అన్వేషించండి

Iran Nuclear Enrichment: యుద్ధం ముంచుకొచ్చినా సరే, న్యూక్లియర్ మిషన్ కొనసాగుతుంది... ఇరాన్ మంత్రి ప్రకటన

Iran talks with US | ఇరాన్ విదేశాంగ మంత్రి అమెరికాతో చర్చలపై స్పందించారు. న్యూక్లియర్ మిషన్, యురేనియం సమృద్ధిపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

టెహ్రాన్: యుద్ధం ముంచుకొచ్చినా సరే యురేనియం సమృద్ధిని (Uranium Enrichment) ఎప్పటికీ వదులుకోబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి ఆదివారం నాడు కీలక ప్రకటన చేశారు. టెహ్రాన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ, ఇరాన్ తన శాంతియుత అణు కార్యక్రమం కోసం చాలా ఖర్చు చేసిందని గుర్తుచేశారు. 

"మేము యురేనియం నిల్వలపై విజయం సాధించి తీరుతాం. ఈ విషయంలో ఒకవేళ యుద్ధం జరిగితే కూడా మా చర్యలను ఆపాలని భావించడం లేదు. ఎందుకంటే ఇరాన్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు" అని అన్నారు. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ను కలిసిన రెండు రోజుల తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ ప్రకటన చేశారు. 

ఇది టెహ్రాన్ హక్కు.. ఇరాన్ విదేశాంగ మంత్రి

అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ.. యురేనియం సమృద్ధి అనేది ఇరాన్ హక్కు. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ అంశంపై ఒక ఒప్పందానికి రావడానికి ఇరాన్ సిద్ధంగా ఉందన్నారు. మస్కట్ లో జరిగిన చర్చలు గుడ్ బిగినింగ్ అని అన్నారు. అమెరికా ప్రతినిధి బృందంతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని వెల్లడించారు. అయితే, నమ్మకం పెంచుకోవడానికి ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికాతో చర్చలను త్వరలో తిరిగి ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు.  

ఇరాన్ తో చర్చలను ప్రశంసించిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా, ఇరాన్ మధ్య కొన్నేళ్ల నుంచి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటీవల పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇరాన్ తో జరిగిన చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాజిటివ్ గా స్పందించారు. వచ్చే వారం మరో రౌండ్ మీటింగ్ జరిగే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం అమెరికా ఒత్తిడిని కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు విధించే కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఇరాన్ చమురు ఎగుమతులకు సంబంధించిన షిప్పింగ్ సంస్థలు, నౌకలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ కొత్త ఆంక్షలు విధించారు. 

వీటితోపాటు విట్కాఫ్, జారెడ్ కుష్నర్ అరేబియా సముద్రంలో మోహరించిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధనౌకను సందర్శించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని ప్రజలకు తెలిపింది. ఇరాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ,  అమెరికా దాడికి ప్రయత్నిస్తే కనుక తాము సైతం అమెరికా స్థావరాలపై దాడికి సిద్ధమని పేర్కొన్నారు. ఇరాన్ ప్రయోజనాలపై తగ్గేది లేదన్నారు. మిస్సైల్ ప్రయోగం కార్యక్రమంపై చర్చించే అవకాశమే లేదన్నారు. ఇది తమ దేశ జాతీయ భద్రతకు సంబంధించిన విషయంగా పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget