CJI Ramana on Media: ఆ వార్తలు మీడియాలో రావడం దురదృష్టకరం: సీజేఐ
మీడియాపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారిక ప్రకటనకు ముందే కొలీజియం సిఫార్సులపై వార్తలు రావడం దురదృష్టకరమన్నారు.
![CJI Ramana on Media: ఆ వార్తలు మీడియాలో రావడం దురదృష్టకరం: సీజేఐ 'Very Unfortunate': CJI Ramana On Speculations In Media Over SC Judges' Appointment CJI Ramana on Media: ఆ వార్తలు మీడియాలో రావడం దురదృష్టకరం: సీజేఐ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/24/b632c34b0872fe93279acd54a261e5fc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అధికారిక ప్రకటనకు ముందే కొలీజియం సిఫారుసలపై మీడియాలో వార్తలు రావడం దురదృష్టకరమన్నారు భారత్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఇలా రావడం వల్ల చాలా సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వార్తలు రాసేటప్పుడు మీడియా చాలా బాధ్యతాయుతంగా మసులుకోవాలని సూచించారు. మీడియా హక్కులు, స్వేచ్ఛను తాము గౌరవిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు మీటింగ్‌లో జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.
CBI Caged Parrot : సీబీఐని రాజకీయ పంజరం నుంచి వదిలి పెట్టాలన్న మద్రాస్ హైకోర్ట్..!
న్యాయమూర్తుల నియామక ప్రక్రియ చాలా పవిత్రమైనదని.. దీనికి సముచిత గౌరవం ఉందన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీడియా వార్తలు రాస్తే బాగుంటుందని సూచించారు. బాధ్యతారహితమైన రిపోర్టింగ్, ఊహాగానాల వల్ల మెరిట్ అభ్యర్థుల కెరీర్ ప్రమాదంలో పడుతుందన్నారు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
ALSO READ:
Two Rupees Coin: మీ దగ్గర 2 రూపాయల కాయిన్ ఉందా? అయితే ఈ 5 లక్షల రూపాయలు ఈజీగా సంపాదించొచ్చు
ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే ఇలాంటి వార్తలు రావడం చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ఇలాంటి విషయాల్లో ఊహాగానాల జోలికి వెళ్లని మెజారిటీ సీనియర్ జర్నలిస్టులు, మీడియా హౌస్‌లను జస్టిస్ రమణ ప్రశంసించారు.
నూతన న్యాయమూర్తుల నియామక ప్రక్రియ జరుగుతోందని, సమావేశాలు జరుగుతాయని, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు సీజేఐ. మీడియా స్వేచ్ఛను, వ్యక్తుల హక్కులను సుప్రీంకోర్టు ఎంతో గౌరవిస్తుందని, ఈ వ్యవస్థ సమగ్రత, హుందాతనాలను అందరూ కాపాడాలని కోరుకుంటున్నానని తెలిపారాయన.
ALSO READ:
Highcourt On G.Os : జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)