Qin Gang Missing: జర్నలిస్ట్‌తో చైనా విదేశాంగ మంత్రి ఎఫైర్? నెల రోజులుగా అజ్ఞాతంలోనే క్విన్ గాంగ్
Qin Gang Missing: చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ నెల రోజులుగా కనిపించకుండా పోయారు.
Qin Gang Missing:
క్విన్ గాంగ్ అదృశ్యం..
చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ చాలా రోజులుగా కనిపించడం లేదు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి ఎంతో సన్నిహితుడైన ఆయన..నెల రోజులుగా ఎవరి కంటాపడకపోవటం కొత్త చర్చకు దారి తీసింది. ఆయన ఎక్కడికి వెళ్లిపోయారో సమాచారం లేదు. విదేశాంగ మంత్రి కనిపించకుండా పోవడం సాధారణ విషయం కాదు. చైనా కావాలనే సీక్రెట్‌గా ఆయనను దాచి ఉంచిందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. చివరిసారి జూన్ 25న కనిపించారు 57 ఏళ్ల క్విన్. అప్పటి నుంచి మళ్లీ జాడ లేదు. ఏషియన్ సమ్మిట్ హెడ్‌గా ముందుగా క్విన్‌ని నియమించినా ఆ తరవాత తొలగించారు. "అనారోగ్యం వల్లే ఆయన తప్పుకున్నారు" అని చైనా ప్రభుత్వం ప్రచారం చేసినా అది నమ్మశక్యంగా అనిపించడం లేదు. యురోపియన్ యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరగాల్సి ఉన్నా...వాటినీ కారణం లేకుండానే పోస్ట్‌పోన్ చేసింది చైనా. ఇవన్నీ ఎన్నో అనుమానాలకు తెర తీశాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడితో సమావేశమైనప్పటి నుంచి క్విన్ గాంగ్ మిస్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా..చైనా సోషల్ మీడియాలోనూ ఈ విషయంపై చర్చించతుండా సెన్సార్ చేసింది ప్రభుత్వం. అక్కడ "where is Qin Gang" అని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే...సింపుల్‌గా No Results అని చూపిస్తోంది. అంటే ఎంత సీక్రెసీ మెయింటేన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
జర్నలిస్ట్‌తో ఎఫైర్..?
క్విన్ గాంగ్ కనిపించకుండా పోవడానికి ఓ జర్నలిస్ట్‌తో ఉన్న ఎఫైరే కారణమన్న వాదన వినిపిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ ఈ విషయం వెల్లడించింది. సాధారణంగా...చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ ఏ లీడర్ అయినా వివాహేతర సంబంధం పెట్టుకుంటే అసలు సహించదు. వెంటనే ఆ పదవి నుంచి తప్పించేస్తుంది. బ్యాన్ విధిస్తుంది. క్విన్ గాంగ్ కూడా ఇలాంటి ఎక్స్‌ట్రా మారిటల్ ఎఫైర్ పెట్టుకోవడం వల్లే ప్రభుత్వం దూరం పెట్టిందని తెలుస్తోంది. దీనిపై చైనా విదేశాంగ ప్రతినిధులను మీడియా ప్రశ్నించినా.."మాకు ఎలాంటి సమాచారం లేదు" అని సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నారు. ఇక చైనా పౌరులు కూడా ఆయన కనిపించకుండా పోవడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే...అక్కడి మీడియాలో ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్‌సో Qin Gang అనే పేరు ఎక్కడ ఉన్నా వాటిని తొలగించేసింది ప్రభుత్వం. అంటే..పబ్లిక్‌గా ఎవరూ ఆయన గురించి మాట్లాడకూడదని డైరెక్ట్‌గానే హెచ్చరిస్తోంది చైనా. ఆ దేశ పాలిటిక్స్‌లో రైజింగ్ స్టార్‌లా ఉన్న క్విన్ గాంగ్ ఇలా అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం ఆ హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో చైనా బిలియనీర్ జాక్ మా కూడా ఇలానే చాలా రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసిన వెంటనే ఆయన కనిపించకుండా పోయారు. దాదాపు ఏడాది తరవాత మళ్లీ కనిపించారు. కానీ...ఇప్పుడు క్విన్ గాంగ్‌ని తప్పించడానికి కారణాలేంటన్నది మాత్రం క్లారిటీ లేదు.
Also Read: USA Rice Prices Hike: అమెరికాపై బియ్యం ఎగుమతుల నిషేధం ఎఫెక్ట్- షాపుల ముందు క్యూ కట్టిన ఎన్‌ఆర్‌ఐలు!