అన్వేషించండి

Viral Video: కదులుతున్న ట్రక్‌లోని సరుకులు చోరీ, ధూమ్‌ రేంజ్‌ స్టంట్‌లు చేసిన దొంగలు - వైరల్ వీడియో

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ముగ్గురు దొంగలు ఓ హైవేపై కదులుతున్న ట్రక్‌ నుంచి సరుకుల్ని చోరీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Thieves Steals Goods from Moving Truck: సినిమాల్లో యాక్షన్‌ సీన్స్ వస్తుంటే..."అయ్య బాబోయ్ ఇలాంటివి ఎలా తీస్తారో ఏమో" అని నోరెళ్లబెట్టేస్తాం. అచ్చం అలాంటివే మన కళ్ల ముందే నిజంగా జరిగితే ఇక మర్చిపోతామా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని కూడా అలాగే గుర్తు పెట్టేసుకుంటాం. ఆ రేంజ్‌లో ఉంది ఈ స్టంట్. పైగా ఇదేదో సీన్ కాదు. నిజంగా జరిగింది. వేగంగా వెళ్తున్న ట్రక్‌ని బైక్‌పై వెంబడించి ఆ ట్రక్‌పైకి ఎక్కి గూడ్స్‌ని దొంగిలించాడో వ్యక్తి. వెనక వస్తున్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది. క్షణాల్లో వైరల్ అయిపోయింది. అసలు అంత గుండెధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. హైలైట్ ఏంటంటే...అంత స్పీడ్‌గా వెళ్తున్న ట్రక్‌ నుంచి చాలా ఒడుపుగా దిగి బైక్‌పై కూర్చున్నాడు. ఈ స్టంట్‌ చూసే అంతా ఆశ్చర్యపోతున్నారు. తన వెనక ఇంత సీన్‌ జరుగుతోందని ఆ ట్రక్‌ డ్రైవర్‌కి మాత్రం తెలియదు. ఆగ్రా-ముంబయి హైవేలో ఈ స్టంట్‌లు చేశారు దొంగలు. 

ఎలా చోరీ చేశారంటే..?

ఓ ట్రక్‌పై ఇద్దరు దొంగలున్నారు. ట్రక్‌లో ఉన్న గూడ్స్‌ని కిందకు పడేశారు. వెనకాలే ఓ బైక్‌పై మరో దొంద వెంబడించాడు. సరుకుని కింద పడేయగానే బైక్‌ స్పీడ్ పెంచాడు. ట్రక్‌కి దగ్గరగా పోనిచ్చాడు. చాలా చాకచక్యంగా ఓ దొంగ ట్రక్‌ నుంచి కిందకు దిగుతూ వచ్చాడు. సరిగ్గా బైక్‌పైనే కూర్చున్నాడు. బైక్‌ నడుపుతున్న వ్యక్తి దిగిన వ్యక్తికి సాయం చేశాడు. ఆ తరవాత మరో దొంగ కూడా ఇదే విధంగా ఒడుపుగా కిందకు దిగాడు. సరిగ్గా బైక్‌పై కూర్చునేందుకు మిగతా ఇద్దరు వ్యక్తులు సాయం చేశారు. ముగ్గురూ బైక్‌పై కూర్చోగానే వెంటనే దారి మళ్లించారు. ఈ ఘటనపై తమకు పూర్తి వివరాలు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ చోరీ తరవాత హైవేలపై సెక్యూరిటీ గురించి చర్చ జరుగుతోంది. అంత సులువుగా దొంగతనం చేసుకుని పోతే పోలీసులు పట్టించుకోవడం లేదని కొందరు నెటిజన్‌లు మండిపడుతున్నారు. ఈ వాదనల సంగతి పక్కన పెడితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Team India at Hanuman Temple Video: గంభీర్, జై షా లతో కలిసి వరల్డ్ కప్ ట్రోఫీతో హనుమాన్ టెంపుల్‌కు వెళ్లి టీమిండియా పూజలు
గంభీర్, జై షా లతో కలిసి వరల్డ్ కప్ ట్రోఫీతో హనుమాన్ టెంపుల్‌కు వెళ్లి టీమిండియా పూజలు
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
Trisha Krishnan : అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Embed widget