News
News
X

World Sleep Day: నిద్రలో ఎందుకు ఉలిక్కిపడతాం? హిప్నిక్ జర్క్స్ అంటే ఏంటీ?

హిప్నిక్ జర్క్స్...ఇప్పటివరకూ శాస్త్రవేత్తలకు, వైద్యులకు ఇదే రీజన్ అని అంతుబట్టని ఓ శారీరక లక్షణం. మనకే కాదు జంతువులకు కూడా ఉంటుంది ఇది

FOLLOW US: 
Share:

హ్యాపీగా ఓ కునుకేద్దాం అని పడుకుంటాం. మెల్లగా నిద్రలోకి జారుకుంటున్న టైమ్ లో సడెన్ గా ఉలిక్కిపడతాం. ఇలా ఎప్పుడైనా మీకు జరిగిందా. పోనీ నిద్రలోకి జారకుంటున్నప్పుడు ఎప్పుడైనా సడెన్ గా పడిపోతున్నట్లు జర్క్ వచ్చి మెలకువ వచ్చేసిందా. ఎందుకు ఇలా కునికిపాట్లు పడతాం. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటీ. ఈ వీడియోలో చూద్దాం.

హిప్నిక్ జర్క్స్...ఇప్పటివరకూ శాస్త్రవేత్తలకు, వైద్యులకు ఇదే రీజన్ అని అంతుబట్టని ఓ శారీరక లక్షణం. మనకే కాదు జంతువులకు కూడా ఉంటుంది ఇది. ప్రపంచంలో ఉన్న మనుషుల్లో 70శాతం మంది హిప్నిక్ జర్క్స్ ను చాలా కామన్ గా ఎక్స్ పీరియన్స్ చేస్తూ ఉంటారు. మరి దీనికి రీజన్ ఏంటీ. వైద్యులు ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే ఈ జర్స్క్ కి కారణం మాత్రం మన మెదడే. ఎందుకు అంటారా దీనికి మూడు థియరీస్ ఉన్నాయి.

1. పడిపోతున్నావ్ జాగ్రత్త
  
 మనం నిద్రపోతున్నప్పుడు మన బాడీ మొత్తం రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. మజిల్స్ రెస్ట్ లోకి వెళ్లిపోతుండగానే మనం నిద్రలోకి జారుకుంటాం. అయితే మన బ్రెయిన్ దీన్ని రాంగ్ గా అర్థం చేసుకుంటుంది ఒక్కోసారి. మనం పడిపోతున్నామో అని భావించి హిప్నిక్ జర్క్ ను క్రియేట్ చేస్తుందని వైద్యులు భావిస్తారు. ఇంతే కాదు ఇంకో చిత్ర విచిత్రమైనది కూడా చేస్తుంది మన మెదడు. ఒకవేళ మనం పడిపోతున్నామని మనం అర్థం చేసుకోవాలని మనం ఎక్కడో నడుస్తున్నట్లు అక్కడ జారిపడిపోయినట్లు ఓ కలను కూడా క్రియేట్ చేస్తుందంట మెదడు. సో కలలో పడిపోయాం కాబట్టి..హిప్నిక్ జర్క్ వచ్చి వెంటనే మెలకువ వచ్చి నిద్ర లేచి అలెర్ట్ అవుతాం. ఓ పాడు కల- పీడ కల అనుకుని మంచినీళ్లు తాగి మళ్లీ పడుకుంటాం. సో బ్రెయినే ఏదో ఊహించేసుకుని మనల్ని అలర్ట్ చేస్తుందన్న మాట.

