అన్వేషించండి
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
Pushpa 2 Box Office Collection Day 4: మూడు రోజుల్లో రూ. 621 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. నాలుగో రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అంటే...

నాలుగు రోజుల్లో పుష్ప 2 ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
1/5

Pushpa 2 box office collection worldwide day 4: నార్త్ ఇండియాలో ఆదివారం 'పుష్ప 2' దుమ్ము దులిపింది. విడుదలైన రోజు 70 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ సాధిస్తే... శుక్రవారం ఆల్మోస్ట్ 60 కోట్లు శనివారం 73.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఆదివారం మాత్రం 85 కోట్ల రూపాయలను వసూలు చేసింది. హిందీలో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప 2 హిందీ వర్షన్ ఫస్ట్ వీకెండ్ నెట్ కలెక్షన్స్ 285 కోట్ల రూపాయలు. బాలీవుడ్ హీరోలకు సైతం దక్కని ఘనతను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాధించారు.
2/5

మూడు రోజుల్లో పుష్ప 2 ది రూల్ సినిమాకు 621 కోట్ల రూపాయలు వచ్చాయని ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. మూవీ కలెక్షన్స్ రిపోర్ట్ చేసే ట్రేడ్ పోర్టల్స్ ప్రకారం... ఫస్ట్ వీకెండ్ అంటే నాలుగో రోజు కూడా కలుపుకొని ఇండియాలో 529.45 కోట్ల రూపాయలు వచ్చాయట.
3/5

మరొకవైపు ఓవర్సీస్ మార్కెట్లో కూడా 'పుష్ప 2' సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. అక్కడ ఎలా లేదన్న 180 నుంచి 200 కోట్ల రూపాయల గ్రాస్ లభించే అవకాశం ఉంది. పుష్ప ఫస్ట్ వీకెండ్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 750 నుంచి 780 కోట్ల మధ్యలో ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 9, సోమవారం సాయంత్రానికి టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్ వస్తుంది.
4/5

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ మొత్తంలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు వెళుతుంది. వీకెండ్ తర్వాత వసూళ్లు కొంత తగ్గుతాయి కనుక... 1000 కోట్ల మార్క్ చేరుకోవడానికి మరొక మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది.
5/5

అల్లు అర్జున్ మాత్రమే కాదు దర్శకుడు సుకుమార్ హీరోయిన్ రష్మిక కెరీర్లలో కూడా పుష్ప 2 సినిమాయే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కే అవకాశం ఉంది. రష్మిక నటించిన యానిమల్ కలెక్షన్లను 'పుష్ప 2' అధిగమించే అవకాశం ఉంది.
Published at : 09 Dec 2024 08:26 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion