అన్వేషించండి

Top 5 Headlines Today: ఉపా కేసులు కేసులు ఎత్తేసేందుకు కేసీఆర్‌ అంగీకారం, 28 న అమ్మఒడి డబ్బులు వేయనున్న ఏపీ సర్కారు

Top 5 Telugu Headlines Today 17 June 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

కేసులు ఎత్తేస్తూ నిర్ణయం

ప్రొఫెసర్‌ హరగోపాల్ సహా ఇతరులపై పెట్టిన UAPA కేసులు ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌కు ఆదేశాలు ఇచ్చారు. పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు తెలంగాణలో సంచలనంగా మారింది. ఉపా చట్టం (Unlawful Activities (Prevention) Act) 2022 కింద గత ఏడాది ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. ఇదే కాక ఆయుధాల చట్టం, సెక్షన్ 10 కింద కేసులు నమోదు అయ్యాయి. హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు. పూర్తి వివరాలు 

 

ఐటీ సోదాలపై కామెంట్

ఇంట్లో గంటన్నరలో సోదాలు ముగిసినా మూడు రోజుల పాటు కావాలనే సాగదీశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి విమర్శించారు.  అధికారులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారని ఆరోపించారు. తన నివాసానికి వచ్చిన గంటన్నరలోపే అధికారులకు అన్ని వివరాలు అందజేశామని, అయినా మూడు రోజుల పాటు హంగామా చేశారని విమర్శించారు. కాగా, ఎమ్మెల్యే పైళ్ల నివాసంలో మూడు రోజుల పాటు కొనసాగిన ఐటీ దాడులు శనివారం ఉదయం ముగిశాయి.  విచారణకు రమ్మంటూ పైళ్ల శేఖర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ఎప్పుడు రావాలో చెప్పలేని.. ఎ్మెల్యే చెబుతున్నారు.    పూర్తి వివరాలు 

 

28న అమ్మఒడి డబ్బులు 

ఏపీలో 'జగనన్న అమ్మఒడి' పథకం నిధులను జూన్ 28న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23వ సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. కుటుంబ ఆదాయం పట్టణాల్లో నెలకు రూ.12,000; గ్రామాల్లో రూ.10,000 లోపు ఉండాలి. అమ్మఒడి కింద ఇచ్చే రూ.15,000 నుంచి పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం రూ.2,000 మినహాయించి, మిగతా రూ.13వేలు మాత్రమే తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. పూర్తి వివరాలు

 

వీసీ కక్కుర్తి 

తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ రవీందర్ గుప్తా ఏసీబీ ఉచ్చులో పడ్డారు. శనివారం రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గత కొంతకాలంగా తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించాయి. ఆరోపణలకు తగ్గట్లే అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పరీక్షా కేంద్రం ఏర్పాటు కేసం ఓ వ్యక్తి నుంచి వీసీ రవీందర్ గుప్తా డబ్బులు డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు

 

జూమ్ మీటింగ్ 

తెలంగాణ రాజకీయాల్లో అతి త్వరలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా హస్తం పార్టీలోకి రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈనెల 22వ తేదీన వీళ్లంతా కాంగ్రెస కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఆయన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్ లో మాట్లాడినట్లు సమాచారం. రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్ లోనే పొంగులేటి చేరిక తేదీ ఫిక్స్ అయింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారట. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈనెల 21వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు. అదే తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక జూపల్లి, పొంగులేటి చేరిక తర్వాత ఖమ్మం, పాలమూరుల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉంది. పూర్తి వివరాలు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget