![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Gay Marriage Law: సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్లుపై బైడెన్ సంతకం- ఇక ఆ పెళ్లిళ్లకు లైన్ క్లియర్
Gay Marriage Law: సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు.
![Gay Marriage Law: సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్లుపై బైడెన్ సంతకం- ఇక ఆ పెళ్లిళ్లకు లైన్ క్లియర్ US President Joe Biden Signs Gay Marriage Law, A Blow Against Hate Gay Marriage Law: సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్లుపై బైడెన్ సంతకం- ఇక ఆ పెళ్లిళ్లకు లైన్ క్లియర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/55d9ebe71e9b47fd30537abd9076296f1669778840623555_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gay Marriage Law: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం కీలక బిల్లుకు ఆమోదముద్ర వేశారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించే బిల్లు (సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్)పై ఆయన సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఇప్పటికే అమెరికా సెనేట్‌లో, ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది.
If there is one message that breaks through from today, it's that this law – and the love it defends – strikes a blow against hate in all its forms.
— President Biden (@POTUS) December 13, 2022
Celebrate with us as I sign the historic Respect for Marriage Act into law. pic.twitter.com/0NFNNCtVVK
As Mildred Loving said: previous generations were “bitterly divided over something that should have been so clear and right.”
— President Biden (@POTUS) December 14, 2022
Today, with the signing of the Respect for Marriage Act, we celebrate our progress.
There are few things as clear and right as marriage equality. pic.twitter.com/lz9WtQqSsi
అంతకుముందు
స్వలింగ సంపర్కుల వివాహాలకు వ్యతిరేకంగా ముందుగా సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్న ఆందోళనతో.. అమెరికన్ సెనేట్ ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. అధికార డెమోక్రాట్ పార్టీతోపాటు కొందరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో బిల్లు సెనేట్‌లో సులువుగా పాసైంది.
కాంగ్రెస్ ఆమోదం
సెనేట్‌లో ఆమోదం పొందిన స్వలింగ సంపర్కుల వివాహ రక్షణ బిల్లు ఆ తర్వాత ప్రతినిధుల సభకు చేరింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు 258-169తో మెజారిటీ దక్కింది. డెమొక్రాట్లు మొత్తం సభ్యులు, రిపబ్లికన్లలో 39 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. 169 మంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. దీంతో అక్కడ కూడా ఈ చట్టానికి ఆమోదముద్ర పడింది.
ప్రతినిధుల సభ ఆమోదం తర్వాత బిల్లును సంతకం కోసం అధ్యక్షుడు బైడెన్ దగ్గరికి పంపించారు. తాజాగా ఆయన సంతకం కూడా పూర్తవడంతో సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ యాక్ట్ కార్యరూపంలోకి వచ్చినట్లయ్యింది.
Also Read: US On India-China Clash: 'భారత్‌కే మా సపోర్ట్'- సరిహద్దు ఘర్షణపై అమెరికా రియాక్షన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)