Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Sankranti Holidays: ఏపీ ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులకు కనుమ రోజు కూడా సెలవు ప్రకటించింది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు సోమవారం సవరణ చేస్తూ జీవో విడుదల చేసింది.

AP Government Extended Holidays For Banks: సంక్రాంతి సందర్భంగా బ్యాంకు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. వారికి పండుగ సెలవులు మరో రోజు పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సీఎస్ విజయానంద్ (CS Vijayanand) ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, 2025 ప్రభుత్వ సెలవుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు సర్కారు జనవరి 14న సంక్రాంతి రోజు మాత్రమే సెలవుగా ప్రకటించింది. కనుమ రోజు బుధవారం యథావిధిగా బ్యాంకులు పని చేస్తాయని తొలుత వెల్లడించింది. అయితే, కనుమ రోజు కూడా సెలవు ప్రకటించాలని యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్, ఏపీ స్టేట్ యూనియన్ కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన సర్కారు.. కనుమ రోజు కూడా సెలవును పొడిగించింది. దీంతో మంగళ, బుధవారాల్లో బ్యాంకులకు హాలిడే ఉండనుంది. ఈ మేరకు సవరించిన జీవో నెం.73ను విడుదల చేసింది.
Before You Go
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























