అన్వేషించండి

ప్రొఫెసర్‌ హరగోపాల్ సహా ఇతరులకు ఊరట- ఉపా కేసులు ఎత్తివేయాలని సీఎం ఆదేశం

పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు తెలంగాణలో సంచలనంగా మారింది. దీన్ని ఎత్తివేయాలంటూ సీఎం ఆదేశించారు.

ప్రొఫెసర్‌ హరగోపాల్ సహా ఇతరులపై పెట్టిన UAPA కేసులు ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌కు ఆదేశాలు ఇచ్చారు. 

పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు తెలంగాణలో సంచలనంగా మారింది. ఉపా చట్టం (Unlawful Activities (Prevention) Act) 2022 కింద గత ఏడాది ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. ఇదే కాక ఆయుధాల చట్టం, సెక్షన్ 10 కింద కేసులు నమోదు అయ్యాయి. హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు.

ఎలా బయటపడిందంటే..

పీపుల్స్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండు నెలల కింద పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అతడిపై మరిన్ని కేసులు ఉన్నాయని, బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోలీసులు తెలియజేశారు. మొత్తం అన్ని కేసుల వివరాలూ అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్‌ను కోర్టు ముందు పెట్టారు. దీంతో ఈ విషయం బయటపడింది.

అభియోగాలు ఇవీ

ప్రొఫెసర్ హరగోపాల్ మావోయిస్టులకు సహయసహకారాలు అందిస్తున్నారని, బీరెల్లి కుట్రలో ఆయన భాగం అయ్యారని, పైగా నిషేధిత మావోయిస్టుల పుస్తకాల్లో ఆయన పేరు ఉందనే అభియోగాలు నమోదు అయ్యాయి. ఇంకా మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని కూలదోయడం, పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్‌ చేసుకోవడం వంటి పనులు చేసినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. నిందితులుగా ఉన్న వారిలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్‌ (జస్టిస్‌ సురేశ్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేనాటికే చనిపోయారు) ప్రొఫెసర్‌ పద్మజా షా, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వీ రఘునాథ్‌, చిక్కుడు ప్రభాకర్‌ తదితరుల పేర్లు ఉన్నాయి.

ప్రొఫెసర్‌ స్పందన ఇదీ

రాజద్రోహం, దేశద్రోహం లాంటి కేసులు పెట్టవద్దని సుప్రీం కోర్టు గతంలోనే తీర్పు ఇచ్చిందని, కాబట్టి ప్రభుత్వం పెట్టిన ఈ కేసు నిలబడదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మావోయిస్టులకు తమ మద్దతు ఎందుకు ఉంటుందని, వాళ్లు తమ లాంటి వాళ్ల మీద ఆధారపడరని అన్నారు. అసలు వాళ్ల ఉద్యమం వేరు అని అన్నారు. 152 మందిపైనా ఏదో ఒక కేసు పెట్టడం విషాద పరిణామం అని అన్నారు. బాధ్యతరాహిత్యంగా కేసులు పెడుతున్నారని చెప్పారు. నిజాయితీపరులపైనా.. ఆఖరికి చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టారని వాపోయారు. 

ఇది కాస్త బూమ్‌రాంగ్ అయ్యింది. ఈ  చర్యపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విషయం రాజకీయం అవ్వడంతో ప్రభుత్వం  జోక్యం చేసుకంది. సీఎం స్పందించి కేసులు ఎత్తివేసేందుకు అంగీకరించారు. రివ్యూ చేపట్టిన సీఎం కేసీఆర్‌ ఉపా కేసులు ఎత్తివేతకు నిర్ణయించారు. ఈ కేసులు ఎత్తివేయాలంటూ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ను ఆదేశించారు. దీనిపై కాసేపట్లో అధికారిక సమాచారం వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget