అన్వేషించండి

India US Interim Trade Deal:భారత్- అమెరికా మధ్యంతర డీల్‌తో మనకు కలిగే ప్రయోజనం ఏంటీ? అమెరికాలో ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి?

India US Interim Trade Deal: భారత్‌- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. USలో జీరో-టారిఫ్ వస్తువులు ఎంత ధరకు లభిస్తాయో చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

India US Interim Trade Deal: భారత్‌- యునైటెడ్ స్టేట్స్ మధ్య చాలా కాలంగా ఉన్న టారిఫ్ వివాదం ఇవాళ్టితో ముగిసింది. రెండు దేశాలు మధ్యంతర వాణిజ్య ఫ్రేమ్‌వర్క్‌ కోసం అంగీకారించాయి. దీంతో భారత ఎగుమతిదారులకు మంచి ప్రోత్సాహం లభించనుంది. ఈ ఒప్పందం ప్రకారం, చాలా భారతీయ వస్తువులు 50శాతానికి బదులుగా తగ్గిన 18 శాతం టారిఫ్‌తోనే వస్తువులు ఎగుమతి చేయవచ్చు. అంతే కాకుండా మరికొన్ని ముఖ్యమైన ఉత్పత్తులు ఎలాంటి టారిఫ్‌ లేకుండానే US మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. ఇలా జీరో టారిఫ్‌తో ఎగుమతయ్యే వస్తువులు USలో ఎంతకు అమ్ముడవుతాయో తెలుసుకుందాం.

సాధారణ మందులు

 భారత్‌ ఇప్పటికే ప్రపంచానికి ఫార్మసీ హబ్‌గా మారింది. ఇప్పుడు ఈ ఒప్పందం ఈ ఫార్మా రంగానికి మరింత బూస్ట్ ఇస్తుంది. మన దేశంలో తయారయ్యే జనరిక్ ఔషధాలపై జీరో టారిఫ్ ఉంది. దీంతో అమెరికాలో సాధారణ మందుల ధరలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. గతంలో దిగుమతి సుంకాల కారణంగా స్ట్రిప్‌కు దాదాపు $15కి విక్రయించేవాళ్లు. ఇప్పుడు అదే స్ట్రిప్‌ $9 నుంచి $10 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది అమెరికన్ రోగులకు అవసరమైన మందులను మరింత చౌకగా మార్చడమే కాకుండా భారతీయ ఔషధ కంపెనీల ఎగుమతులకు మంచి ప్రోత్సాహకరంగా మారుతుంది. లాభాలను కూడా పెంచుతుంది.

రత్నాలు - వజ్రాలు 

గుజరాత్ , మహారాష్ట్రలోని భారత్‌ వజ్రాల పాలిషింగ్ కేంద్రాలు ఈ డీల్‌తో మంచి ప్రయోజనం పొందుతాయి. దేశం నుంచి ఎగుమతి అయ్యే పాలిష్ చేసిన వజ్రాలు, విలువైన రాళ్ళు ఇప్పుడు ఎటువంటి దిగుమతి టారిఫ్స్‌ లేకుండా US మార్కెట్‌కు చేరుకోగలవు. గతంలో USలో దాదాపు $1,000కి అమ్ముడైన వజ్రపు ఉంగరం ఇప్పుడు దాదాపు ₹650 నుంచి $700 కే కొనుక్కోవచ్చు. ఇది బెల్జియం లేదా UAE నుంచి వచ్చే వజ్రాల కంటే తక్కువ ధరకు లభించనుంది. దీని వల్ల  వజ్రాల వ్యాపారంలో ప్రపంచ దేశాలతో పోటీతత్వాన్ని పెంచుతుంది.  

విమాన భాగాలు 

భద్రతా సమస్యల కారణంగా గతంలో సుంకాలు విధించారు. దీంతో భారత్‌లో తయారైన విమాన విడిభాగాలను ఇప్పుడు అమెరికాలో ఎలాంటి టారిఫ్ లేకుండా విక్రయిస్తారు. భారత్‌లో పెరుగుతున్న ఏరోస్పేస్ తయారీ పర్యావరణ వ్యవస్థకు ఈ మార్పు చాలా కీలకంకానుంది. టారిఫ్‌ తొలగింపు భారతీయ సరఫరాదారులు తక్కువ ధరలకు విడిభాగాలను అందించడానికి వీలు కల్పిస్తుంది.              

