Viral Video: స్టేజ్‌పై నడుస్తూ కింద పడిపోయిన బైడెన్, బ్యాగ్ తెచ్చిన తంటా
Viral Video: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ స్టేజ్‌పైనే బ్యాగ్ తగిలి కింద పడిపోయిన వీడియో వైరల్ అవుతోంది.
Joe Biden Viral Video:
బ్యాగ్ తగిలి పడిపోయిన బైడెన్..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్టేజ్‌పై కాలు జారి పడిపోయారు. కొలొరాడోలో ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఈవెంట్‌కి హాజరైన ఆయన..వేదికపైనే కింద పడిపోయారు. అయితే...బైడెన్‌కి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. మిలిటరీ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వాళ్లను ఉద్దేశిస్తూ ప్రసంగం చేశారు బైడెన్. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి స్టేజ్‌పై నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే ఉన్నట్టుండి పడిపోయారు. పక్కనే ఉన్న ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఆయనను పైకి లేపారు. లేచిన వెంటనే బైడెన్ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ ఓ బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్‌ని చూపిస్తూ.."అది తట్టుకుని కిందపడిపోయా" అని చెప్పారు. వైట్‌హౌజ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ఈ ఘటనపై స్పందించారు. ఓ బ్యాగ్ తట్టుకుని బైడెన్ అదుపు తప్పి పడిపోయినట్టు వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ తరవాత జో బైడెన్‌కి మరో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి తిరిగి వచ్చేందుకు హెలికాప్టర్ ఎక్కబోయారు. ఆ ఎగ్జిట్ డోర్ బైడెన్ తలకు గట్టిగా తాకింది. ఆ తరవాత మీడియాతో స్వయంగా బైడెన్ ఈ విషయం చెప్పారు. 2020లో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే బైడెన్ కాలు విరిగింది. కుక్కతో ఆడుకుంటూ ఉండగా అదుపు తప్పి కింద పడిపోయారు. గతంలోనూ చాలా సార్లు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి.
Joe Biden just had a really bad fall at the U.S. Air Force Academy graduation. Falling like this at his age is very serious. Democrats want us to trust him to be the President until Jan, 2029. If we’re being real we all know that’s insane. He’s in no condition to run. pic.twitter.com/wacE0bojb9
— Robby Starbuck (@robbystarbuck) June 1, 2023
గతేడాది నవంబర్‌లో G-20 సదస్సులో భాగంగా ఇండోనేషియాలోని బాలికి వెళ్లగా...అక్కడ బైడెన్ నడుస్తూ తడబడ్డారు. ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది. మాంగ్రోవ్ అడవిలోని ఓ ఆలయానికి దేశాధినేతలు వెళ్లారు. ఆ సమయంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా వెళ్లారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆయనకు స్వాగతం పలికారు. దగ్గరుండి మరీ ఆలయంలోకి ఆహ్వానించారు. అక్కడే మెట్లున్నాయి. ఆ మెట్లు ఎక్కే క్రమంలోనే బైడెన్ ఒక్కసారిగా తడబడ్డారు. బైడెన్ కిందకు ఒరిగిపోతుండగా...ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో ఆయనను పట్టుకున్నారు. ఆ తరవాత లోపలకు వెళ్లి ఇతర దేశాధినేతల్ని పలకరించారు.
#WATCH | US President Joe Biden stumbles at the stairs as Indonesian President Joko Widodo holds him during their visit to a Mangrove forest in Bali at #G20Summit2022 pic.twitter.com/5graKRK82K
— ANI (@ANI) November 16, 2022
Also Read: Wrestlers Protest: బ్రిజ్ భూషణ్‌పై నమోదైన FIRలలో సంచలన విషయాలు, ఎక్కడ పడితే అక్కడ తాకినట్టు ఆరోపణలు