అన్వేషించండి

US-Iran War End:ముగిసిన అమెరికా- ఇరాన్ యుద్ధం? వైట్‌హౌస్ కీలక సంకేతాలు!

US-Iran War End:అమెరికా- ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఒక కీలక ముందడుగు పడింది. ఇరు దేశాలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసేందుకు రెడీ అవుతున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక శాంతి ఒప్పందం దిశగా అడుగులు.
  • ఇరాన్ అణు కార్యక్రమాలపై తాత్కాలిక నిషేధం, యూరేనియం తొలగింపు.
  • అమెరికా ఆర్థిక ఆంక్షలు ఎత్తివేత, హార్ముజ్ జలసంధిలో ఆంక్షల తొలగింపు.
  • రెండు దేశాల మధ్య 12-15 ఏళ్ల ఒప్పందంపై చర్చలు.

US-Iran War End:గత కొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే మే 6 నాటికి తాజా పరిణామాలు ఒక శుభార్తను మోసుకొచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాలు తమ మధ్య ఉన్న శత్రుత్వాన్ని వీడి, శాంతి దిశగా పయనించేందుకు ఒక ప్రాథమిక ఒప్పందం దిశగా ఆడుగులు వేస్తున్నాయి. ఈ పరిణామం కేవలం రెండు దేశాలకే కాకా, ప్రపంచ వాణిజ్యానికి, ఇంధన భద్రతకు ఎంతో కీలకంకానుంది. 

ఒప్పందంలో ఏం ఉంది?

ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం, ఇరు దేశాలు కొన్ని కీలకమైన షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది. ఇరాన్ తన అణు శుద్ధి కార్యక్రమాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించుకోవాలి. అంతే కాకుండా తన వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియంను తొలగించేందుకు కూడా ఇరాన్ అంగీకరించినట్టు సమాచారం. దీనిని అమెరికాకు తరలించే అవకాశం కూడా చర్చల్లో ఉంది. దీనికి బదులుగా అమెరికా ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తుంది. దీని వల్ల వివిధ దేశాల్లో నిలిచిపోయిన బిలియన్ల కొద్ది డాలర్ల ఇరాన్ నిధులు తిరిగి ఆ దేశానికి చేరుతాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధి గుండా నౌక రాకపోకలపై ఉన్న ఆంక్షలను ఇరు దేశాలు తొలగించనున్నాయి. 

అమెరికా చేపట్టిన ఆపరేష్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్‌పై 66 రోజుల పాటు కొనసాగిన బాంబు దాడులు ముగిశాయని అమెరికా ప్రకటించింది. ఈ యుద్ధం వాతావరణం వల్ల అంతర్జాతీయంగా వినియోగదారులపై పడే భారాన్ని తగ్గించడానికి, ఆర్థిక స్థిరత్వం కోసం దౌత్యపరమైన పరిష్కారమే మార్గమని అమెరికా భావిస్తోంది. 

ఈ చర్చల వెనుక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించిన ప్రత్యేక ప్రతనిధులు స్టీవ్‌ విట్‌కాఫ్‌, జారెడ్ కుష్నర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు ఇరాన్ అధికారులతో నేరుగా మధ్యవర్తుల ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చర్చల పురోగతిని దృష్టిలో ఉంచుకునే హార్ముజ్‌ జలసంధిలో కొత్త సైనిక చర్యలను చేపట్టవద్దని ట్రంప్ నిర్ణయించారు. 

ఈ ఒప్పందం కుదిరిన తర్వాత, సుమారు 30 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరుగుతాయి. ఈ చర్చలకు ఇస్లామాబాద్‌ లేదా జెనీవా వేదికయ్యే అవకాశం ఉంది. ఇరాన్ ఈ నిషేధం ఐదేళ్లు ఉండాలని కోరుతుండగా, అమెరికా 20 ఏళ్లు కావాలని పట్టుబడుతోంది. ప్రస్తుతం ఇది 12 నుంచి 15 ఏళ్ల మధ్య కుదిరే అవకాశం ఉంది. ఒక వేళ చర్చలు విఫలమైతే, అమెరికా తిరిగి సైనిక చర్యలు చేపట్టే లేదా నావికా దళ దిగ్బంధనాన్ని కొనసాగించే అవకాశం కూడా ఉంది.

Frequently Asked Questions

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడ్డాయా?

అవును, అమెరికా, ఇరాన్ దేశాలు తమ మధ్య ఉన్న శత్రుత్వాన్ని వీడి, శాంతి దిశగా పయనించేందుకు ఒక ప్రాథమిక ఒప్పందం దిశగా ఆడుగులు వేస్తున్నాయి. ఈ పరిణామం ప్రపంచ వాణిజ్యానికి, ఇంధన భద్రతకు కీలకం కానుంది.

ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం ఇరాన్ ఎలాంటి షరతులకు అంగీకరించాలి?

ఇరాన్ తన అణు శుద్ధి కార్యక్రమాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించుకోవాలి. అంతేకాకుండా, తన వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియంను తొలగించడానికి కూడా ఇరాన్ అంగీకరించాలి.

ఈ ఒప్పందం కుదిరితే అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?

అమెరికా ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తుంది. దీనివల్ల వివిధ దేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధులు తిరిగి ఆ దేశానికి చేరుతాయి.

హార్ముజ్‌ జలసంధిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధి గుండా నౌక రాకపోకలపై ఉన్న ఆంక్షలను ఇరు దేశాలు తొలగించనున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
US PERM Labor Certification Suspension: అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget