YS Jagan: జగన్ ఓడిపోయారే తప్ప చనిపోలేదు- వైరల్ అవుతున్న అయ్యన్న కామెంట్స్
TDP MLA Ayyanna Patrudu Comments Viral: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ ఓటమిపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయారే తప్ప చనిపోలేదని అంటున్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఫలితాలు తర్వాత జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలో తెలిసిన వ్యక్తుల వద్ద ఈ కామెంట్స్ చేశారు. దీన్ని ఎవరో సీక్రెట్‌గా షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో జగన్ మోహన్ పై అయన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయ్యన్నపాత్రుడిని కలవడానికి వచ్చిన వ్యక్తి మాట్లాడుతూ... వాడు ఓడిపోయాడేగాని సావలా. అపారమైన ధనబలం ఉంది. కుల బలం ఉంది. పక్క గవర్నమెంట్‌లో ఈయన మనుషులు ఉన్నారు. అని అంటే... లెగకుండా కొట్టాలా అని అయ్యన్న రియాక్ట్ అయ్యారు. మీరు చెప్పాలు కదా.. ఓడిపోయాడు కానీ చావలేదని అది మంచి డైలాగ్. దీనికి ఆ పెద్దాయని రియాక్ట్ అవుతూ... డబ్బుకు అమ్ముడుపోనివాడు దేశంలో లేడు. ఆ డబ్బు పవర్ ఇప్పటికీ ఆయనకు ఉందని అభిప్రాయపడ్డారు.
దీనిపై స్పందించిన అయ్యన్న... ఓడిపోయాడు కానీ చావలా అనే డైలాగ్ బాగుందని... పామును చచ్చే వరకు కొట్టాలన్నారు. మీరు అయితే కరెక్ట్‌గా రిసీవ్ చేసుకుంటారని మీతో చెబుతున్నానని ఆ పెద్దాయని అభిప్రాయపడ్డారు. కచ్చితంగా తర్వాత ఈ డైలాగ్ వాడతాని అయ్యన్న వాళ్లుకు సమాధానం ఇచ్చారు. అయన్నకు శుభాకాంక్షలు చెప్పి వాళ్లు వెళ్లిపోతున్న వరకే ఈ వీడియో ఉంది.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో కూడా జగన్‌పై అయ్యన్నపాత్రుడు వివాదాస్పద కామెంట్స్ చేశారు. వీలు చిక్కినప్పుడల్లా జగన్ టార్గెట్‌గా అయ్యన్న విమర్సలు చేస్తూనే ఉంటారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా అయ్యన్న ఇలాంటి విమర్శలు చేశారు. ఇప్పుడు అదే పంథాను కొనసాగిస్తున్నారు.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కేవలం 11 ఎమ్మెల్యేలను మాత్రమే గెల్చుకుంది. నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది.