అన్వేషించండి

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ

Irumudi Glimpse Review: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న 'ఇరుముడి' ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఒక్కటంటే ఒక్క షాట్‌లో మాస్ టచ్ చూపించిన ఈ గ్లింప్స్‌ ఎలా ఉందంటే?

Ravi Teja Irumudi Glimpse News: మాస్ మహారాజా రవితేజ రెగ్యులర్ మాస్ యాక్షన్ సినిమాల నుంచి కాస్త పక్కకు జరిగి, హృదయాన్ని హత్తుకునే ఓ చక్కటి భావోద్వేగభరిత కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'ఇరుముడి'తో మరోసారి తనలో ఫ్యామిలీ ఎమోషన్స్ బయటకు తీస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా విడుదలైంది. అది ఎలా ఉందో రివ్యూలో చూడండి.

ఒక్క షాట్‌లో మాస్ టచ్...
మందు మానేయడం కోసం దీక్ష!?
'ఇరుముడి' గ్లింప్స్ చూస్తుంటే... తండ్రీ కుమార్తె కథ ప్రధానాంశం అని అర్థం అవుతోంది. సాధారణ మధ్య తరగతి తండ్రి పాత్రలో రవితేజ చాలా సహజంగా కనిపించారు. నటనలోనూ సహజత్వం కనిపించింది. తన ప్రపంచం కూతురు అనుకుని ఆమె చుట్టూ తిరిగే తండ్రిగా ఆయన నటన అద్భుతంగా ఉంది. అయితే ఒక్కటంటే ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ చూపించారు. కత్తితో పీక కోసే సన్నివేశంలో యాక్షన్ హీరోని బయటకు తీశారు.

కూతురి కోసం మందు మానేసిన తండ్రిగా రవితేజ కనిపించనున్నట్టు 'ఇరుముడి' గ్లింప్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. అమ్మాయి అడగటంతో తాగుడు అలవాటుకు దూరంగా ఉండటం కోసం, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవరచుకోవడం కోసం అయ్యప్ప దీక్ష తీసుకున్నట్టు తెలుస్తోంది. చిన్నారి కోరిక మేరకు అయ్యప్ప స్వామిమాల ధరించిన హీరో తర్వాత ఏం చేశాడనేది ఆసక్తికరం.

Also ReadRam Charan Peddi First Review - 'పెద్ది' ఫస్ట్ రివ్యూ: కథను మలుపు తిప్పే మరణం... చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినా ఎందుకీ మిక్స్డ్ టాక్?

దర్శకుడు శివ నిర్వాణ తండ్రీకూతుళ్ల మధ్య సున్నితమైన భావోద్వేగాలను చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం రవితేజ తన ఇమేజ్‌ను పక్కన పెట్టి నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అర్థం అవుతోంది. రవితేజ కుమార్తె పాత్రలో నక్షత్ర నటించింది. గ్లింప్స్‌లో ఆ చిన్నారి నటన ముద్దు ముద్దుగా ఉంది.

Also ReadRam Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

'ఇరుముడి' సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రవిశంకర్ యలమంచిలి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమా విడుదల కానుంది. తమిళ్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. వరుస ఫ్లాప్స్‌ తర్వాత రవితేజకు ఈ సినిమా సక్సెస్ అందిస్తుందని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

Also ReadPeddi Vs Game Changer - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Varanasi: రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి
రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
Peddi Collections Day 2: రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Yash Alibaug Property: షారుఖ్, విరాట్ కోహ్లీ సరసన యశ్... ఖరీదైన ఎస్టేట్ కొన్న Toxic సినిమా హీరో
షారుఖ్, విరాట్ కోహ్లీ సరసన యశ్... ఖరీదైన ఎస్టేట్ కొన్న Toxic సినిమా హీరో
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Peddi Collections Day 2: రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
India Predicted Playing XI Vs AFG: ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
Embed widget