కెనడాలో ఘోర విమాన ప్రమాదం, ఇద్దరు భారతీయ పైలట్‌లు మృతి
Indian Pilots Killed: కెనడాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్‌లు మృతి చెందారు.
![కెనడాలో ఘోర విమాన ప్రమాదం, ఇద్దరు భారతీయ పైలట్‌లు మృతి Two Indian trainee pilots killed as plane crashes in Canada's British Columbia కెనడాలో ఘోర విమాన ప్రమాదం, ఇద్దరు భారతీయ పైలట్‌లు మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/07/21cca17599199d7cc714091b994030fd1696662741296517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Indian Pilots Killed:
కుప్ప కూలిన విమానం..
కెనడాలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓ విమానం కుప్ప కూలి ఇద్దరు ట్రైనీ పైలట్‌లు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లిద్దరూ భారతీయులే. ముంబయికి చెందిన యశ్ విజయ్ రాముగడే, అభయ్ గద్రూ కెనడాలో పైలట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్లేన్ క్రాష్ అయింది. లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ Piper PA-34 Seneca ఒక్కసారిగా అదుపు తప్పి పొదల్లో కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ట్రైనీ పైలట్‌లతో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయినట్టు కెనడా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో స్థానికులెవరూ గాయపడలేదని తెలిపారు. అయితే...ఈ ప్రమాదానికి కారణమేంటో ఇంకా తెలియలేదు. Transportation Safety Board of Canada అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. ఘటనా స్థలానికి 5 ఆంబులెన్స్‌లు చేరుకున్నాయి. పారామెడికల్ సిబ్బంది కూడా అందుబాటులోకి వచ్చింది. The Piper PA-34 ఫ్లైట్‌ని 1972లో తయారు చేశారు. 2019లో రిజిస్టర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
3 killed in Canada plane crash
— ANI Digital (@ani_digital) October 7, 2023
Read @ANI Story | https://t.co/pdMmVc1zpq #Canada #planecrash #Chilliwack pic.twitter.com/InV1j6MlYV
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)