జాహ్నవి మృతిపై భారత్ సీరియస్, ఆ పోలీస్ ఆఫీసర్లపై కఠిన చర్యలకు డిమాండ్
Jahnavi Death Case: సియాటెల్‌లో జాహ్నవి మృతిపై విచారణ చేపట్టాలని భారత్ డిమాండ్ చేసింది.
Jahnavi Death Case:
జాహ్నవి మృతి..
అమెరికాలోని సియాటెల్‌లో భారతీయ విద్యార్థిని కందుల జాహ్నవి (Kandula Jahnavi Death) మృతి సంచలనం సృష్టించింది. రోడ్డు దాటుతుండగా పోలీస్ ప్యాట్రోల్ వెహికిల్ ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఇద్దరు పోలీసులు జోక్ చేసుకోవడం...ఆ వీడియో బయటకు రావడం మరింత అలజడి రేపింది. ఈ ఘటనపై భారత్ సీరియస్ అయింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని Consulate General of India తీవ్రంగా స్పందించింది. ఇది చాలా దారుణం అంటూ మండి పడింది. సియాటెల్‌లోని స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చొరవ చూపిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ట్విటర్ అఫీషియల్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తామని హామీ ఇచ్చింది.
"ఈ ఘటన చాలా దారుణం. సియాటెల్‌తో పాటు వాషింగ్టన్ స్టేట్‌లోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశాం. జాహ్నవి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పాం. కాన్సులేట్, ఎంబసీ అధికారులతో విచారణపై ఆరా తీస్తున్నాం"
- కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో
Recent reports including in media of the handling of Ms Jaahnavi Kandula’s death in a road accident in Seattle in January are deeply troubling. We have taken up the matter strongly with local authorities in Seattle & Washington State as well as senior officials in Washington DC
— India in SF (@CGISFO) September 13, 2023
ఈ ఘటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ట్విటర్లో స్పందించారు. ఈ ఘటన ఎంతో కలిచివేసిందని, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ని ఈ పోస్ట్‌లో ట్యాగ్ చేశారు.
Deeply disturbed & extremely saddened by the utterly reprehensible and callous comments of a police officer of the SPD
— KTR (@KTRBRS) September 14, 2023
I request the @USAmbIndia to take up the matter with US Government authorities and deliver justice to the family of young Jaahnavi Kandula
I request EA… https://t.co/PpmUtjZHAq
అమెరికాలో ఓ ఇండియన్ స్టూడెంట్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. MS చేయడానికి వెళ్లిన జాహ్నవి సియాటెల్‌లోని Northeastern Universityలో మాస్టర్స్ చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిందీ ఘటన. అప్పటి నుంచి విచారణ జరుగుతోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీస్ ప్యాట్రోలింగ్ వెహికిల్ ఢీకొట్టి జాహ్నవి ప్రాణాలు కోల్పోయినట్టు తేలింది. అంత కన్నా దారుణం ఏంటంటే...ఆమె చనిపోయిందన్న వార్త తెలియగానే ఓ పోలీస్ ఆఫీసర్ నవ్వుతూ జోక్‌లు వేశాడు. ఇటీవల పోలీసులు విడుదల చేసిన వీడియోలో పోలీస్ ఆఫీసర్ డానియల్ ఆర్డెరర్ (Daniel Auderer) తన కార్లో ఉండగా జాహ్నవి గురించి మాట్లాడాడు. కావాలనే కార్‌తో ఢీకొట్టి చంపిన నిందితుడు, మరో పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్‌తో డిస్కస్ చేశాడు. ఆ సమయంలోనే గట్టిగా నవ్వుతూ, జోక్‌లు చేశాడు. అంతే కాదు. ఆమె ప్రాణాలకు విలువే లేదని చాలా చులకనగా మాట్లాడాడు. ఇదంతా పోలీస్ కార్లోని డ్యాష్‌బోర్డ్‌లో ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది.
Also Read: తవ్వకాల్లో బయట పడ్డ ఏలియన్ డెడ్‌బాడీస్! వెయ్యేళ్ల క్రితం మనుషులతో కలిసి జీవించాయట?