అన్వేషించండి

India-US Trade Deal Decode: అమెరికాతో ట్రేడ్ డీల్‌తో భారత్‌కు కలిగే ప్రయోజనాలు ఏంటీ? వేటిపై ధరలు తగ్గుతాయి

India-US Trade Deal : భారత్-అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై శనివారం ప్రకటన చేశారు. ఇరు దేశాలకూ పరస్పర వాణిజ్య ప్రయోజనం చేకూరుతుంది.

India-US Trade Deal Decode: భారత్, అమెరికా ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి అంగీకరించినట్లు శనివారం ప్రకటన చేశాయి. దీని ప్రకారం, భారత్ అమెరికా నుండి వచ్చే వివిధ రకాల ఆహార పదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తుంది లేదా తగ్గిస్తుంది. ఈ నిర్ణయం భారత వినియోగదారులకు అనేక అమెరికా దిగుమతులు చౌకగా మారే అవకాశం ఉంది. తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్రం వివరించింది.  

ఏయే వస్తువులు చౌకగా మారతాయి?

అమెరికా నుండి వచ్చే ఉత్పత్తులపై టారిఫ్ తగ్గించారు. వాటిలో ఎండిన డిస్టిలర్స్ ధాన్యాలు (DDGs), పశువుల దాణా కోసం ఎర్ర జొన్న, చెట్టు గింజలు, తాజా, ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ నూనె, ప్యాక్ చేసిన ఆహారం, వివిధ రకాల పప్పులు, వైన్ , స్పిరిట్స్ ఉన్నాయి. వీటితో పాటు ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, డివైజ్‌ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. సుంకాలలో ఈ మార్పు తాత్కాలిక ఒప్పందంలో పేర్కొన్నారు.  

భారత్‌లోని ఏయే రంగాలకు ప్రయోజనం  

ఉమ్మడి ప్రకటనలో ‘అమెరికా, భారత్ పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యంపై తాత్కాలిక ఒప్పందం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌పై అంగీకరించాం’ అని పేర్కొన్నారు. దీని ప్రకారం, భారత వస్తువులపై మొదట విధించిన 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తుంది. ఈ 50 శాతంలో 25 శాతం రష్యా నుండి చమురు కొనుగోలుపై పెనాల్టీగా విధించారు. 

సుంకాలలో లభించిన ఈ ఉపశమనం ప్రపంచంలోని అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌లో భారత ఎగుమతిదారులకు అవకాశాన్ని పెంచుతుంది. దీని కారణంగా వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, సాధారణ మందులు, గృహాలంకరణ, హస్తకళలకు సంబంధించిన వస్తువులు, రత్నాలు, ఆభరణాలను ఎగుమతి చేసే భారత ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుతుంది.

భారత్ పలు రంగాలపై సున్నా టారిఫ్ (సుంకం) రాయితీలను ఇచ్చింది. వీటిలో 

ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తులు; లక్షలాది మంది రైతుల జీవనోపాధి ఆధారపడి ఉన్న కీలక ఆహార విభాగాలకు భారత్ పూర్తి రక్షణ కల్పించింది. అవి గోధుమలు, బియ్యం, మొక్కజొన్న, సోయా, తృణధాన్యాలు, పౌల్ట్రీ,  మాంసం. ఇథనాల్, పొగాకు వీటన్నింటిపై టారిఫ్‌లు అలాగే ఉంటాయి. అమెరికా ఎగుమతిదారులకు కొత్తగా ప్రవేశం కల్పించలేదు. 

భారత డైరీ రంగం ఈ రంగం 100 శాతం సురక్షితంగా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

పాలు (అన్ని రూపాల్లో)
చీజ్
వెన్న
నెయ్యి
క్రీమ్
పెరుగు
మజ్జిగ
వే (Whey)
పనీర్ అమెరికా డైరీ ఉత్పత్తులకు భారత మార్కెట్‌లో ఎటువంటి ప్రవేశం కల్పించలేదని ప్రభుత్వం తెలిపింది.

 కూరగాయలు, పండ్లు, ప్రాసెస్డ్ ఫుడ్: తాజా, ఫ్రోజెన్, ఎండిన, క్యాన్డ్ ఉత్పత్తులను పూర్తిగా సురక్షితంగా ఉంచినట్లు ప్రభుత్వం పేర్కొంది.

బంగాళదుంపలు, వెల్లుల్లి, పుట్టగొడుగులు, సొరకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, బఠానీలు, బీన్స్, గుమ్మడికాయ

ప్రాసెస్డ్ కూరగాయలు: ఫ్రోజెన్ బంగాళదుంపలు, బఠానీలు, బీన్స్,  డబ్బాలో నిల్వ చేసిన ఉత్పత్తులు, నిల్వ చేసిన దోసకాయ, పుట్టగొడుగులు.

ఎండిన కూరగాయలు, పప్పుధాన్యాలు: ఎండిన ఉల్లిపాయ, వెల్లుల్లి, డీహైడ్రేటెడ్ పౌడర్, బఠానీలు, కాబూలీ శనగలు, బీన్స్, చిలగడదుంపలు.   

అరటి, అరటి ఉత్పత్తులు
మామిడి, మామిడి ఉత్పత్తులు
సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మ, కాగితం నిమ్మ, గ్రేప్‌ఫ్రూట్)   
స్ట్రాబెర్రీలతో సహా బెర్రీ కేటగిరీ పండ్లు.

మసాలా దినుసులు : మిరియాలు, లవంగాలు, మిర్చి, దాల్చినచెక్క, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, వాము, మెంతులు, ఆవాలు, క్యాసియా, ఇతర మసాలా ఉత్పత్తులు.

 టీ : భారత టీ పరిశ్రమను రక్షించడానికి బ్లాక్ టీ, గ్రీన్ టీ, టీ బ్యాగ్‌లు అమెరికా నుంచి దిగుమతికి అనుమతి ఇవ్వలేదు. వ్యవసాయం, డైరీ, మసాలా దినుసులు, టీ రంగాలలో మన రైతులే వీటిని ఉత్పత్తి చేసి విక్రయిస్తారు, విదేశాలకు సైతం ఎగుమతి చేసుకునే అవకాశం కల్పించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget