అన్వేషించండి

Andhra Pradesh Women Commission Chairperson: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్శన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా

Andhra News: ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్శన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు.

Vasireddy Padma: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చాలా చిత్రవిచిత్రంగా మారుతున్నాయి. నోటిఫికేషన్ రాకుండానే ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాంటిదే మహిళా కమిషన్‌ ఛైర్‌పర్శన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా. అసలు ఆమె ఎందుకు రాజీనామా చేశారు. దీని వెనుకు ఉన్న రాజకీయ కారణమేంటనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. 

జగన్‌కు అత్యంత నమ్మకమైన వైసీపీ నేతల్లో వాసిరెడ్డి పద్మ ఒకరు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెను మహిళా కమిషన్ చైర్‌పర్శన్‌గా చేశారు. ఆమె ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ సమీకరణాలతో ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో ఈ పదవిని జగన్ అప్పగించారు. 
మహిళా కమిషన్ ఛైర్‌పర్శన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వంపై ఈగ వాలనీయకుండా చూసుకున్నారు. ప్రభుత్వానికి మహిళలకు మధ్య వారదిలా నిలిచారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రాలు, దిశ చట్టం గురించి విస్తృతంగా ప్రచారం కల్పించారు. 

టికెట్ ఆశించి భంగపడ్డ 
మహిళా కోటాలో ఈసారి వైసీపీ టికెట్ తనకు వస్తుందని చాలా బలంగా నమ్మారు వాసిరెడ్డి పద్మ. మైలవరం, జగ్గయ్యపేట రెండింటిలో ఏదో ఒక చోట నుంచి తనకు టికెట్ వస్తుందని కూడా ఆశించారు. కానీ సమీకరణాలు, ఇతర కారణాలతో ఆమెకు టికెట్ ఇవ్వలేకపోయారు. దీనిపై కాస్త నొచ్చుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే తన రాజీనామాకు పార్టీ టికెట్‌కు సంబంధం లేదని చెబుతున్నారు.

జగన్‌ను సీఎం చేయడానికే రాజీనామా 
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైసీపీ ప్రభుత్వం వచ్చేందుకు, జగన్‌ను రెండోసారి సీఎంగా చేసేందుకే రాజీనామా చేసినట్టు వాసిరెడ్డి పద్మ చెబుతున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేమని.. అందుకే ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలతో మమేకం కావాలన్నా... ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాలన్నా పార్టీ వేదికే అందుకు కరెక్ట్‌గా వాసిరెడ్డి పద్మ భావిస్తున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget