Top Headlines Today: చంద్రబాబు హెలీప్యాడ్ వద్ద 'బాంబు' బజర్ అలర్ట్- నల్గొండలో కేసీఆర్ సభకు బీఆర్ఎస్ ప్లాన్
AP Telangana Latest News 05 February 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News Today: 'జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం' - విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కితాబు
ఏపీ అసెంబ్లీ (AP Assembly) బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. శాసనమండలి, శాసనసభను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) ప్రసంగించారు. జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పని చేస్తోందని అన్నారు. 'బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సంక్షేమ పథకాల అమలుతో అన్ని వర్గాలు లబ్ధి పొందాయి. పేదరిక 11.25 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గిందని’ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
చంద్రబాబు హెలీప్యాడ్ వద్ద 'బాంబు' బజర్ - అప్రమత్తమైన సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
ఏలూరు జిల్లా చింతలపూడిలో (Chintalapudi) టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) హాజరు కావాల్సిన 'రా.. కదలిరా' సభాస్థలి వద్ద గందరగోళం నెలకొంది. అక్కడ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టగా.. సమీపంలోని హెలీ ప్యాడ్ వద్ద కూడా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో సిగ్నల్ బజర్ మోగడంతో ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా అక్కడ తవ్వకాలు చేపట్టారు. ఈ సమయంలో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే, తవ్వకాల్లో ఐరన్ రాడ్ బయటపడడంతో అధికారులు, టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
2 లక్షల మందితో నల్గొండలో సభకు బీఆర్ఎస్ ప్లాన్, నీటి వాటాలపై కౌంటర్ ఇవ్వనున్న కేసీఆర్
గులాబీ దళపతి కేసీఆర్ రీ ఎంట్రీకి పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అనారోగ్యం కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు కేసీఆర్. అధికారాన్ని కోల్పోయిన తర్వాత...ఆయన ఎంట్రీ అదిరిపోయే రేంజ్‌లో ఉండేలా కారు పార్టీ నేతలు ప్రణాళికలు చేస్తున్నారు. జీఆర్ఎంబీ (GRMB), కేఆర్ఎంబీ(KRMB) నిర్వహణ, నీటి వాటాలపై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా బీఆర్ఎస్ బహిరంగ సభకు రెడీ అవుతోంది. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో భారీ సభ నిర్వహించనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టీఎస్‌పీఎస్సీ కొత్త కార్యదర్శిగా నవీన్ నికోలస్ నియామకం, 9 మంది అధికారుల బదిలీలు
తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను, ఒక ఐఎఫ్‌ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 5న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను బదిలీ చేసి, ఆ స్థానంలో ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి నవీన్ నికోలస్‌ను నియమించింది. నికోలస్ గతంలో గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడిగా పని చేసినప్పుడు గురుకుల నియామక బోర్డు కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
లోకేష్, చంద్రబాబును తిడితేనే టిక్కెట్ ఇస్తామన్నారు - మైలవరం వైసీపీ ఎమ్మెల్యే
మైలవరం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ .. వైసీపీ హైకమాండ్ తీరుపై తీవ్ర విమర్శలు చేసారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను లోకేష్ , చంద్రబాబుని తిట్టవు నిన్నెలా నమ్మాలని జగన్ అన్నారని విమర్శించారు. తిట్టనివాళ్లకి ఎమ్మెల్యే , పార్లమెంటు సీట్లు ఇవ్వనని చెప్పారన్నారు. మనసు గాయపడినప్పుడు నిలువెత్తు బంగారం ఇస్తామన్నా ఉండలేమని.. వైసీపీకి రాజీనామా చేస్తున్న అంశంపై పరోక్షంగా స్పందించారు. పెద్దిరెడ్డి కాల్ చేసి తొందరపడ్డదన్నారని.. రాజకీయాలకి స్వస్తిపలికి వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నానన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి