అన్వేషించండి

Bitcoin: బిట్ కాయిన్ పెట్టుబడిదారులకు రక్త కన్నీరు - సగానికి పడిపోయిన ధర

Bitcoin crisis: బిట్ కాయిన్లు పెట్టుబడిదారులకు రక్తకన్నీరు పెట్టిస్తున్నాయి. సగానికి సగం విలువ తగ్గిపోయింది.

Bitcoin crisis escalates as value plunges in half: ప్రస్తుతం అంతర్జాతీయ క్రిప్టో మార్కెట్‌లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కరెన్సీ అయిన బిట్‌కాయిన్ (Bitcoin) విలువ దారుణంగా పడిపోతోంది. గత ఏడాది అక్టోబర్‌లో  1,26,000 డాలర్ల మార్కును తాకిన బిట్‌కాయిన్, ప్రస్తుతం సుమారు సగం విలువను కోల్పోయి  67,000 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఈ భారీ పతనం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.
 
అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు క్రిప్టో వంటి అత్యంత రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి తమ పెట్టుబడులను వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలోని  స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్  ల నుంచి జనవరి నెలలోనే సుమారు  3 బిలియన్లకు పైగా నిధులు తరలిపోవడం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. డొనాల్డ్ ట్రంప్ తన రెండో పదవీకాలంలో భాగంగా  కెవిన్ వార్ష్ ను ఫెడ్ చైర్మన్‌గా నామినేట్ చేయడం మార్కెట్‌లో అనిశ్చితికి దారితీసింది. ఆయన కఠినమైన ద్రవ్య విధానాలను  అనుసరిస్తారన్న భయంతో, వడ్డీ రేట్ల తగ్గింపు నెమ్మదించవచ్చని భావిస్తున్న ఇన్వెస్టర్లు క్రిప్టోను విక్రయించి నగదు వైపు మొగ్గు చూపుతున్నారు.         

 మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో ఒక్కరోజులోనే దాదాపు  1 బిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్ పొజిషన్లు ఆటోమేటిక్‌గా క్లోజ్  అయ్యాయి. దీనివల్ల ఒకరు విక్రయిస్తే మరొకరు విక్రయించాల్సి వచ్చే  చైన్ రియాక్షన్  మొదలై, ధరలు నిమిషాల వ్యవధిలో కుప్పకూలాయి. మైక్రోస్ట్రాటజీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు కూడా ఈ ప్రభావంతో భారీగా నష్టపోయాయి. ప్రస్తుతం కృత్రిమ మేధ  రంగంపై ఉన్న హైప్ తగ్గుతుండటం, టెక్నాలజీ స్టాక్స్ నష్టపోవడం కూడా బిట్‌కాయిన్‌పై ఒత్తిడి పెంచింది. బిట్‌కాయిన్ మైనర్లు తమ కార్యకలాపాల కోసం నిధులను సేకరించేందుకు భారీగా కాయిన్లను విక్రయిస్తుండటం కూడా ఈ సంక్షోభానికి మరో కారణం.   

ప్రస్తుతానికి బిట్‌కాయిన్‌కు 60,000 డాలర్ల స్థాయి కీలక సపోర్ట్‌గా ఉంది. ఒకవేళ ధర అంతకంటే దిగువకు పడిపోతే, అది మరింత పతనమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. క్రిప్టో కరెన్సీలో కేవలం బిట్ కాయిన్లే కాక ఇతర అన్ని క్రిప్టోల ధరలు తగ్గుతున్నాయి. కానీ బిట్ కాయిన్లు తగ్గిపోవడం వల్ల పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.      

టాప్ హెడ్ లైన్స్

Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Adhav Arjuna Divorce: విడాకులు తీసుకున్న తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున.. భార్య డైసీ మార్టిన్‌ బ్యాగ్రౌండ్ తెలుసా ?
విడాకులు తీసుకున్న తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున.. భార్య డైసీ మార్టిన్‌ బ్యాగ్రౌండ్ తెలుసా ?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Embed widget