Crime News: తెలంగాణలో మరో అమానుషం, ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడిపై కేసు నమోదు!
Nirmal News : మనతోనే ఉంటారు. మన పక్కనే తిరుగుతుంటారు. ప్రేమగా మాట్లాడుతుంటారు. ఇంత ప్రేమ చూపిస్తుంటే మన వాళ్లేలనని నమ్మారో అంతే సంగతులు. ఆడ పిల్లలున్న తల్లిదండ్రులూ మృగాళ్లున్నారు జాగ్రత్త.

Nirmal Crime News : మనతోనే ఉంటారు. మన పక్కనే తిరుగుతుంటారు. జాలి చూపిస్తుంటారు. ప్రేమగా మాట్లాడుతుంటారు. ఇంత ప్రేమ చూపిస్తుంటే మన వాళ్లేలనని నమ్మారో అంతే సంగతులు. ఆడ పిల్లలున్న తల్లిదండ్రులూ మృగాళ్లున్నారు జాగ్రత్త. సమాజంలో మనుషులు రోజురోజుకూ విచక్షణ కోల్పోయి జంతువులా మారి ప్రవర్తిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా సమాజ మర్యాదలను మరచి పోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి దారుణాలను అదుపు చేయలేకపోతున్నారు. ఎవరిని నమ్మాలో లేదో తెలియక పరిస్థితులు ఎదురవుతున్నాయి. సమాజంలో మనుషుల వేషధారణలో మృగాళ్లు సంచరిస్తుంటే వాటి నుంచి తమ చిన్నారులను ఎలా కాపాడుకోవాలో తల్లిదండ్రులకు అంతుచిక్కని దుస్థితి నెలకొంది. చదువురాని వారే ఇలా చేస్తున్నారని కాదు. విద్యావంతులు కూడా ఇలాగే ఉంటారు. వారి ఆలోచనలు ఎంతగా కుళ్లిపోయాయో ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న ఘటనలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి లైంగిక దాడులను సమాజం నుంచి దూరం చేయాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు సమాజంలో సమాధానం లేని ప్రశ్నగా మారింది.
8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి
ప్రస్తుతం దేశంలో లైంగిక దాడుల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా నిత్యం ఎక్కడో ఒకచోట బాలికలపై ఈ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. అభంశుభం ఎరుగని ఎనిమిదేళ్ల పై 36 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ - లక్ష్మణ్ చందా లోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా.. బొమ్మెన సాగర్(36) అనే వ్యక్తి.. ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ బాలికపై లైంగికదాడి చేసి.. అక్కడి నుంచి తనను పంపిచేశాడు. దీంతో ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లి.. జరిగిన సంఘటన గురించి తల్లికి వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండ్ కు పంపించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
చిన్నారులను చిదిమేస్తున్న మృగాలు
చిన్నారులపై రోజురోజుకు అకృత్యాలు పెరుగుతున్నాయి. లైంగిక దాడులతో చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. కొంత మంది బయటకు చెప్పుకుంటున్నారు. మరి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ పరువు పోతుందని నోరు కట్టేసుకుంటున్నారు. పిల్లలు బయట తిరగడం కష్టం అవుతుందని బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలోనే కామాంధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులపై కఠిమైన చర్యలు తీసుకోవాలని పలు సామాజిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. నిందితులకు ఉరి వేసేలా కఠిన శిక్షలు అమలు చేయాలని పేర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా చాక్లెట్లు కొంటానంటూ ఓ ఎనిమిదేళ్ల చిన్నారిని దుకాణానికి తీసుకెళ్లిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా చండూరు మండలంలో చోటుచేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు బాబీపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

