Rare Alignment Of 5 Planets : 24న ఆకాశంలో అద్భుతం - మిస్సయితే మళ్లీ చూడలేరు !
సౌరవ్యవస్థలోని ఐదు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి రాబోతున్నాయి. ఈ నెల 24న ఈ అద్భుతం జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
rare alignment of 5 planets : ఈ నెలలో ఖగోళ ప్రియులను ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనున్నది. సౌరవ్యవస్థలోని ఐదు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి రాబోతున్నాయి. ఈ ఖగోళ అద్భుతం ఈ నెల 24న ఆవిష్కృతం కానున్నది. ఈ నెలలో బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి.
An alignment of 2 or 3 planets is a rather common event, but an array of 5 planets is quite rare.https://t.co/tSBrA9u2Zv#planets #june #astronomy #astrology #zodiac #trending #Horoscope pic.twitter.com/G75rg7uMFf
— Indastro (@indastro) June 5, 2022
ఓ వైపు యుద్ధం, మరోవైపు వినోదం- కీవ్ థియేటర్‌లో షోలు హౌస్‌ఫుల్!
అరుదైన దృశ్యాన్ని టెలిస్కోప్‌ల ద్వారా చూడొచ్చని నిపుణులుచెబుతున్నారు. తెల్లవారు జామున ఐదుగ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి కనిపించనున్నాయి. ఈ అరుదైన దృశ్యం 18 సంవత్సరాల తర్వాత కనిపించనున్నది. ఇంతకు ముందు చివరి సారిగా 2004 డిసెంబర్‌లో కనిపించింది.
Dawn skies to reveal rare alignment of 5 planets, moon in Junehttps://t.co/D3N2LxUARm
— Hera Pinscher (@nz_hera) June 7, 2022
భారత్‌కు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వార్నింగ్- కీలక నగరాల్లో దాడులు చేస్తామని లేఖ
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే .... ఈ సారి బుధుడు, శనిగ్రహాల మధ్య దూరం చాలా తక్కువగా ఉండనున్నది. ఐదు గ్రహాలు సరళ రేఖలోకి రావడం చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్ - పూర్తిగా నయం చేసే డ్రగ్ ట్రయల్స్ విజయవంతం
ఈ గ్రహాలు చివరిసారిగా 2004లో కనిపించాయని, మళ్లీ 2040 లోనే కనిపిస్తాయన్నారు. జూన్ మాసం గడిచేకొద్దీ బుధగ్రహాన్ని సులభంగా చూడొచ్చని , ఈ నెల 24న ప్రత్యేకంగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగాప్రచారం జరుగుతోంది. అదే రోజున వీనస్, మార్స్ మధ్య చంద్రవంకను చూడొచ్చు. సూర్యోదయానికి అరగంట ముందు ఈ ఖగోళ అద్భుతం ఆవిష్కృతమవుతుందని చెప్పారు. తూర్పు వైపు హోరిజోన్‌లో ఈ దృశ్యాన్ని బైనాక్యులర్ సహాయంతో చూడొచ్చ ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే ఇండియాలో ఏ స్థాయిలో కనిపిస్తుందో నిపుణులు ఇంకా వెల్లడించలేదు.