పట్టు ఉత్పత్తులు    

కొన్ని రకాల పట్టు ఉత్పత్తులు ఇప్పుడు USలో సుంకాలు లేకుండా అందుబాటులో ఉంటాయి. ఇది $113 బిలియన్ల మార్కెట్. ఉదాహరణకు, గతంలో USలో దాదాపు $50 ఖరీదు చేసే భారతీయ పట్టు స్కార్ఫ్ ఇప్పుడు షిప్పింగ్, స్థానిక పన్నులను బట్టి $30 నుంచి $35 వరకు దొరుకుతుంది.       

చేతివృత్తుల ఉత్పత్తులు 

సాంప్రదాయ భారతీయ హస్తకళలను కూడా జీరో-టారిఫ్ జాబితాలో చేర్చారు. తుది రిటైల్ ధరలు ఇప్పటికీ లాజిస్టిక్స్ ,US రాష్ట్ర పన్నులపై ఆధారపడి ఉంటాయి, దిగుమతి సుంకాలను తొలగించడం వలన ఈ ఉత్పత్తుల ధరలు చాలా వరకు తగ్గుతున్నాయి.     

Frequently Asked Questions

భారత్-యుఎస్ మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

చాలా కాలంగా ఉన్న టారిఫ్ వివాదాన్ని పరిష్కరించి, భారతీయ ఎగుమతులకు ప్రోత్సాహం అందించడమే ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీని వల్ల భారతీయ ఉత్పత్తులు US మార్కెట్లోకి తక్కువ సుంకాలతో ప్రవేశించగలవు.

ఈ ఒప్పందం ప్రకారం ఏ భారతీయ ఉత్పత్తులకు జీరో టారిఫ్ వర్తిస్తుంది?

సాధారణ మందులు, రత్నాలు మరియు వజ్రాలు, విమాన భాగాలు, కొన్ని రకాల పట్టు ఉత్పత్తులు, మరియు చేతివృత్తుల ఉత్పత్తులకు జీరో టారిఫ్ వర్తిస్తుంది. దీంతో అమెరికాలో ఈ వస్తువుల ధరలు తగ్గుతాయి.

జీరో టారిఫ్ వల్ల భారతీయ ఔషధ రంగం ఎలా ప్రయోజనం పొందుతుంది?

భారతదేశంలో తయారయ్యే జనరిక్ ఔషధాలపై జీరో టారిఫ్ వర్తిస్తుంది. దీనివల్ల అమెరికాలో సాధారణ మందుల ధరలు గణనీయంగా తగ్గుతాయి. ఇది భారతీయ ఔషధ కంపెనీల ఎగుమతులను పెంచి, లాభాలను మెరుగుపరుస్తుంది.

వజ్రాలు మరియు రత్నాల వ్యాపారంలో ఈ ఒప్పందం ఎలాంటి ప్రభావం చూపుతుంది?

భారత్ నుంచి ఎగుమతి అయ్యే పాలిష్ చేసిన వజ్రాలు, విలువైన రాళ్ళు ఇప్పుడు ఎటువంటి దిగుమతి టారిఫ్స్ లేకుండా US మార్కెట్‌కు చేరుకోగలవు. దీని వల్ల వజ్రాల వ్యాపారంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీతత్వాన్ని పెంచుకోగలదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dangerous bike smoke: బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Visa Interview Tips : వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
Hard Rock Cafe Close: రాక్ అండ్ రోల్ థీమ్‌ రెస్టారెంట్స్‌కు గడ్డు కాలం - భారతదేశంలో మూతపడిన హార్డ్ రాక్ కేఫ్‌లు
రాక్ అండ్ రోల్ థీమ్‌ రెస్టారెంట్స్‌కు గడ్డు కాలం - భారతదేశంలో మూతపడిన హార్డ్ రాక్ కేఫ్‌లు
Advertisement

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget