Prophet Remarks Row: భారత్‌కు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వార్నింగ్- కీలక నగరాల్లో దాడులు చేస్తామని లేఖ
Prophet Remarks Row: భారత్‌లోని కీలక నగరాల్లో ఆత్మాహుతి దాడులు చేస్తామని అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది.
Prophet Remarks Row: అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్‌ఖైదా.. భారత్‌ను హెచ్చరించింది. మహమ్మద్ ప్రవక్తను అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అల్‌ఖైదా ప్రకటించింది. భారత్‌లోని కీలక నగరాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరించింది.
So #AlQaeda has now issued a letter.
— Shashank Shekhar Jha (@shashank_ssj) June 7, 2022
It has threatened India of terrôr attaçks in Delhi, Bombay, UP & Gujarat.
Those two-nation sympathisers who are celebrating since yesterday must put their heads in shame today for seeking international interference in a domestic issue. pic.twitter.com/EWLP5dt5YK
కీలక నగరాల్లో
భారత్‌లోని దిల్లీ, ముంబయి నగరాలతో పాటు, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని అల్‌ఖైదా హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను వదలబోమని 6వ తేదీతో వెలువడిన లేఖలో ఉగ్రసంస్థ పేర్కొంది.
భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్‌కుమార్ జిందాల్ వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలు తీవ్ర నిరసనలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని దేశాలు మన రాయబారులకు సమన్లు జారీ చేశాయి. అయితే కొందరు వ్యక్తుల వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించడం, తగదని భారత దౌత్యాధికారులు ఇప్పటికే ఆయా దేశాలకు స్పష్టం చేశారు.
Also Read: Delhi: పార్కింగ్ ఏరియాలో చెలరేగిన మంటలు- 10 కార్లు, 80 ఈ- రిక్షాలు దగ్ధం
Also Read: Coronavirus Cases: దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ భయాలు- 93 రోజుల తర్వాత 5వేలకు పైగా కేసులు