North Korea: భార్య, పిల్లలతో బయట కనిపించిన ఉత్తరకొరియా కిమ్ - వాళ్లు వాడేవన్నీ లగ్జరీ బ్రాండ్స్ - స్మగ్లింగ్ చేసి తెచ్చుకున్నారా?
Kim Jong Un: ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్, తన భార్య రి సోల్ జు , కుమార్తె కిమ్ జు ఏతో కలిసి చాలా కాలం తర్వాత బయట కనిపించారు. వారు అంతర్జాతీయ బ్రాండ్ల దుస్తులు, యాక్సెసరీస్ వాడటంపై చర్చ జరుగుతోంది.

Kim Jong Un Makes Rare Appearance with Wife: ఉత్తర కొరియా నియంత కిమ్ గురించి ఎన్ని కథలు ప్రచారంలో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఉత్తరకొరియాలోకి విదేశీ వస్తువులు రావు.. ఉత్తర కొరియా నుంచి వెళ్లవు. అయితే ఆయన కుటుంబం మాత్రం విదేశీ లగ్జరీ బ్రాండ్లను వాడుతూంటారు. వాటిని స్మగ్లింగ్ చేసి తెచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోందది. జాగా వోన్సన్ కల్మా కోస్టల్ టూరిస్ట్ జోన్‌ను ప్రారంభించడానికి కిమ్ తన భార్యా, పిల్లలతో వచ్చారు. వారు ఇంటర్నేషనల్ లగ్జరీ బ్రాండ్స్ వినియోగిస్తూ కెమెరాలకు చిక్కారు.
వోన్సన్ కల్మా కోస్టల్ టూరిస్ట్ జోన్, ఉత్తర కొరియా యొక్క తూర్పు తీరంలో ఉన్న వోన్సన్‌లో ఉంది. కిమ్ జాంగ్ ఉన్ ఈ రిసార్ట్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ రిసార్ట్ 20,000 మంది సందర్శకులను ఆతిథ్యం ఇవ్వగలదు. ఇందులో హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వాటర్ పార్క్, క్రీడా, వినోద సౌకర్యాలు ఉన్నాయని ఉత్తర కొరియా రాష్ట్ర మీడియా, ప్రకటించింది. ఈ రిసార్ట్ ను జూలై 1 నుండి దేశీయ సందర్శకుల కోసం తెరుస్తారు. విదేశీ పర్యాటకులకు అనుమతిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
NEW: North Korean dictator Kim Jong Un to open a beach resort this summer to boost tourism.
— Collin Rugg (@CollinRugg) June 26, 2025
The resort is along a 2.5 mile stretch of beach and can host 20,000 visitors. It was completed six years after the target date.
The resort is on the east coast of North Korea and… pic.twitter.com/5B3iELyCQU
కిమ్ జాంగ్ ఉన్ ఈ రిసార్ట్ ప్రారంభోత్సవానికి తన సాధారణ మావో సూట్‌కు బదులు డార్క్ సూట్, వైట్ షర్ట్, టై ధరించి వచ్చారు. ఎంతో సంతోషంగా కిమ్ కనిపించారు. కిమ్ వెంట ఆయన భార్య రి సోల్ జు ఉన్నారు. 2024 జనవరి 1 నుండి బహిరంగంగా కనిపించలేదు, ఈ ఈవెంట్‌లో ఆమె 18 నెలల తర్వాత తిరిగి కనిపించారు. ఆమె వైట్ షర్ట్, బ్లాక్ డ్రెస్ ప్యాంట్స్, గూచీ హ్యాండ్‌బ్యాగ్ తో కనిపిచారు. ఈ హ్యండ్ బ్యాగ్ విలువ కనీసం రెండు వేల డాలర్లు ఉటుంది. ఉత్తరకొరియాలోకి విదేశీ వస్తువులు రావు. గతంలో ఐక్యరాజ్య సమితి కూడా ఆంక్షలు విధించింది. అంటే తన భార్య కోసం స్మగ్లింగ్ చేసి ఈ వస్తవుల్ని తన దేశానికి తెప్పించుకున్నారని అనుకుంటున్నారు.
కిమ్ కుమార్తె 12 ఏళ్ల కిమ్ జు ఏ కూడా ఈ ఈవెంట్‌లో తన తల్లిదండ్రులతో కలిసి కనిపించారు. కిమ్ ముగ్గురు పిల్లలలో ఒకరిగా భావిస్తున్నారు. కిమ్ పిల్లల్లో ఈ ఒక్క అమ్మాయి మాత్రమే బహిరంగంగా కనిపిస్తారు. మిగతా ఇద్దరు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. జు ఏ 2022లో తన తండ్రితో మొదటిసారి బహిరంగంగా కనిపించారు, ఒక ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష సమయంలో, తర్వాత సైనిక కవాతులు మరియు ఇతర కార్యక్రమాలలో కనిపించారు. ఆమెను ఆయన వారసురాలిగా సిద్ధం చేస్తున్నారని అందుకే బహిరంగ కార్యక్రమాలకు తీసుకు వస్తున్నారని భావిస్తున్నారు.





















