అన్వేషించండి

Texas Resident Rips Indian Flag: డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !

Anti Indian Racism in Dallas: అమెరికాలో భారత జాతీయ జెండాను చించివేస్తూ విద్వేషాలు రగిల్చేందుకు కొంత మంది ప్రయత్నించారు. శ్వేతజాతీయులు అసూయ, సోషల్ మీడియా రీచ్ కోసం ఇటీవల బరి తెగిస్తున్నారు

Racist Attacks on Indian Americans in USA:   అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ సబర్బ్ పరిధిలోకి వచ్చే  ఫ్రిస్కో   సిటీ హాల్ వద్ద భారతీయులను, భారత జాతీయ జెండాను అవమానిస్తూ సాగుతున్న విద్వేషపూరిత చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒక శ్వేతజాతీయుడు ఫ్రిస్కో సిటీ హాల్ ఎదుట భారత త్రివర్ణ పతాకాన్ని చించివేస్తూ,  బూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. డల్లాస్ రీజియన్‌లోకి భారతీయుల వలసలు  విపరీతంగా పెరిగిపోతున్నాయంటూ.. స్థానిక శ్వేతజాతీయుల్లోని కొందరు అతివాద ఆలోచనలున్న వ్యక్తులు ఈ రకమైన జాత్యహంకార దాడులకు ఒడిగడుతున్నారు.  

వలసల ముసుగులో జాత్యహంకార దాడి 

టెక్సాస్‌లోని ఫ్రిస్కో, ప్లానో వంటి నగరాలు ఐటీ హబ్‌లుగా మారడంతో గత దశాబ్ద కాలంలో భారతీయుల, ప్రత్యేకించి తెలుగువారి జనాభా అక్కడ ఊహించని స్థాయిలో పెరిగింది. అయితే, ఈ డెమోగ్రాఫిక్ మార్పులను అక్కడి కొందరు స్థానిక శ్వేతజాతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. హెచ్-1బీ వీసాల ద్వారా భారతీయులు వచ్చి తమ ఉద్యోగాలను, ఇళ్లను లాగేసుకుంటున్నారనే నెపంతో.. సిటీ కౌన్సిల్ సమావేశాల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ భారతీయులను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఒక దేశ అధికారిక పతాకాన్ని ముక్కలు చేస్తూ నినాదాలు చేయడం కేవలం వలసలపై వ్యతిరేకత మాత్రమే కాదు, అది స్పష్టమైన  హేట్ క్రైమ్ ని అక్కడి ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 సోషల్ మీడియా  రీచ్  కోసం బరితెగింపు 

ఈ మధ్యకాలంలో అమెరికాలో భారతీయులకు వ్యతిరేకంగా మాట్లాడితే సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్, విపరీతమైన ఎంగేజ్‌మెంట్ వస్తుండటంతో.. కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు, కరడుగట్టిన యాక్టివిస్టులు దీన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. కేవలం వ్యూస్, ఫాలోవర్లను పెంచుకోవడమే పరమావధిగా పెట్టుకుని.. భారతీయ సంస్కృతిని, భాషను వెక్కిరిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఫ్రిస్కో సిటీ హాల్ ఘటనలో కూడా సదరు వ్యక్తి వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో పెట్టడం వెనుక.  సోషల్ మీడియా రీచ్ , పబ్లిసిటీ సాధించాలనే చౌకబారు వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.

 హిందూ దేవాలయాలు, మసీదులపై అభ్యంతరాలు 

ఇటీవల ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ సమావేశాల్లో కొందరు నేరుగా వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నగరంలో కొత్తగా నిర్మించ తలపెట్టిన రెండు హిందూ దేవాలయాలు, ఒక మసీదు నిర్మాణానికి అనుమతులు ఇవ్వకూడదంటూ వారు కౌన్సిల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.  వలసదారులు వచ్చి టెక్సాస్‌ను ఆక్రమిస్తున్నారు, క్రైస్తవత్వాన్ని తుడిచిపెట్టేయాలని చూస్తున్నారు  అంటూ మతపరమైన రంగు పులిమి పల్లెల్లో విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.  

 తిరగబడుతున్న ప్రవాస భారతీయులు 

అమెరికా ఆర్ధిక వ్యవస్థకు, శాస్త్ర సాంకేతిక రంగాలకు భారతీయులు అందిస్తున్న సహకారం ఎనలేనిది. అత్యధిక పన్నులు చెల్లిస్తూ, అత్యంత క్రమశిక్షణ కలిగిన కమ్యూనిటీగా పేరు తెచ్చుకున్న భారతీయ అమెరికన్లు.. ఈ జాత్యహంకార దాడులపై ఇప్పుడు గట్టిగా తిరగబడుతున్నారు. ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ సమావేశాల్లో నేహా సూరత్ రాణి, సాహస్ కౌల్ వంటి భారతీయ సంతతి ప్రతినిధులు స్థానిక అధికారుల ముందే నిలబడి..  పాలసీలపై చర్చల ముసుగులో మా కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ జాత్యహంకారాన్ని ప్రదర్శిస్తే ఊరుకోబోం అంటూ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.

 
అమెరికా చట్టాల ప్రకారం బహిరంగ వేదికలపై ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాలను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్  కింద పరిగణించడం అక్కడి భారతీయులకు శాపంగా మారింది. కేవలం సోషల్ మీడియా క్రేజ్ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేస్తున్న ఇటువంటి అనాగరిక చర్యలు.. డల్లాస్ రీజియన్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
INDIA Bloc June 8 Meeting Delhi: ఇండీ కూటమికి గడ్డు పరిస్థితి - స్టాలిన్ గుడ్ బై - మమతా పరిస్థితి - విజయ్ కాపాడతాడా?
ఇండీ కూటమికి గడ్డు పరిస్థితి - స్టాలిన్ గుడ్ బై - మమతా పరిస్థితి - విజయ్ కాపాడతాడా?
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Tamil Nadu Politics 2026 Post Election: విజయ్..అన్నామలై..ధనుష్.. తమిళ పాలిటిక్స్‌లో కొత్త కెరటాలు - ద్రవిడ కోటలన్నీ కూలిపోతాయా?
విజయ్..అన్నామలై..ధనుష్.. తమిళ పాలిటిక్స్‌లో కొత్త కెరటాలు - ద్రవిడ కోటలన్నీ కూలిపోతాయా?
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Peddi Collections Day 2: రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
India Predicted Playing XI Vs AFG: ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
Embed widget