Top Headlines Today: ఏపీ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ఇందిరమ్మ ఇళ్లపై గుడ్‌న్యూస్ - నేటి టాప్
AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
జగన్ ఓడిపోయారే తప్ప చనిపోలేదు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయారే తప్ప చనిపోలేదని అంటున్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఫలితాలు తర్వాత జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలో తెలిసిన వ్యక్తుల వద్ద ఈ కామెంట్స్ చేశారు. దీన్ని ఎవరో సీక్రెట్‌గా షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో జగన్ మోహన్ పై అయన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంకా చదవండి
మంత్రులకు శాఖలు కేటాయింపు..
ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం పూర్తయింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తుండగా.. ఆయన వద్ద లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ తోపాటు కొన్ని శాఖలు ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి ఐటి, ఆర్టీజి శాఖలను కేటాయించారు. మరో సీనియర్ నేత కింజరాపు అచ్చెం నాయుడుకు వ్యవసాయ, కో - ఆపరేషన్, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్యకార శాఖలను కేటాయించారు. ఇంకా చదవండి
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్
తెలంగాణలో మరో పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇన్నాళ్లూ ఎన్నికల కోడ్ కారణంగా ముందు కదలని ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేసి ప్రజల కళ్లల్లో సంతోషాన్ని నింపాలని భావిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో పేదలకు ఇల్లు ఒకటి. ఇప్పటికే ప్రజాపాలన పేరుతో అర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. ఇప్పుడు వాటి దుమ్ముదులిపే పనిలో పడ్డారు అధికారులు. ఇంకా చదవండి
చంద్రబాబు, పవన్ అందుకొనే వేతనమెంత? ఎమ్మెల్యేలకు ఎంత వస్తుంది?
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు బాధ్యతలు తీసుకుంటున్నారు. అయితే పదవిలో ఉన్నంత కాలం వారికి వచ్చే శాలరీ ఎంత ఇతర సౌకర్యాలు ఏముంటాయనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు జీతమెంత? పవన్ ఎంత జీతం తీసుకోబోతున్నారు? ఎమ్మెల్యేలకు నెలకు ఎంత వస్తుంది? వీరికున్న సౌకర్యాలేంటి? దేశంలోని వివిద రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల జీతాల సంగతేంటి? వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల వేతనాలు ఎలా ఉంటాయి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా చదవండి
నాడు రద్దు చేయాలనుకున్న శాసనమండలే నేటి ఆయుధం
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోలర్ కోస్టర్ రైడ్‌గా మారుతున్నాయి. ఐదేళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను ఎలా ఎగతాళి చేశారో.. ఎలా రివర్స్ రాజకీయం చేశారో అవన్నీ ఇప్పుడు ఆయనకే ఎదురొస్తున్నాయి. ఇదీ కదా స్క్రిప్ట్ అంటే అన్నట్లుగా మారుతున్నాయి. అప్పట్లో అసెంబ్లీలో మాట్లాడుతూ.. తాము మరో ముగ్గురు ఎమ్మెల్యేల్ని లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని సెటైర్లు వేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష పార్టీకి అవసరమైన స్థానాలు కూడా రాలేదు. ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు. అసెంబ్లీలో మాట్లాడే చాన్స్ దాదాపుగా రాదు. ఇంకా చదవండి