Wrestlers Protest: బ్రిజ్ భూషణ్‌పై నమోదైన FIRలలో సంచలన విషయాలు, ఎక్కడ పడితే అక్కడ తాకినట్టు ఆరోపణలు
Wrestlers Protest: బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు FIRలు నమోదు చేశారు.
Wrestlers Protest:
10 కేసులు పెట్టిన పోలీసులు..
బీజేపీ ఎంపీ, WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ని అరెస్ట్ చేయాలని రెజ్లర్లు చాలా రోజులుగా ఉద్యమిస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కేసులు నమోదు చేసి వదిలేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆందోళనలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాజకీయంగానూ ఇవి వేడిని పెంచాయి. ఇటీవలే రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో పారేసేందుకు వెళ్లడం, రైతు సంఘం నేత నరేష్ టికాయత్ వచ్చి అడ్డుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్రం మాత్రం దీనిపై స్పందించడం లేదు. అటు ఢిల్లీ పోలీసులు మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రిజ్ భూషణ్‌పై రెండు FIRలు నమోదు చేశారు. రెజ్లర్ల స్టేట్‌మెంట్స్ ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఈ FIRలతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
"WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నట్టు ఆరోపణలున్నాయి. శ్వాస సరిగ్గా ఉందో లేదో అని తెలుసుకునేందుకు అసభ్యంగా తాకారు. ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేశారు. టోర్నమెంట్‌లలో గాయాలైతే వాటికి అయ్యే వైద్య ఖర్చులు తానే భరిస్తానని చెప్పిన బ్రిజ్ భూషణ్..ఇలా చేయాలంటే తనతో సెక్స్ చేయాలని కండీషన్ పెట్టారు. మైనర్ రెజ్లర్‌ని కూడా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నారు"
- FIRలలో ఉన్న వివరాలు
7గురి రెజ్లర్ల స్టేట్‌మెంట్‌లు..
మొత్తం 7గురు రెజ్లర్ల స్టేట్‌మెంట్‌లు తీసుకున్న తరవాత ఈ FIRలు నమోదు చేశారు పోలీసులు. లైంగిక వేధింపులు, భౌతిక దాడులు, అసభ్యంగా తాకడం లాంటి కేసులన్నీ ఆయనపై పెట్టారు. ఇప్పటి వరకూ దాదాపు 10 కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదు చేయడంతో పాటు WFI చీఫ్ పదవి నుంచి ఆయనను తొలగించాలనీ డిమాండ్ చేస్తున్నారు రెజ్లర్లు. దీనిపైనే వివాదం ముదురుతోంది. రాజీనామా చేసేందుకు ఏ మాత్రం అంగీకరించడం లేదు బ్రిజ్ భూషణ్. అటు పోలీసులపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేసులు నమోదు చేసి...ఆయనను అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారన్న ప్రశ్నిస్తున్నారు రెజ్లర్లు. దీనికి పోలీసులు వివరణ ఇస్తున్నారు. లైంగిక ఆరోపణలు చేసినట్టు ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదని, అందుకే అరెస్ట్ చేయలేదని తేల్చి చెబుతున్నారు. మరో 15 రోజుల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి కోర్టుకి ఓ నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు.అయితే..బ్రిజ్ భూషణ్ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు. వాటిలో ఏది నిజమని తేలినా ఉరేసుకుని చనిపోతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
"ఆరోపణలు నిజం అని తేలితే నేనే ఉరి వేసుకుని చనిపోతాను. ఆధారాలుంటే కోర్టులో సమర్పించండి. దాదాపు నాలుగు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. నన్ను ఉరి తీయలేదని వాళ్లు పతకాలను గంగలో పారేయాలని చూశారు. మీరు మెడల్స్‌ని పారేసినంత మాత్రాన కోర్టు నన్ను ఉరి తీయదు. ఇదంతా కేవలం ఓ ఎమోషనల్ డ్రామా"
- బ్రిజ్ భూషణ్ సింగ్, WFI చీఫ్
Also Read: Telangana Formation Day: తెలంగాణ సంస్కృతి అద్భుతం, రాష్ట్ర పౌరులందరూ బాగుండాలి - ప్రధాని మోదీ విషెస్