexican Congress 1000 year old alien bodies

ఇవి కూడా చూడండి

Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న వివేక్ రామస్వామి, ట్రంప్ తర్వాత 2వ స్థానం

Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న వివేక్ రామస్వామి, ట్రంప్ తర్వాత 2వ స్థానం

50 ఏళ్లలో ఇంత చెత్త ప్రధానిని చూడలేదు, ఓ సర్వేలో దారుణమైన రేటింగ్‌ - ట్రూడోపై ఓటర్ల అసహనం

50 ఏళ్లలో ఇంత చెత్త ప్రధానిని చూడలేదు, ఓ సర్వేలో దారుణమైన రేటింగ్‌ - ట్రూడోపై ఓటర్ల అసహనం

బ్రిటీష్ కాలం నుంచే కెనడాకి సిక్కుల వలసలు, ఆ దేశానికే వెళ్లడానికి కారణాలేంటి?

బ్రిటీష్ కాలం నుంచే కెనడాకి సిక్కుల వలసలు, ఆ దేశానికే వెళ్లడానికి కారణాలేంటి?

India-Canada Row: భారత్‌కు మినహాయింపు లేదు-కెనడాతో వివాదంపై బైడెన్‌ అడ్వైజర్‌

India-Canada Row: భారత్‌కు మినహాయింపు లేదు-కెనడాతో వివాదంపై బైడెన్‌ అడ్వైజర్‌

Canada Singer Shubh: భారత్‌ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్‌ శుభ్‌

Canada Singer Shubh: భారత్‌ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్‌ శుభ్‌

టాప్ స్టోరీస్

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు