అన్వేషించండి

US Iran War Updates: 47 ఏళ్లుగా ఇరాన్ మాతో గేమ్స్ ఆడుతోంది, ఇకపై వాళ్లు నవ్వలేరు: డొనాల్డ్ ట్రంప్

US Iran War: అమెరికా శాంతి ప్రతిపాదనపై ఇరాన్ స్పందనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికాకు అది ఆమోదయోగ్యం కాదన్నారు. వారికి నవ్వు లేకుండా చేస్తామన్నారు.

వాషింగ్టన్: మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న తీవ్రమైన ఘర్షణలను ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేసిన శాంతి ప్రతిపాదనను ఇరాన్ రిజెక్ట్ చేసింది. ఇరాన్ స్పందన తనకు ఏమాత్రం నచ్చడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం (మే 10) తెలిపారు. ఇది కచ్చితంగా అమెరికాకు ఆమోదయోగ్యం కాదని  ఆయన పేర్కొన్నారు.

ట్రంప్ కఠిన వైఖరి
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్'లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ట్రంప్ పలు విషయాలు వెల్లడించారు. ఇరాన్ ప్రతినిధులు ఇచ్చిన సమాధానం తన అంచనాలకు అనుగుణంగా లేదన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ ప్రపంచ దేశాలతో పాటు అమెరికాను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఇరాన్ గత 47 ఏళ్లుగా అమెరికాతో పాటు ప్రపంచంతో గేమ్స్ ఆడుతోంది.. వారు మా దేశాన్ని ఎగతాళి చేశారు, కానీ ఇకపై నవ్వలేరు’ అని ట్రంప్ రాసుకొచ్చారు. 

ఒబామాపై విమర్శలు
"ఇరాన్ గత 47 ఏళ్లుగా అమెరికాతో, ప్రపంచంతో ఆటలాడుతోంది. బరాక్ ఒబామా అధ్యక్షుడు అయినప్పుడు ఇరాన్ జాక్‌పాట్ కొట్టింది. ఒబామా వారి పట్ల కేవలం మంచిగా ఉండటమే కాదు, అద్భుతంగా వ్యవహరించారు. వారి పక్షాన చేరి, ఇజ్రాయెల్, ఇతర మిత్రదేశాలన్నింటినీ వదిలేసి, ఇరాన్‌కు అత్యంత శక్తివంతమైన కొత్త జీవితాన్ని ఇచ్చారు. వందల బిలియన్ల డాలర్లు, 1.7 బిలియన్ డాలర్ల నగదును విమానాల్లో టెహ్రాన్‌కు వెండి పళ్ళెంలో పెట్టి అందించారు. డి.సి., వర్జీనియా, మేరీల్యాండ్‌లోని ప్రతి బ్యాంకును ఒబామా ఖాళీ చేశారు. ఆ డబ్బు ఎంత ఎక్కువగా ఉందంటే, అది అక్కడికి చేరుకున్నప్పుడు ఆ ఇరాన్ గూండాలకు దాంతో ఏం చేయాలో కూడా అర్థంకాలేదు. విమానం నుండి సూట్‌కేసులు, సంచులలో ఆ డబ్బును దింపినప్పుడు ఇరాన్ వాసులు తమ అదృష్టాన్ని తాము నమ్మలేకపోయారు. 

చివరకు వారు ఒక బలహీనమైన, తెలివితక్కువగా ఉన్న అమెరికా అధ్యక్షుడి రూపంలో అందరికంటే పెద్ద అమాయకుడిని కనుగొన్నారు. మన నేతగా ఆయన ఒక విపత్తు, కానీ జో బైడెన్ అంత అధ్వాన్నంగా మాత్రం కాదు. 47 ఏళ్లుగా ఇరాన్ వాసులు మనల్ని తప్పుదోవ పట్టిస్తూ, మరోవైపు బాంబులతో మన ప్రజలను చంపుతున్నారు. నిరసనలను అణిచివేస్తూ ఇటీవల 42,000 మంది అమాయక, నిరాయుధ నిరసనకారుల ప్రాణాలు తీశారు. ఇప్పుడు మళ్ళీ గొప్పగా మారిన అమెరికాను చూసి ఇరాన్ నవ్వుతోంది. వారు ఇకపై నవ్వలేరు!’ అని డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

ఇరాన్ పెట్టిన కండీషన్లు ఇవే
పాకిస్థాన్ మధ్యవర్తుల ద్వారా అమెరికాకు చేసిన ఈ ప్రతిపాదనలో ఇరాన్ పలు కీలక షరతులను ప్రతిపాదించింది. ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్, ఇతర మీడియా నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్,  ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మధ్య ఘర్షణలు జరుగుతున్న లెబనాన్ సహా అన్ని చోట్ల యుద్ధాన్ని ముగించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇరాన్‌పై ఉన్న ఆంక్షల నుండి ఉపశమనం కల్పించాలని కోరింది. ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) విధించిన ఆంక్షలను కనీసం 30 రోజులు తొలగించాలని ఇరాన్ కోరింది. హర్మూజ్ జలసంధిపై ఉన్న ఆంక్షలను, అమెరికా నేవీ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Texas Resident Rips Indian Flag: డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !
డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !
ABP India at 2047 Conclave: పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Indian Mango party San Francisco: అమెరికాలో ఫ్రీ మ్యాంగో ఫెస్టివల్ పెట్టిన భారతీయులు - క్యూలో నిలబడి తిన్న అమెరికన్లు - వీడియోలు వైరల్
అమెరికాలో ఫ్రీ మ్యాంగో ఫెస్టివల్ పెట్టిన భారతీయులు - క్యూలో నిలబడి తిన్న అమెరికన్లు - వీడియోలు వైరల్
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Embed widget