2. పోతావురారేయ్

భయపడకండి. నిజంగానే బ్రెయిన్ ఒక్కోసారి మనం చనిపోతున్నామో అని కంగారుపడిపోయి లోపల లోపల రచ్చ చేసేస్తుంది. ఎందుకంటే మనం సాధారణంగా పడుకునేప్పుడు అన్ని శరీరభాగాలు రెస్ట్ లోకి వెళ్లిపోయినా బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంది కదా..మన మరణానికి ముందు కూడా ప్రొసీజర్ ఇదే. సో శరీరంలో ఏదైనా చిన్న అనారోగ్యం కనుక ఉంటే...దాని వల్ల మనం చనిపోతున్నామో అని భావించి బ్రెయిన్ అన్ని శరీర భాగాలకు ఓ కరెంట్ ను పంపి ఒక్కసారిగా అలెర్ట్ చేస్తుంది. అందుకే నిద్రలేచి వెంటనే ఆయాసపడతాం..గుండె దద దడ కొట్టుకుంటూ ఉంటుంది. చెమటలు పడతాయి. శరీరంలో అన్ని అవయవాలు బీ అలెర్ట్ అన్నట్లు అయిపోతాయి. ఇది కూడా మెదడు చేసే మాయే.

3. DNA అలెర్ట్
చెబితే వినటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ..మనం పూర్వీకులు అందరూ కూడా అడవుల్లో బతికిన వాళ్లే. కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఆదిమానవుల్లా ఏ చెట్ల కొమ్మలపైనో నిద్రపోయి ఉంటారు. మరి గాలి గట్టిగా వస్తే కొమ్మ ఊగుతుంది కదా. అప్పుడు కొమ్మ పైనుంచి జారిపడిపోయే ప్రమాదం ఉంటుంది. మన పూర్వీకుల శరీరాలు పడిపోకుండా అప్రమత్తంగా ఉండటం సడెన్ గా నిద్రలేచి చూసుకోవటం చేసేవారు. చేశారు కూడా. ఈ సో అలెర్ట్ అనేది తరతరాలుగా ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత DNA కాపీగా వస్తూ ఉంది. సో అలెర్టే ఈ రోజు మనం మంచం మీద కంఫర్ట్ గా పడుకున్నా చెట్టుమీదే పడుకుని ఉన్న మన పూర్వీకుల్ని లేపినట్లు మనల్ని నిద్రలేచి ఉలిక్కిపడేలా చేస్తోందని ఓ థియరీ.

ఇవే కాదు అన్ కంఫ్టర్ట్ బుల్ గా పడుకోవటం...నిద్రవేళలు పాడుచేసుకోవటం...పడుకోవటానికి నిషిద్ధమైన ప్రాంతాలు అంటే ఆఫీసులు లేదా మరెక్కడైనా పడుకోవటం ఇవన్నీ కూడా మన బ్రెయిన్ లే బాబాయ్ పడుకుంది చాలు అని అలెర్ట్ చేస్తుందన్న మాట. వెంటనే ఓ కులికిపాటు వచ్చి నిద్ర లేస్తాం. యాంగ్జైటీ, టెన్షన్స్ ఇవి కూడా హిప్నిక్ జర్క్స్ కి కారణం. సో హిప్నిక్ జర్క్ చాలా నార్మల్ అండ్ బ్రెయిన్ మనకు ఇచ్చే అలెర్ట్ మెసేజ్. నథింగ్ టూ వర్రీ. 

Published at : 17 Mar 2023 01:36 PM (IST) Tags: World Sleep Day Hypnic Jerks myoclonic jerks Escitalopram

సంబంధిత కథనాలు

Sangareddy Crime News: భూ వివాదంతో పెద్దనాన్న హత్య - తల, మొండెం వేరు చేసి ఒక్కోచోట పడేసిన తమ్ముడి కొడుకు!

Sangareddy Crime News: భూ వివాదంతో పెద్దనాన్న హత్య - తల, మొండెం వేరు చేసి ఒక్కోచోట పడేసిన తమ్ముడి కొడుకు!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్

Breaking News Live Telugu Updates: హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం

Breaking News Live Telugu Updates: హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం

చికెన్ మంచూరియాపై న్యూయార్క్ టైమ్స్‌ హాట్‌ ట్వీట్- మండిపడుతున్న ఇండియన్‌ నెటిజన్స్ ?

చికెన్ మంచూరియాపై న్యూయార్క్ టైమ్స్‌ హాట్‌ ట్వీట్- మండిపడుతున్న ఇండియన్‌ నెటిజన్స్ ?

Stocks to watch 29 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - అదానీ స్టాక్స్‌తో జాగ్రత్త

Stocks to watch 29 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - అదానీ స్టాక్స్‌తో జాగ్రత్త

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!