అన్వేషించండి

Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?

Tata Sierra EV India Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టాటా మనదేశంలో కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. అదే టాటా సియర్రా ఈవీ. దీని ధర రూ.25 లక్షల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

Tata Sierra EV Launching: టాటా మోటార్స్ కార్లు ప్రస్తుతం భారతదేశ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అనేక టాటా కార్లు సెక్యూరిటీ రేటింగ్ పరంగా కూడా మంచివిగా కనిపిస్తున్నాయి. టాటా త్వరలో లాంచ్ చేయనున్న కార్ల కోసం ప్రజలు ఎల్లప్పుడూ వేచి ఉండటానికి ఇదే కారణం. దీంతో పాటు టాటా ఇప్పుడు భారతీయ మార్కెట్లో సియెర్రా ఈవీని లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రెండు ఇంజిన్ వెర్షన్‌లను టాటా మార్కెట్‌లో పరిచయం చేయనుంది. వీటిలో ఈవీ, ఐసీఈ వెర్షన్లు కూడా ఉండనున్నాయి.

టాటా సియెర్రా ఈవీ మనదేశంలో ముందుగా లాంచ్ కానుంది. వచ్చే ఏడాది చివరి నాటికి టాటా సియెర్రా ఐసీఈ వెర్షన్ మార్కెట్లోకి రానుంది. సియెర్రా ఈవీ అనేది టాటా మోటార్స్ తీసుకురానున్న ప్రీమియం ఈవీ. దీన్ని బెస్పోక్ ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారంగా రూపొందించారు. టాటా సియెర్రా మొదటగా ఆటో ఎక్స్‌పోలో లాంచ్ అయింది. ఇందులో ఎల్ఈడీ లైట్ బార్‌తో పాటు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కూడా కనిపించాయి. అయితే సియర్రాను సైడ్ విండో డిజైన్‌తో మార్కెట్లో తీసుకువచ్చే అవకాశం ఉంది.

Also Read: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?

టాటా సియెర్రా ఈవీ డిజైన్, ఫీచర్లు ఇలా...
కొత్త సియెర్రా ఐదు డోర్ల  కారుగా బాక్సీ లైన్‌లతో ఉంటుంది. ఇది రాడికల్ లుక్‌తో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. సైజ్ పరంగా సియెర్రా 4.3 మీటర్ల పొడవు ఉండనుంది. అంటే సియెర్రా కర్వ్‌డ్ షేప్‌లో ఉండనుందన్న మాట. దీంతో పాటు ఇది సఫారీ, హారియర్ కంటే చిన్నదిగా ఉంటుంది. ఇది హారియర్ ఈవీ కంటే కింది స్థానంలో, కర్వ్ కంటే పై స్థానంలో ఉండవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే టాటా సియెర్రా వెనుక సీటుతో కూడిన లాంజ్ లాంటి ఇంటీరియర్‌ను కలిగి ఉండటం చూడవచ్చు. సియెర్రా 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అయితే సెంటర్ కన్సోల్ ఇతర టాటా కార్ల కంటే భిన్నంగా ఉందని చెప్పవచ్చు.

టాటా సియెర్రా ఈవీ ధర ఎంత ఉండవచ్చు?
ఇది కాకుండా మీరు టాటా సియెర్రాలో పనోరమిక్ సన్‌రూఫ్, ప్రయాణీకుల సీటుతో కూడిన మినీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, హెడ్స్ అప్ డిస్‌ప్లే, ఏడీఏఎస్, డ్యూయల్ పవర్డ్ ఫ్రంట్ సీట్ వంటి ఇతర ఫీచర్లను పొందుతారు. కూల్డ్ సీటుతో పాటు ఇతర ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. కొత్త తరం సియెర్రా ఈవీ మరింత స్పేస్ అందించనున్నారు. సియెర్రా ఈవీలో 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల రేంజ్‌ని ఇది అందించనుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ ఈవీ ధర దాదాపు రూ.25 లక్షలు ఉండవచ్చు. ప్రస్తుతం టాటా లాంచ్ చేసిన పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ సేల్స్ పరంగా దూసుకుపోతున్నాయి. సియెర్రా కూడా వాటితో త్వరలో చేరే అవకాశం ఉంది.

Also Read: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget