Viral News: అభినందన్‌ను పట్టుకున్న పాక్ మేజర్ ను చంపేసిన తాలిబన్లు - అక్కడ ఆర్మీకీ టెర్రరే !
Pak Major: పాకిస్థాన్ మిలిటరీ అధికారి మోయిజ్ అబ్బాస్ షా తాలిబాన్ ఘర్షణలో మృతి చెందారు. ఆయన భారత ఫైటర్ పైలట్ అభినందన్‌ను బంధించిన అధికారి.

Pak Major killed in Waziristan who captured IAF pilot Abhinandan: 2019లో భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను బంధించడంలో పాత్ర పోషించిన పాకిస్థాన్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ ) ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణలో మృతి చెందాడు.
పాకిస్థాన్ ఆర్మీలో స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG)లో సభ్యుడైన మేజర్ మోయిజ్ అబ్బాస్ షా దక్షిణ వజీరిస్థాన్‌లోని సరరోఘా తెహ్సీల్‌లో విధులు నిర్వహిస్తున్నడాు. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదులతో జరిగిన ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ (IBO)లో మృతి చెందారు. ఈ ఆపరేషన్‌లో 11 మంది ఉగ్రవాదులు హతమైనట్లు, మరో ఏడుగురు గాయపడినట్లు పాకిస్థాన్ ఆర్మీ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది.
Major Syed Muiz—the Pak Army SF officer who captured IAF pilot Abhinandan Varthaman in 2019—has been killed in a clash with TTP along the Af‑Pak border.
— Praffulgarg (@praffulgarg97) June 25, 2025
TTP is not just a cross‑border threat—it’s burning Pakistan from within. This isn’t just news, it’s a real-time reminder that… pic.twitter.com/3jBgaDczk6
2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత పారామిలటరీ సిబ్బంది మరణించారు. దీనికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై ఎయిర్‌స్ట్రైక్ నిర్వహించింది. తర్వాత ఫిబ్రవరి 27న పాకిస్థాన్ ఫైటర్ జెట్లు భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి ప్రయత్నించాయి, దీనికి భారత వైమానిక దళం ప్రతిస్పందించింది. ఆ విమానాలను తరిమికొడుతూ అప్పటి వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మిగ్-21 బైసన్‌లో ఉండగా, పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను కూల్చివేశారు. అయితే, ఆయన విమానం కూడా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూలిపోయిది.
అభినందన్‌ను మేజర్ మోయిజ్ అబ్బాస్ షా నేతృత్వంలోని పాకిస్థాన్ ఆర్మీ యూనిట్ బంధించింది. ఈ సంఘటన భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. మోయిజ్ అబ్బాస్ షా అభినందన్‌ను హింసించాడని ఆరోపణలు వచ్చాయి. అయితే అలాంటిదేం జరగలేదని తర్వాత తెలిసిది. భారత ప్రభుత్వం టి దౌత్యపరమైన ఒత్తిడి , అంతర్జాతీయ జోక్యం తర్వాత, పాకిస్థాన్ అప్పటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 28న అభినందన్ ను విడుదల చేయించారు. అభినందన్ 58 గంటల తర్వాత, మార్చి 1, 2019న అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్‌కు తిరిగి వచ్చారు. మేజర్ మోయిజ్ అబ్బాస్ షా పాకిస్థాన్ ఆర్మీలో ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG)లో సభ్యుడిగా, అలాగే 7 నార్తర్న్ లైట్ ఇన్‌ఫాంట్రీ (NLI), 6 కమాండో బెటాలియన్ (CDO)లో సేవలు అందించారు.





















