Kash Patel: అమెరికా ఎఫ్‌బీఐ కొత్త చీఫ్‌గా చెందిన కాష్ పటేల్, ఇంతకీ ఎవరితను?
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన టీమ్ ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కశ్యప్ అలియాస్ కాష్ పటేల్‌ను నామినేట్ చేశారు.
Kash Patel : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెల 20వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం తన యంత్రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ట్రంప్ పలువురు భారత సంతతికి చెందిన అమెరికన్లను కీలక పదవుల్లో నియమిస్తున్నారు. ఇప్పటికే వివేక రామస్వామి, జై భట్టాచార్య వంటి ప్రముఖులకు ఉన్నత పదవులు కట్టబెట్టారు. తాజాగా, మరో భారతీయుడికి కీలక పదవిని అప్పగించారు. భారత సంతతికి చెందిన లాయర్.. కశ్యప్ పటేల్ అలియాస్ కాష్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎప్‌బీఐ) డైరెక్టర్‌గా నామినేట్ చేసినట్లు ఆయన ప్రకటించారు.
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన టీమ్ ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కశ్యప్ అలియాస్ కాష్ పటేల్‌ను నామినేట్ చేశారు. కాష్ పటేల్ ఓ లాయర్, ఇన్వెస్టిగేటర్, అమెరికా ఫస్ట్ ఫైటర్ అని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాష్ పటేల్ తన కెరీర్‌ను అవినీతిని బహిర్గతం చేయడం, న్యాయాన్ని, అమెరికన్ ప్రజలను రక్షించడం కోసం గడిపారని ట్రంప్ కొనియాడారు. దీంతో భారతీయ సంతతికి చెందిన మరో వ్యక్తికి అమెరికాలో పెద్ద బాధ్యత లభించినట్లు అయింది.
Also Read : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపద ఎంతో తెలుసా?
"ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తదుపరి డైరెక్టర్‌గా కశ్యప్ 'కాష్' పటేల్ పనిచేస్తారని ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను" అని ట్రంప్ శనివారం రాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సత్యం, జవాబుదారీతనం, రాజ్యాంగానికి మద్దతుదారుగా నిలబడి రష్యా మోసాన్ని బహిర్గతం చేయడంలో పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించారని ట్రంప్ కొనియాడారు. ఈ ఎఫ్‌బీఐ వల్ల అమెరికాలో పెరుగుతున్న నేరాలు, వలస నేరస్తుల ముఠాలను నిర్మూలిస్తుందని, సరిహద్దుల్లో మనుషులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను కూడా అరికడుతుందని ట్రంప్ అన్నారు. ఎఫ్‌బిఐలో సమగ్రత, ధైర్యం, నిజాయితీని పునరుద్ధరించడానికి కాష్ మా గొప్ప అటార్నీ జనరల్ పామ్ బోండి ఆధ్వర్యంలో పనిచేస్తారని ఆయన తెలిపారు.
ట్రంప్‌నకు వీరవిధేయుడిగా క్యాష్ పటేల్ కు మంచి గుర్తింపు ఉంది. భారతదేశంలోని గుజరాతీ మూలాలున్న కాష్ పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికాకు చెందిన ఉంగడా నుంచి కెనడాకు, అక్కడ నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో గుజరాతీ భారతీయ దంపతులకు క్యాష్ పటేల్ జన్మించారు. తండ్రి ఏవియేషన్ కంపెనీలో ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తదనంతరం యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక లా సంస్థలో ఉద్యోగార్థం ప్రయత్నాలు చేసి విఫలమై మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి వివిధ హోదాల్లో సేవలందించారు.
ప్రస్తుత ఎఫ్‌బిఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే పని పట్ల డొనాల్డ్ ట్రంప్ సంతోషంగా లేరు. 2017లో ఆయనను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ట్రంప్ నియమించారు. అయితే రహస్య పత్రాలకు సంబంధించిన విచారణలో ట్రంప్‌పై చర్యలు తీసుకున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.