అన్వేషించండి

Iran Target Tech Companies: ఇరాన్ హిట్ లిస్ట్‌లో టెక్‌ సంస్థలు! షేక్ అవుతున్న కార్పొరేట్ దిగ్గజాలు, అమెరికా! 

Iran Targets Tech Giants: అమెరికా, ఇజ్రాయెల్‌ సాగిస్తున్న దాడులకు ప్రతీకార చర్యగా ప్రముఖ టెక్ సంస్థలను టార్గెట్ చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో కార్పొరేట్ ప్రపంచం షేక్ అయ్యింది.   

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా, ఇజ్రాయెల్‌కు సహకరిస్తున్న టెక్‌ దిగ్గజాలపై చర్యలు:
  • ఇరాన్ సైనిక కమాండర్‌ హత్యకు ప్రతీకారంగా ఈ నిర్ణయం:
  • యాపిల్, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, టెస్లా టార్గెట్‌ అయ్యాయి:
  • సైబర్‌ దాడులు, కార్పొరేట్‌ కార్యాలయాలపై దాడి జరగవచ్చు.

Iran Target Tech Companies: ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య సాగుతున్న ఘర్షణతో ప్రపంచం నలిగిపోతోంది. ఇప్పుడు ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ టెక్ దిగ్గజాలను టార్గెట్‌ చేయబోతున్నామని ఇరాన్ ప్రకటించింది. కేవలం ఇప్పటి వరకు సైనిక దళాలకే పరిమితం అయిన యుద్ధం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న టెక్నాలజీ సంస్థల పేర్లను కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటన వెలువడింది. ఇప్పుడు ఇరాన్ హిట్‌లిస్ట్‌లో యాపిల్, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, టెస్లా వంటి సంస్థలన్నీ ఉన్నాయి. 

ఇరాన్ అధికారికంగా హెచ్చరిక 

అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసేందుకు ఈ సంస్థలు సహకరిస్తున్నాయని ఇరాన్ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఇవి కేవలం వ్యాపార సంస్థలు మాత్రమే కాదని, అమెరికాకు వెన్నుదన్నుగా మారుతున్నాయని ప్రకటించింది. అందుకే ఆయా సంస్థలను టార్గెట్ చేయబోతున్నట్టు ప్రకటించి ప్రపంచ మార్కెట్‌ను షేక్ చేసింది. 

ఎందుకు ఇరాన్ అనుమానపడుతోంది?

ఐర్జీసీ బిగ్రేడియర్‌ జనరల్‌, చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్ సలహాదారు జంషెడ్‌ ఇషాకీ అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందాడు. దీన్ని అధికారికంగా ప్రకటించిన ఇరాన్ తమసైనిక కమాండర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా టెక్నాలజీ కారణంగానే జరిగిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అందుకే అమెరికాకు చెందిన టెక్నాలజీ, ఆర్థిక సంస్థలను టార్గెట్ చేసుకున్నట్టు చెబుతోంది. వాటిని దెబ్బకొట్టాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టు ప్లాన్స్ వేస్తోంది. 

ఇరాన్ హిట్‌లిస్ట్‌లో ఉన్న సంస్థలు

గూగుల్‌, యాపిల్, మైక్రోసాఫ్ట్‌, మెటా, టెస్లా, అమెజాన్/బోయింగ్, ఇంటెల్, ఎన్విడియా, డెల్, హెచ్‌పీ, సిస్కో, ఒరాకిల్, ఐబీఎం, పలలంటీర్, జేపీ మోర్గాన్, జనరల్‌ ఎలక్ట్రిక్‌, స్పైర్ సొల్యూషన్స్‌, జి42, ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ సంస్థలు తమ హిట్ లిస్ట్‌లో ఉన్నట్టు ఇరాన్ ఓపెన్‌గానే ప్రకటించింది. ఈ సంస్థలు తమ శక్తి సామర్థ్యాలను అమెరికాకు చేరవేస్తున్నాయని తెలిపింది. 

ఎలాంటి దాడులు జరగవచ్చు

ఇరాన్ తన సైబర్‌ దాడుల సామర్థ్యాన్ని ఇప్పటికే రుజువు చేసుకుంది. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే జరగవచ్చని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ సర్వర్లు, డేటా సెంటర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై సైబర్‌ దాడులు జరిగే ఛాన్స్ లేకపోలేదని చెబుతున్నారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్‌, యాపిల్ సంస్థకు దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కార్పొరేట్ కార్యాలయాలు ఉన్నాయి. గల్ఫ్‌ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసిన ఇరాన్, ఇప్పుడు తన దష్టిని ఈ కార్పొరేట్ ఆఫీస్‌ల వైపు మళ్లించింది. 

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడుల్లో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏదో రకంగా యుద్ధం ఆపాలని అమెరికా ప్రయత్నిస్తుంటే, ఇజ్రాయెల్‌ సహకరించడం లేదు. ఇతర దేశాలు అమెరికాకు సపోర్ట్ చేయడం లేదు. అమెరికాలో యుద్ధం ఖర్చు పెరిగిపోవడంతో ఆ దేశంలో కూడా అలజడి మొదలైంది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఇరాన్ చూస్తోంది. అందుకే అమెరికా హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తిరిగి బెదిరిస్తోంది. దీంతో ట్రంప్‌లో అసహనం పెరిగిపోతోంది. ఇంతలో ఇరాన్ కార్పొరేట్ దిగ్గజాలను టార్గెట్ చేస్తున్నట్టు ప్రకటించం అందర్నీ షేక్ చేస్తోంది. ఇది ఎలాంటి విపరిణామాలకు దారి తీస్తుందో అన్న టెన్షన్ కార్పొరేట్‌ సెక్టార్‌లో కనిపిస్తోంది.  

Frequently Asked Questions

ఇరాన్ ఏ టెక్ దిగ్గజాలను టార్గెట్ చేయబోతోంది?

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌కు సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ యాపిల్, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, టెస్లా వంటి టెక్ దిగ్గజాలను టార్గెట్ చేయబోతున్నట్లు ప్రకటించింది.

ఇరాన్ టెక్ సంస్థలను ఎందుకు టార్గెట్ చేస్తోంది?

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఈ సంస్థలు సహకరిస్తున్నాయని, అమెరికాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది.

ఇరాన్ హిట్‌లిస్ట్‌లో ఉన్న సంస్థలు ఏమిటి?

గూగుల్‌, యాపిల్, మైక్రోసాఫ్ట్‌, మెటా, టెస్లా, అమెజాన్/బోయింగ్, ఇంటెల్, ఎన్విడియా, డెల్, హెచ్‌పీ, సిస్కో, ఒరాకిల్, ఐబీఎం, పలలంటీర్, జేపీ మోర్గాన్, జనరల్‌ ఎలక్ట్రిక్‌, స్పైర్ సొల్యూషన్స్‌, జి42, ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ వంటి సంస్థలు ఇరాన్ హిట్‌లిస్ట్‌లో ఉన్నాయి.

ఇరాన్ ఎలాంటి దాడులు చేయవచ్చు?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇరాన్ తన సైబర్‌ దాడుల సామర్థ్యంతో గ్లోబల్ సర్వర్లు, డేటా సెంటర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడులు చేసే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
US PERM Labor Certification Suspension: అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget