iPhone Plant In China: రోడ్లపైకి వందలాది మంది ఐఫోన్ ప్లాంట్ ఉద్యోగులు, జీతాలు చాలడం లేదని నిరసనలు
iPhone Plant In China: చైనాలోని ఐఫోన్ ప్లాంట్‌లో వందలాది మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు.
iPhone Plant In China:
ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో నిరసనలు..
చైనాలోని iPhone మేకింగ్ ప్లాంట్‌లో ఒక్కసారిగా నిరసనలు తీవ్రమయ్యాయి. సోషల్ మీడియాలో ఈ ఆందోళనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. Bloomberg రిపోర్ట్ ప్రకారం...సెంట్రల్ చైనాలోని జేంగ్‌జోవూలో Foxconn ప్లాంట్‌లో వందలాది మంది ఉద్యోగులు సెక్యూరిటీ గార్డ్స్‌తో గొడవకు దిగారు. ఇది కాస్తా చినికిచినికి గాలివానగా మారిపోయింది. చాలా నెలలుగా ఇక్కడ కొవిడ్ ఆంక్షల్ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రసుతం జరిగిన గొడవకు కారణమిదే. వందలాది మంది సిబ్బంది రోడ్‌పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పీపీఈ సూట్‌లు ధరించిన సెక్యూరిటీ గార్డ్‌లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా...ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అంతకు ముందు రోజు రాత్రి కూడా
ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగాయి. పదుల సంఖ్యలో ఉద్యోగులు పోలీసులు వాహనాలను అడ్డుకుని నినాదాలు చేశారు. "మా హక్కుల్ని రక్షించండి" అంటూ నినదించారు. బారికేడ్‌లు ఏర్పాటు చేసి...వారిని అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించినా...అది సాధ్యపడలేదు. ఓ పోలీస్ కార్‌ను చుట్టుముట్టిన ఆందోళనకారులు...ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు కూడా ఆందోళనకారులపై కాస్త కఠినంగానే వ్యవహరించారు. జీతాలు సరిగా ఇవ్వడం లేదన్న అసహనంతో పాటు ఇన్‌ఫెక్షన్ సోకుతుందన్న భయంతో వాళ్లు ఆందోళనకు దిగారు. "ఇక్కడికి రావాలంటే భయమేస్తోంది. మా అందరికీ కొవిడ్ సోకిందేమో అని అనుమానంగా ఉంది" అని ఓ ఉద్యోగి అన్నాడు. మరికొందరు యాజమాన్యం తీరుపై విమర్శలు చేస్తున్నారు. "కాంట్రాక్ట్ విషయంలో కుదుర్చుకున్నఒప్పందాన్ని ఉన్నట్టుండి మార్చేశారు" అని మండి పడ్డారు.
Riot in Foxconn factory that makes @Apple products. Workers Confront with the Chinese Communist police with fire extinguishers!
— Inty (@__Inty__) November 23, 2022
制造苹果产品的富士康工厂发生骚乱。工人用灭火器与中共警察对峙!pic.twitter.com/thtZCyjz67
穿着防护服的中国军警暴打iPhone工厂的中国工人
— Inty (@__Inty__) November 23, 2022
Chinese police brutally beating Chinese workers at @apple iPhone factorypic.twitter.com/Vz37Swn1LA
ఐఫోన్ సిటీ..
ఫాక్స్‌కాన్‌లో 2 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ ప్లాంట్ ఉన్న ఏరియాను "iPhone City"గా పిలుస్తారు. దాదాపు అక్టోబర్ నుంచి ఈ ప్రాంతంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. చాలా మంది ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్లిపోయారు. ఫాక్స్‌కాన్ యాజమాన్యం..కొత్త ఉద్యోగులను నియమించుకుంది. జీతాలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పటికీ అది నెరవేరకపోవటం వల్ల ఉద్యోగులంతా ఇలా నిరసన బాట పట్టారు.
Also Read: Cemetery Job: ప్రశాంతత కోసం శ్మశానంలో ఉద్యోగం, జీతమెంతో తెలుసా?