Top Headlines Today: 17న టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల; మార్చి 12 నుంచి రంజాన్ మాసం - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
ఈనెల 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ మరింత తీవ్ర స్థాయికి వెళ్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనతో ముందంజలో ఉన్న టీడీపీ జనసేన ఇప్పుడు మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు. బుధవారం సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా మేనిఫెస్టోపై కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. ఇంకా చదవండి
కరీంనగర్ ప్రజలకు శుభవార్త
కరీంనగర్ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న చిరకాల వాంఛ నెరవేర్చనుంది. సికింద్రాబాద్ – దాణాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు (12791/92) ఈనెల 12 నుంచి జమ్మికుంటలో ఆగనుంది. ప్రతిరోజు ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య జమ్మికుంటలో ఈ రైలు ఆగనుంది. దాణాపూర్ ఎక్స్ ప్రెస్‌ను జమ్మికుంటలో ఆపేలా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గత కొన్నేళ్లుగా కోరుతున్నారు. ఇంకా చదవండి
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చాలా చిత్రవిచిత్రంగా మారుతున్నాయి. నోటిఫికేషన్ రాకుండానే ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాంటిదే మహిళా కమిషన్ ఛైర్‌పర్శన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా. అసలు ఆమె ఎందుకు రాజీనామా చేశారు. దీని వెనుకు ఉన్న రాజకీయ కారణమేంటనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. జగన్‌కు అత్యంత నమ్మకమైన వైసీపీ నేతల్లో వాసిరెడ్డి పద్మ ఒకరు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెను మహిళా కమిషన్ చైర్‌పర్శన్‌గా చేశారు. ఆమె ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ సమీకరణాలతో ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో ఈ పదవిని జగన్ అప్పగించారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్శన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వంపై ఈగ వాలనీయకుండా చూసుకున్నారు. ప్రభుత్వానికి మహిళలకు మధ్య వారదిలా నిలిచారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రాలు, దిశ చట్టం గురించి విస్తృతంగా ప్రచారం కల్పించారు. ఇంకా చదవండి
ప్రభుత్వం మారినా వాలంటీర్లు ఉంటారా?
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆ వ్యవస్థను పెట్టి ఓటర్లను ప్రజలను బెదిరిస్తున్నారని.. ప్రజాధనంతో పార్టీ పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే విపక్షాలన్నీ వాలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకుని వైసీపీ నేతలు.. టీడీపీ వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా టీడీపీ అధినేత.. తాము వాలంటీర్ వ్యవస్థను తీసేయబోమని ప్రకటించారు. ఇంకా వారికి మెరుగైన అవకాశాలు కలిపిస్తామని.. కానీ వైసీపీకి మాత్రం ఊడిగం చేయవద్దని అంటున్నారు. ఇంకా చదవండి
మార్చి 12 నుంచి రంజాన్ మాసం ప్రారంభం - వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఈ నెల 12 (మంగళవారం) నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తోన్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధుల నుంచి గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే తమ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, నెలవంక దర్శనం మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇస్లాంలో రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపైకి అవతరించగా.. దీనికి ప్రతీకగానే ఈ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాసాలు ఆచరిస్తారు. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ముస్లింలు ఉపవాస దీక్షను ప్రారంభించి ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇంకా చదవండి