అన్వేషించండి

BRS News: 2 లక్షల మందితో నల్గొండలో సభకు బీఆర్ఎస్ ప్లాన్, నీటి వాటాలపై కౌంటర్ ఇవ్వనున్న కేసీఆర్

BRS News: గులాబీ దళపతి కేసీఆర్ రీ ఎంట్రీకి పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అనారోగ్యం కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు కేసీఆర్.

BRS Public Meeting : గులాబీ దళపతి కేసీఆర్ (KCR) రీ ఎంట్రీకి పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అనారోగ్యం కోలుకున్న తర్వాత ఎమ్మెల్యే (MLA)గా ప్రమాణస్వీకారం చేశారు కేసీఆర్. అధికారాన్ని కోల్పోయిన తర్వాత...ఆయన ఎంట్రీ అదిరిపోయే రేంజ్‌లో ఉండేలా కారు పార్టీ నేతలు ప్రణాళికలు చేస్తున్నారు. జీఆర్ఎంబీ (GRMB), కేఆర్ఎంబీ(KRMB) నిర్వహణ, నీటి వాటాలపై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా బీఆర్ఎస్ బహిరంగ సభకు రెడీ అవుతోంది. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో భారీ సభ నిర్వహించనుంది. కేసీఆర్ పాల్గొనే సభకు...2లక్షల మంది జనాలు హాజరయ్యేలా వ్యూహాలు తయారు చేస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లా నుంచే  జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ ఇష్యూ పై పోరాటానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భారీ సభపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. పూర్తి స్థాయిలో జనం మధ్యకు రాలేదు. తుంటి ఎముక ఆపరేషన్ అనంతరం కోలుకున్న ఆయన త్వరలో గ్రాండ్ రీఎంట్రీ ఇస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఫిబ్రవరి-17న ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ కు వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పటి నుంచి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉంటారని నేతలు అంటున్నారు. తెలంగాణ భవన్‌ లో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు గెలుపే లక్ష్యంగా.. తొలుత నల్గొండలో భారీ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నల్గొండ, భువనగిరి గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. నల్గొండ నుంచే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది. జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో నిరసన సభ ఏర్పాట్లపై కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం, ఆత్మస్థైర్యం నింపేలా...బీఆర్ఎస్ అగ్రనేతలు వరుస కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. లోక్ సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన కేటీఆర్.. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. 

రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా, గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ ఒప్పుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అబద్ధపు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన...ఈ పుస్తకానికి, ఈ చట్టానికి మీరే రచయిత అని గుర్తు చేశారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి పునాది పడిందే కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడేనని... టీఆరెఎస్ అభ్యంతరం చెప్పకుండా....కేసీఆర్ ఓటు వేసి చట్టాన్ని ఆమోదింపజేశారని వెల్లడించారు. దీనికి బాధ్యులు కేసీఆర్, కె. కేశవరావు అన్న రేవంత్ రెడ్డి...ఈ చట్టం కావడానికి మొట్టమొదటి కారణం కేసీఆరేనని విమర్శించారు. 811 టీఎంసీల నీళ్లపై పంపకాలు ఎలా జరగాలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించారని...2015 జూన్ 18న KRMB సమావేశం నిర్వహించిందని,  299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు కేటాయించేందుకు కేసీఆర్, హరీష్ సంతకాలు పెట్టారని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్, హరీష్ రావు... చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణకు 50 శాతం వాటా అడగకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget