అన్వేషించండి

Morning Top News: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ ఆగ్రహం - ఢిల్లీలో 40పైగా స్కూల్స్‌కు బాంబు బెదిరింపు వంటి మార్నింగ్ న్యూస్

Top 10 Headlines Today: రాయచోటినియోజకవర్గంలో  అయ్యప్పస్వామి భక్తుల పై దాడి, సంధ్య థియేటర్‌ ఘటనలో ముగ్గురి అరెస్ట్‌ వంటి మార్నింగ్ టాప్ న్యూస్

Morning Top News:

ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవేనా: కేసీఆర్
తెలంగాణ తల్లి రూపం మార్చడంపై మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని, మూర్ఖంగా వెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అని ప్రశ్నించారు. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని అంశాల వారీగా నిలదీయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
బాంబు ఉంది అంటూ మెయిల్స్  
ఢిల్లీలో ఉదయాన్నే కలకలం రేగింది. మార్నింగ్ పిల్లలు స్కూల్‌కు వెళ్తున్న టైంలో బాంబు బెదిరింపు ఈమెయిల్‌ పరుగులు పెట్టించింది. ఒకటి కాదు రెండు కాదు 40కిపైగా స్కూల్స్‌కు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ స్కూల్స్‌లో పేరుతున్న బడులు కూడా ఉన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి 
 
ఈనెల 15 వరకు వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉందన్నారు.  దీని ప్రభావంతో ఈ నెల 15 వరకూ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
విజయ్ సాయి రెడ్డిపై సీపీకి ఫిర్యాదు చేసిన బుద్ధ వెంకన్న
విజయవాడ పట్టణ పరిధిలోని పోలీస్ కమిషనర్‌ను టిడిపి నేత బుద్ధ వెంకన్న కలిసి విజయ సాయి రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు బుద్ద వెంకన్న. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. 2019 నుంచి 2024 వరకు వైసిపి నాయకులు చేసిన దాడులు దారుణాలు అన్ని ఇన్ని కావని విమర్శించారు. వార చేసిన తప్పులు పాపాలను ఎత్తి చూపితే కులం పేరుతో కుట్రలు చేస్తారా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
టీ ఫైబర్ స్టార్ట్.. ఇంటింటికి హైస్పీడ్ ఇంటర్‌నెట్
ప్రజా విజయోత్సవాల్లో భాగంగా టీఫైబర్‌ సేవలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. టీఫైబర్ స్కీమ్‌ కింద తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ తక్కువ ధరకే ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంట్లో ఉండే మొబైల్, కంప్యూటర్, టీవీలకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్‌నెట్ అందించనున్నామన్నారు. టీ ఫైబర్ సర్వీస్‌ను రానున్న రోజుల్లో మరింత సులభతరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మీసేవ మొబైల్ యాప్‌నూ ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి
తెలంగాణలో లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఓ 8 ఏళ్ల బాలికపై 36 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిర్మల్-లక్ష్మణ్ చందా లోని ఓ గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలిక తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా.. సాగర్ అనే వ్యక్తి, బాలికకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగికదాడి చేశాడు. బాలిక దారుణాన్ని తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
సంధ్య థియేటర్‌ ఘటన.. ముగ్గురి అరెస్ట్‌
పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. థియేటర్‌ యాజమాన్యానికి సంబంధించి ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
శబరిమల వెళ్లే భక్తులు శుభవార్త
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా.. తాజాగా మరిన్ని అదనపు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ఆదివారం ప్రకటించింది. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 1 వరకూ 34 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్ - కొట్టాయం, కొట్టాయం - సికింద్రాబాద్, మౌలాలి - కొట్టాయం, కాచిగూడ - కొట్టాయం, మౌలాలి - కొల్లం మధ్య జనవరి 3 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ ఈ ప్రత్యేక సర్వీసులు సేవలందించనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య
కెనడాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తోన్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు వ్యక్తులు సదరు యువకుడిని వేధించడం సీసీ కెమెరాలో రికార్డైంది.  సెంట్రల్ మెక్‌డౌగల్ పరిసరాల్లోని 106వ స్ట్రీట్, 107వ అవెన్యూ వద్ద ఉన్న భవనం నుంచి కాల్పుల శబ్ధం వినిపించడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారు సంఘటనా స్థలంలో రక్తపు మడుగులో ఉన్న యువకుడిని గుర్తించి ఆస్పత్రికి తరలించారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
కోహ్లీ, రోహిత్ సత్తా చాటాల్సిందే 
టీమిండియా సీనియర్లు రోహిత్, కోహ్లీ టెస్టుల్లో గత కొంతకాలంగా విఫలమవుతూ విమర్శలకు గురవుతున్నారు. వాళ్లు సత్తా చాటే సమయం వచ్చిందని, ఆసీస్ టూర్ అందుకు తగిన వేదిక అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  వీళ్లిద్దరూ సత్తా చాటితే జట్టులోని యువ క్రికెటర్లకు కూడా బూస్టప్ లభిస్తుందని, తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్ షిఫ్ ఫైనల్ కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Embed widget