Viral Video: రొమాంటిక్ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన టీచర్, స్టూడెంట్ - క్లాస్‌రూమ్‌లోనే స్టెప్పులు
Viral Video: ఓ లేడీ టీచర్ స్టూడెంట్ కలిసి బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్‌కి క్లాస్‌రూమ్‌లోనే స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది.
Teacher Dancing With Student: ఓ టీచర్, స్టూడెంట్ కలిసి క్లాస్‌రూమ్‌లోనే డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ రొమాంటిక్ సాంగ్‌కి ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. బాలీవుడ్‌లో చాలా పాపులర్ అయిన Tum Hi Ho పాటకు వీళ్లిద్దరూ డ్యాన్స్ చేస్తుంటూ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ ఈలలు వేస్తూ, క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేశారు. ఫేర్‌వెల్ ఫంక్షన్‌లో ఇలా వీడియో షూట్ చేశారు. ఇన్‌స్టాలో ఈ వీడియోకి ఇప్పటికే 14 మిలియన్‌ల వ్యూస్ దాటిపోయాయి. లక్షల కొద్ది లైక్‌లు వచ్చాయి.
View this post on Instagram
ఇక ఈ వీడియోపై నెటిజన్‌లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. టీచర్ అయ్యుండి ఇలాంటి డ్యాన్స్‌లు ఏంటి అని కొందరు మండి పడుతున్నారు. ఇంకొదరైతే అప్‌లోడ్ చేసిన వాళ్లనూ తిట్టి పోశారు. ఇలాంటి వీడియోలు షేర్ చేయడం అవసరమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు నెటిజన్‌లు మాత్రం టీచర్‌ని సపోర్ట్ చేశారు. "నేను కూడా ఫేర్‌వెల్ ఫంక్షన్‌లో టీచర్‌తో కలిసి డ్యాన్స్ చేశాను. ఇందులో తప్పేముంది" అని ప్రశ్నించాడో యూజర్. స్టూడెంట్ చాలా లక్కీ అని ఇంకొందరు కామెంట్ చేశారు.
Also Read: Viral Video: కదులుతున్న ట్రక్‌లోని సరుకులు చోరీ, ధూమ్ రేంజ్ స్టంట్‌లు చేసిన దొంగలు - వైరల్ వీడియో