అన్వేషించండి

US Iran War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్

Trump on Iran War: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని త్వరలో ముగిస్తామని, అందుకు ప్రత్యర్థి దేశంతో ఎలాంటి ఒప్పందం చేసుకోవడం లేదని అమెిరాకా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ స్పష్టం చేశారు.

US Iran war | వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గత నెల రోజుల నుంచి ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి మరో రెండు, మూడు వారాల్లో స్వస్తి పలుకుతామని ప్రకటించారు. మంగళవారం ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ‘అనుకున్న లక్ష్యాలు దాదాపు పూర్తి చేశాం. మేం సాధ్యమైనంత త్వరగా ఇరాన్ నుంచి నిష్క్రమిస్తున్నామం. ఈ ఉపసంహరణ ప్రక్రియ కేవలం 2, 3 వారాల్లోనే పూర్తవుతుందని’ ట్రంప్ పేర్కొన్నారు. 

ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేసిన ఇరాన్‌తో తమ యుద్ధాన్ని ముగించేందుకు తాము ఇరాన్‌తో ఎలాంటి అధికారిక ఒప్పందం చేసుకోవడం లేదని తెలిపారు. ఇరాన్ దేశం అణ్వాయుధాలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేయడమే తమ లక్ష్యమని, అది పూర్తి చేసిన వెంటనే అమెరికా బలగాలు వెనక్కి వచ్చేస్తాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతను ఇకపై అమెరికా తీసుకోబోదని, ఆ మార్గాన్ని ఉపయోగించే ఫ్రాన్స్ వంటి ఇతర దేశాలే ఆ బాధ్యతలు చూసుకోవాలని పేర్కొన్నారు.

ఇరాన్ కుప్పకూలింది.. నెతన్యాహు..

ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు సైతం ఇరాన్‌తో యుద్ధంపై స్పందించారు. అమెరికా-ఇజ్రాయెల్ కొనసాగించిన సంయుక్త దాడులతో ఇరాన్ నాశనమైందని, వారి సుప్రీం లీడర్ ఖమేనీని తొలి రోజుల్లోనే అంతం చేశామన్నారు. ప్రస్తుతం ఇరాన్ కుప్పకూలుతోందని, ఇరాన్ సైన్యం కోసం ఖర్చు చేసిన ట్రిలియన్ డాలర్లు వృధా అయ్యాయని పేర్కొన్నారు. ఇరాన్ సైన్యం, ప్రభుత్వం గతంలో కంటే బలహీనపడిందని, మిడిల్ ఈస్ట్‌లో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయని నెతన్యాహు ధీమా వ్యక్తం చేశారు. 

అమెరికా నుండి ఇరాన్‌కు సందేశాలను పంపుతున్నది ఎవరు? 

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘచీ కీలక ప్రకటన చేశారు. అమెరికా నుండి నేరుగా సందేశాలు అందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీని అర్థం టెహ్రాన్ వాషింగ్టన్‌తో 'చర్చలు' జరుపుతున్నట్లు కాదని ఆయన స్పష్టం చేశారు.

అరాఘ్చీ ఏమన్నారు?
అల్ జజీరాతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి.. గతంలో లాగే నాకు స్టీవ్ విట్‌కాఫ్ నుండి సందేశాలు వస్తున్నాయి. కానీ దాని అర్థం మేము చర్చలు జరుపుతున్నామని కాదు. అమెరికా పంపిన 15 సూత్రాల ప్రతిపాదనలకు ఇరాన్ స్పందించలేదు. ఎటువంటి షరతులు విధించలేదు. ఇరాన్ ఈ ప్రాంతం మొత్తంలో యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉంది. తాత్కాలిక కాల్పుల విరమణకు కాదు. అమెరికాతో చర్చలు జరపడంపై ఇరాన్‌కు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని’ ఆయన పేర్కొన్నారు.

అమెరికా ఇరాన్‌లోని ఏ పక్షంతోనైనా చర్చలు జరుపుతోందన్న వాదనలో నిజం లేదని అరాఘ్చీ పునరుద్ఘాటించారు. అన్ని సందేశాలు విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారానే పంపుతారని లేదా స్వీకరిస్తారని, భద్రతా సంస్థల మధ్య కమ్యూనికేషన్ ఉంటుందని తెలిపారు.  అమెరికాతో చర్చల అనుభవం ఎప్పుడూ బాగుండలేదని అరాఘ్చీ అన్నారు. కొన్ని ఏళ్ల కిందట అమెరికాతో ఒక ఒప్పందం చేసుకున్నాం, కానీ యూఎస్ దాని నుండి వెనక్కి తగ్గిందని ఆయన గుర్తు చేశారు.

యుద్ధం ముగింపుపై ఇరాన్ అధ్యక్షుడి సంకేతాలు
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియాన్ కూడా తాజాగా మాట్లాడుతూ, అమెరికాకు దౌత్యంపై నమ్మకం లేదన్నారు. యూఎస్‌తో చర్చలు జరుగుతున్న సమయంలో కూడా ఇరాన్‌పై రెండుసార్లు దాడి జరిగిందని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడితో జరిగిన చర్చల్లో, ఇరాన్ ఈ సంఘర్షణను పొడిగించాలని అనుకోవడం లేదని పేజెష్కియాన్ తెలిపారు. మేం యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నాం, అయితే ఇరాన్ భద్రతకు భరోసా కావాలి. భవిష్యత్తులో జరిగే దాడులను అరికట్టడానికి గ్యారెంటీ ఇవ్వాలని అన్నారు. ఇరాన్ ప్రజల ప్రయోజనాలు, భద్రతకు హామీ లేకుండా ఎలాంటి ఒప్పందాన్ని అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget