![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chandrababu Helipad: చంద్రబాబు హెలీప్యాడ్ వద్ద 'బాంబు' బజర్ - బాంబ్ స్క్వాడ్ తనిఖీలు, చివరకు!
Chintalapudi Meeting: ఏలూరు జిల్లా చింతలపూడిలో చంద్రబాబు హెలీ ప్యాడ్ వద్ద బాంబ్ సిగ్నల్ బజర్ మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ తవ్వకాలు చేపట్టారు.
![Chandrababu Helipad: చంద్రబాబు హెలీప్యాడ్ వద్ద 'బాంబు' బజర్ - బాంబ్ స్క్వాడ్ తనిఖీలు, చివరకు! bomb squad checking in chintalapudi helipad Chandrababu Helipad: చంద్రబాబు హెలీప్యాడ్ వద్ద 'బాంబు' బజర్ - బాంబ్ స్క్వాడ్ తనిఖీలు, చివరకు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/05/1ac22ae92ffe6360cf2fea4a6222ef6a1707130399902876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bomb Squad Checkings in Chintalapudi Helipad: ఏలూరు జిల్లా చింతలపూడిలో (Chintalapudi) టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) హాజరు కావాల్సిన 'రా.. కదలిరా' సభాస్థలి వద్ద గందరగోళం నెలకొంది. అక్కడ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టగా.. సమీపంలోని హెలీ ప్యాడ్ వద్ద కూడా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో సిగ్నల్ బజర్ మోగడంతో ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా అక్కడ తవ్వకాలు చేపట్టారు. ఈ సమయంలో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే, తవ్వకాల్లో ఇనుప ముక్క బయటపడడంతో అధికారులు, టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇతర వస్తువులు ఏవీ లభించలేదని బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తెలిపారు. కాగా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని చింతలపూడి పోలీసులు సూచించారు. కాగా, అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో సభ ముగించుకుని చంద్రబాబు చింతలపూడికి రావాల్సి ఉంది. అయితే, చింతలపూడి సభ వద్ద హెలీప్యాడ్ పై తవ్వకాలు జరపడంతో చంద్రబాబు హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు తొలుత అధికారులు అనుమతి నిరాకరించారు. కాగా, అనకాపల్లి సభ ముగించుకుని వచ్చే సమయానికి హెలీప్యాడ్ సిద్ధం చేస్తామని తెలిపారు.
Also Read: Janesna Candidate List: జనసేనకు కేటాయించిన సీట్లు ఇవేనా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)