అన్వేషించండి

Python Shower Bath: కొండ‌చిలువ‌కు ష‌వ‌ర్ బాత్‌, విపరీతంగా వీడియో వైరల్

Viral Video: ష‌వ‌ర్ కింద భారీ కొండ‌చిలువ‌కు ఓ వ్య‌క్తి స్నానం చేయిస్తున్న వీడియో వైర‌ల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజ‌న్లు మాత్రం ఆ వ్య‌క్తి చేస్తున్న ప‌నికి ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

A shower bath for a python: చిన్న చిన్న పాముల‌ను చూడాలంటేనే మ‌నం వ‌ణికిపోతుంటే.. అలాంటిది కొంద‌రు స్నేక్ క్యాచ‌ర్స్ చాలా చాక‌చ‌క్యంగా పాముల‌ను ప‌ట్టేస్తుంటారు. వారిని చూస్తే ఆశ్చ‌ర్యం అనిపించినా భ‌యమే ఎక్కువ‌గా ఉంటుంది. ఎందుకంటే పాము కాటువేస్తే ప్రాణాలు కాపాడుకోవ‌డం చాలా క‌ష్టం. కొన్ని విష‌స‌ర్పాల ధాటికి క్ష‌ణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లు కూడా నిత్యం చూస్తూనే ఉంటాం. 
అలాంటిది కొంద‌రు పాముల‌ను పెంచుకుంటార‌ని తెలిస్తే వారి ఇంటికి ద‌రిదాపుల్లోకి కూడా మ‌నం అడుగు కూడా పెట్టం. కానీ ఇటీవ‌ల కొన్ని వీడియోల్లో పాముల‌తోనే క‌లిసి బెడ్ మీద ప‌డుకుని ఉండ‌టం, పెద్ద పెద్ద కొండ‌చిలువ‌ల‌తో క‌లిసి ప్ర‌యాణించ‌డం చూస్తున్నాం. ఇలాంటి వీడియోలు సోష‌ల్ మీడియా ద్వారా ఎక్క‌డెక్క‌డో జ‌రిగిన‌వి మ‌న సెల్‌ఫోన్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వడం చూసి ఆశ్చ‌ర్య‌పోతాం క‌దా.. 

ఇలాంటి ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఒక తాజాగా ఇన్‌స్టాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇది ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు కానీ, ఇండియాలో మాత్రం కాద‌ని తెలుస్తోంది. ఈ వీడియో ఓ వ్య‌క్తి భారీ కొండ‌చిలువ‌తో క‌లిసి బాత్ రూమ్‌లో స్నానం చేస్తున్న‌ట్టుగా ఉంటుంది. కొండ‌చిలువ ఆ వ్య‌క్తి త‌న భుజాల‌పై వేసుకుని ష‌వ‌ర్ కింద నిల‌బ‌డి దానికి స్నానం చేయిస్తుంటాడు. దాని బ‌రువును భ‌రించ‌లేక ఒంగిపోతూనే దానికి మాత్రం శుభ్రంగా ఒళ్లంతా రుద్దుతూ ఉంటాడు. ఆ పాము కూడా శ్ర‌ద్ధగా అత‌డు చేత స్నానం చేయించుకుంటుంది. 
@world_of_snakes అనే పేరుతో ఇన్‌స్టాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్ప‌టికే ప‌ది వేల‌కు మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 

ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🐍 𝑾𝒐𝒓𝒍𝒅 𝒐𝒇 𝒔𝒏𝒂𝒌𝒆𝒔 🐍 (@world_of_snakes_)

కొంద‌రు నెటిజ‌న్లు వీడియోపై త‌మ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో వ్య‌క్తం చేశారు. కొంద‌రు పాజిటివ్‌గా స్పందించి ఆ వ్య‌క్తి ధైర్య‌సాహ‌సాల‌ను చూసి అభినందించారు. మ‌రికొంద‌రైతే ఈ ప్రమాదకర స్టంట్ యొక్క ఆవశ్యకతను ప్రశ్నిస్తున్నారు,. ఒక వీక్షకుడు "ఎంత బలంగా ఉంది బ్రో-అనకొండలు చాలా బరువుగా ఉన్నాయి.ష అన‌గా ఇంకొక‌రు భయానకంగా ఉంది, ఈ వీడియో ఉంది’’ అని వ్యాఖ్యానించారు. మ‌రొకాయ‌న డ‌బ్బుల కోసం ఇలాంటి తెలివిత‌క్కువ ప‌నులు చేసి ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌డం అవ‌స‌ర‌మా అంటూ మండిప‌డుతున్నారు. 

ఇటీవ‌లే మూడు రోజుల క్రితం ఏపీలో స‌త్య‌సాయి జిల్లా క‌దిరిలో ఓ వ్య‌క్తి పూటుగా మ‌ద్యం సేవించి ఆ మ‌త్తులో ఏం చేస్తున్నాడో తానే మ‌రిచిపోయి పాముతో ఆట‌లాడాడు. చివ‌రికి పాము కాటుకు గుర‌య్యాడు. న‌డి రోడ్డుపై దాదాపు గంట‌కుపైగానే పాముతో ఆట‌లాడి రోడ్డున పోతున్న‌వారిని సైతం భ‌యాందోళ‌న‌కు గురిచేశాడు. పాము త‌న దారిన చెట్ల‌లోకి పోతున్నా వ‌ద‌ల‌కుండా తోక ప‌ట్టుకుని లాగ‌డంతో  అది ఆ తాగుబోతును కాటేసింది. 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget