అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగినా, చమురు ధరల స్థిరత్వం రావడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చు. ఈ ఏడాది చివరి వరకు చమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది.
ABP India at 2047 Conclave: పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
ABP Network India@2047 Summit: అమెరికా, ఇరాన్ సంక్షోభం ముగిసినా చమురు ధరలు కొన్ని నెలలపాటు దిగిరాకపోవచ్చని, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు, రూపాయికి నష్టం కలిగిస్తుందని మాంటెక్ సింగ్ అహ్లువాలియా అన్నారు.

India at 2047 Conclave Live: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అహ్లూవాలియా (Montek Singh Ahluwalia ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడే తగ్గుముఖం పట్టినా, చమురు ధరల పెరుగుదల మరికొన్ని నెలల పాటు ఇలాగే కొనసాగవచ్చని అహ్లూవాలియా హెచ్చరించారు. ఏబీపీ నెట్‌వర్క్ న్యూఢిల్లీలో నిర్వహించిన 'ఇండియా@2047 సదస్సు'లో పాల్గొన్న అహ్లూవాలియా కీలక అంశాలను షేర్ చేసుకున్నారు. భారత్‌పై ఈ సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపనుందో వివరించారు. అటు ప్రభుత్వంతో పాటు, ఇటు వ్యాపార వర్గాలకు అనిశ్చితి అతిపెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు.
చమురు ధరలు ఇంకా పెరుగుతాయా..
అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిరినా.. ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం రావడానికి టైమ్ పడుతుందని అహ్లూవాలియా పేర్కొన్నారు. ‘అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందానికి వచ్చినా, పరిస్థితులు ఇంకో 6 నెలల సమయం పడుతుంది. ఈ ఏడాది చివరి వరకు చమురు ధరలు ఇదే స్థాయిలోనే ఉంటాయి. ఒకవేళ సంక్షోభం మరింత ముదిరితే, మన చేసేది ఏం ఉండదు. రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించలేం. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను ప్రపంచ మార్కెట్లు గమనిస్తున్నాయి. చమురు సరఫరా, రవాణా మార్గాలకు ఆటంకం కలుగుతుందని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. ప్రపంచంలోనే అత్యధికంగా ముడిచమురు దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటై భారత్‌కు, ఇంధన ధరల్లో వచ్చే మార్పులు అత్యంత కీలకం కానున్నాయని’ తెలిపారు.
ఆర్థిక నష్టాలను పెంచుతున్న ప్రపంచ అనిశ్చితి
పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం కేవలం చమురు మార్కెట్లకే పరిమితం కాలేదని, అంతకంటే ఎక్కువే ప్రభావం చూపుతుందని అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. వృద్ధి అవకాశాలను దెబ్బతీస్తున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ప్రస్తావించారు. ‘అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువ. అనిశ్చితి కూడా చాలా ఎక్కువ. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల రూపాయితో పోల్చితే సాధారణంగా డాలర్ బలపడుతుంది. దీనివల్ల భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది కరెన్సీపై, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడిని మరింత పెంచుతుంది. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (CAD - కరెంట్ ఖాతా లోటు) తగ్గితే.. రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చు’ అన్నారు.
దిగుమతులను నిషేధిస్తే నష్టమే
విదేశీ మారక నిల్వలను వాడుకుంటూ కరెన్సీ పతనాన్ని ఎన్నాళ్లని అడ్డుకోగలమని ప్రశ్నించారు. రూపాయి విలువ క్షీణించకుండా మీరు ఎలా ఆపుతారు? మీ దగ్గరున్న నిల్వలన్నింటినీ విసిరేస్తారా? కానీ, భారీగా నిల్వలను వాడుకోవడాన్ని మాత్రం సమర్థించనని అహ్లూవాలియా స్పష్టం చేశారు. ముడిచమురు లాంటి వస్తువుల దిగుమతి ఖర్చులు పెరిగినప్పుడు, ఆ ప్రభావాన్ని తట్టుకోవడానికి స్థూల ఆర్థిక సర్దుబాట్లు అవసరమని తెలిపారు.
"స్థూల ఆర్థిక వ్యవస్థ ప్రకారం మనం మొత్తం డిమాండ్‌ను తగ్గించుకోవాలి. అంతే తప్పా, దిగుమతులను పూర్తిగా నిషేధించడమో లేదా ఆపేయడమో చేస్తే అనుకున్నది మాత్రం జరగదు, పైగా అది మరింత నష్టదాయకం. రూపాయి విలువను నియంత్రించడం కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలక సవాలుగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై పూర్తిగా ఆధారపడకుండా, దిగుమతి చేసుకునే వస్తువుల అసలు ఖర్చును వినియోగదారులు, వ్యాపారాలే భరించాలని’ సూచించారు.
"ప్రస్తుత పరిస్థితుల్లో భారత రూపాయి విలువ తగ్గకుండా చూడటం చాలా అవసరం. మీరు ఏదైనా దిగుమతి చేసుకుంటున్నారంటే.. మీరు పేదవారు కానంత వరకు ఆ వస్తువు ధరను మీరే చెల్లించాలి. అందరికీ కాకుండా, కేవలం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీలు లేదా సహాయం అందించాలని’ అహ్లూవాలియా ఈ వ్యాఖ్యలు చేశారు.
Before You Go
Vizag Town Hall History: స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వైజాగ్ టౌన్ హాల్ చరిత్ర | ABP Desam
Frequently Asked Questions
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చమురు ధరలను ఎంతకాలం ప్రభావితం చేస్తాయి?
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
అమెరికాలో అధిక వడ్డీ రేట్లు, అనిశ్చితి కారణంగా డాలర్ బలపడి, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇది కరెన్సీ, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతుంది.
భారత రూపాయి విలువ క్షీణించకుండా నివారించడానికి ఏమి చేయాలి?
కరెంట్ ఖాతా లోటును తగ్గించుకుంటే రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా, దిగుమతి చేసుకునే వస్తువుల అసలు ఖర్చును వినియోగదారులు, వ్యాపారాలు భరించాలి.
దిగుమతులను నిషేధించడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?
దిగుమతులను పూర్తిగా నిషేధించడం లేదా ఆపేయడం వల్ల అనుకున్న ప్రయోజనం నెరవేరదు, పైగా అది మరింత నష్టదాయకం. స్థూల ఆర్థిక సర్దుబాట్లు అవసరం.
ట్రెండింగ్ వార్తలు






















