News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Telangana Formation Day: తెలంగాణ సంస్కృతి అద్భుతం, రాష్ట్ర పౌరులందరూ బాగుండాలి - ప్రధాని మోదీ విషెస్

Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.

FOLLOW US: 
Share:

Telangana Formation Day: 

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ 9 ఏళ్లు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ అంతటా భారీ ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ కూడా వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజల నైపుణ్యాన్ని, సంస్కృతిని ప్రశంసించారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ ట్వీట్‌లు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు. 

"తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడి ప్రజల నైపుణ్యాలు, సంస్కృతి ఎంతో గొప్పవి. తెలంగాణ పౌరులంతా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను"

- ప్రధాని నరేంద్ర మోదీ

మోదీతోపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. 

"తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నాను. ఈ రాష్ట్రం ఎన్నో సంస్కృతులకు, ప్రతిభావంతులకు నిలయం. ఇక్కడి అడవులు ప్రత్యేకమైనవి. క్రమంగా ఈ రాష్ట్రం ఇన్నోవేషన్ హబ్‌గా మారుతుండటం చాలా సంతోషకరం. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను"

- ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి 

ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ మరింత వెలిగిపోవాలని ఆకాంక్షించారు. 

"తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు ఈ ప్రాంతం. ఏళ్లు గడిచే కొద్ది తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా రాణిస్తున్నారు. భారత దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. త్వరలోనే ఈ రాష్ట్రం కొత్త శిఖరాలు అందుకోవాలని కోరుకుంటున్నా"

- జగ్‌దీప్ ధన్‌కర్, ఉపరాష్ట్రపతి 

Published at : 02 Jun 2023 11:01 AM (IST) Tags: PM Modi Telangana Formation Day President Murmu Telangana formation PM Modi Greetings

ఇవి కూడా చూడండి

Yuva Galam Padayatra: యువగళం పాదయాత్ర వాయిదా, టీడీపీ కీలక నిర్ణయం - కొత్త తేదీ త్వరలోనే

Yuva Galam Padayatra: యువగళం పాదయాత్ర వాయిదా, టీడీపీ కీలక నిర్ణయం - కొత్త తేదీ త్వరలోనే

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

భారత్‌కి తొలి ప్రధాని నెహ్రూ కాదు సుభాష్ చంద్రబోస్ - బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

భారత్‌కి తొలి ప్రధాని నెహ్రూ కాదు సుభాష్ చంద్రబోస్ - బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కొత్త కూటమికి సిద్ధమవుతున్న AIDMK,ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చాక కీలక నిర్ణయం

కొత్త కూటమికి సిద్ధమవుతున్న AIDMK,ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చాక కీలక నిర్ణయం

ABP Desam Top 10, 28 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 28 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?

ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?

Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!

Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!

రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్‌ లడ్డు- 27 లక్షలకు దక్కించుకున్న దయానంద్‌ రెడ్డి

రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్‌ లడ్డు- 27 లక్షలకు దక్కించుకున్న దయానంద్‌ రెడ్డి

Motorola Edge 40 Neo: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? - అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే - సేల్ ప్రారంభం నేడే!

Motorola Edge 40 Neo: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? - అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే - సేల్ ప్రారంభం నేడే!